Just In
- 11 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 13 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 15 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 16 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- News
రెండోరోజు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష..కంటిన్యూ: తెల్లవారు జాము నుంచే దీక్షా శిబిరంలో
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Movies
కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టీవీఎస్ జూపిటర్‌లో కొత్త బేస్ వేరియంట్ విడుదల: ధర, వివరాలు
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ 110సీసీ స్కూటర్ జూపిటర్‌లో తాజాగా ఓ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ.63,497 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఈ కొత్త టీవీఎస్ జూపిటర్ షీట్ వైట్ మెటల్ వేరియంట్ ఈ స్కూటర్ లైనప్‌లోనే అత్యంత చవకైనది. ప్రస్తుతం ఈ స్కూటర్ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. కొత్త వేరియంట్ విడుదలతో పాటుగా టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలను కంపెనీ సవరించింది.

కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ స్కూటర్ల ధరలను రూ.1,645 నుండి రూ.2,770 మేర పెంచారు. తాజా పెంపు తర్వాత స్టాండర్డ్ మోడల్ ధర రూ.65,497, జెడ్‌ఎక్స్ ధర రూ.68,247, జెడ్‌ఎక్స్ డిస్క్ ధర రూ.72,347 మరియు క్లాసిక్ ధర రూ.72,472 గా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఈ కొత్త వేరియంట్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 110సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ స్కూటర్‌లో టీవీఎస్ పేటెంట్ ఎకోనోమీటర్, ఎకో మోడ్ మరియు పవర్ మోడ్ ఆప్షన్లు ఉంటాయి. జూపిటర్ సిరీస్ స్కూటర్లలో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడి టెయిల్-లైట్, అప్‌డేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2-లీటర్ ఓపెన్ గ్లోవ్‌బాక్స్, ఫ్రంట్ యుఎస్‌బి ఛార్జర్ (జెడ్‌ఎక్స్ మరియు క్లాసిక్ వేరియంట్లలో మాత్రమే), బాహ్య ఇంధన ఫిల్లింగ్ క్యాప్, 21-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ స్కూటర్‌లో రెండు వైపులా 12 ఇంచ్ వీల్స్, ఐ-టచ్ స్టార్ట్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫోర్కులు, విండ్‌షీల్డ్ (క్లాసిక్ వేరియంట్‌లో) వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. అదనంగా, టీవీఎస్ జూపిటర్ ఇగ్నిషన్, స్టీరింగ్ లాక్, సీట్ లాక్ మరియు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఓపెనర్‌తో సహా ఆల్ ఇన్ లాక్ మెకానిజంను కలిగి ఉంటుంది.

టీవీఎస్ జూపిటర్ మెరుగైన ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, మంచి మైలేజ్‌ను ఆఫర్ చేస్తూ, సిటీ రోడ్లపై రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇది ఈ విభాగంలో హోండా యాక్టివా 6జి మరియు హీరో మాస్ట్రో వంటి స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది. కొత్తగా విడుదలైన బేస్ వేరియంట్ కారణంగా, ఈ స్కూటర్ అమ్మకాలు ఎలా ప్రభావితమవుతాయో వేచి చూడాలి.

టీవీఎస్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ అపాచీ సిరీస్‌లోని అన్ని మోటార్‌సైకిళ్లను ధరలను పెంచింది. ఇందులో అపాచీ ఆర్‌టిఆర్ 160, అపాచీ ఆర్‌టిఆర్ 180, అపాచీ ఆర్‌టిఆర్ 160 వి, అపాచీ ఆర్‌టిఆర్ 200 4 వి మరియు అపాచీ ఆర్ఆర్ 310 మోడళ్లు ఉన్నాయి.

కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి టీవీఎస్ అపాచీ ధరలు రూ.1,520 నుండి రూ.3,000 మేర పెరిగాయి - మోడల్, వేరియంట్ల వారీగా తాజా ధరల వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.