కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీలలో ఒకటైన టీవీఎస్ మోటార్ కంపెనీ, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ అపాచీ సిరీస్‌లో ఓ కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మునుపటి కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌తో కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి మోడల్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

మార్కెట్లో కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి ధర రూ.1.07 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఈ కొత్త 2021 మోడల్‌లో కంపెనీ ఈ బైక్ ఇంజన్‌ను మార్పు చేసింది. ఫలితంగా ఇప్పుడు ఇది ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్‌గా మారింది.

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి బైక్‌లో ఇప్పుడు అడ్వాన్స్ 159.7సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9250 ఆర్‌పిఎమ్ వద్ద 17.63 బిహెచ్‌పి శక్తిని మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మునుపటిలానే 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:త్వరపడండి.. హోండా యాక్టివా 125 పై 5000 క్యాష్‌బ్యాక్ ఆఫర్, వారికి మాత్రమే

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ ఇంజన్ అప్‌గ్రేడ్ తర్వాత కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి, ఇప్పు ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన బైక్‌గా మారిందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో కార్బన్ ఫైబర్ నమూనాతో కూడిన కొత్త డ్యూయల్ టోన్ సీటును అమర్చారు. అలాగే, దీని హెడ్‌లైట్ సెటప్‌ను కూడా స్వల్పంగా రీడిజైన్ చేశారు.

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4విలోని ఈ లేటెస్ట్ మోడల్ ఇప్పుడు మునపటి కన్నా రెండు కిలోలు తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేక్ వేరియంట్ బరువు 147 కిలోలు మరియు డ్రమ్ వేరియంట్ బరువు 145 కిలోలుగా ఉంటుంది. ఇది రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్ మరియు మెటాలిక్ బ్లూ వంటి మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

MOST READ:రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

కొత్త 2021 మోడల్ టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4విలో ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్, స్పోర్టీ ఇంజన్ కౌల్, సెగ్మెంట్-ఫస్ట్ గ్లైడ్ ఫీచర్ మరియు సింగిల్ ఛానల్ సూపర్-మోటో ఏబిఎస్ టెక్నాలజీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఇంకా ఇందులో పూర్తి ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, ల్యాప్ టైమర్‌తో కూడిన సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

గడచిన జనవరి 2021 నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఆర్‌టిఆర్ సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరలను పెంచింది. ఆ సమయంలో అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి డ్రమ్ వేరియంట్ ధర రూ.1.02 లక్షలుగా ఉంటే, డిస్క్ వేరియంట్ ధర రూ.1.05 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

MOST READ:బెంగళూరులో మీకు నచ్చిన బైక్ డ్రైవ్ చేయాలంటే.. ఇలా బుక్ చేయండి

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

ఈ కొత్త 2021 మోడల్ విడుదలతో కంపెనీ ఈ వేరియంట్ ధరలను మరోసారి పెంచినట్లు అయింది. ప్రస్తుతం అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.1.07 లక్షలు మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.1.10 లక్షలుగా ఉంది. మునుపటి ధరలతో పోలిస్తే, ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.5000 మరియు రూ.8000 మేర పెరిగాయి.

కొత్త 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ఇప్పుడు అధిక పవర్‌తో..

టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయిస్తున్న మొత్తం టూవీలర్ అమ్మకాలలో అపాచీ సిరీస్ అమ్మకాలే అధిక వాటాను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా వచ్చిన అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి మోడల్ యొక్క ధరల పెరుగుదలను కస్టమర్లు ఎలా స్వీకరిస్తానేది వేచి చూడాలి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

MOST READ:ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే

Most Read Articles

English summary
TVS Launches New 2021 Apache RTR 160 4V In India: Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X