కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

కోవిడ్-19 మహమ్మారి తర్వాత దేశంలో ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా గతేడాది తీవ్రంగా నష్టపోయిన చెన్నైకి చెందిన టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాది జనవరి (2021) నెలను అద్భుతంగా ప్రారంభించింది.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

టీవీఎస్ మోటార్ కంపెనీ జనవరి 2021 నెల అధికారిక అమ్మకాల నివేదికను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 2,94,596 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు పేర్కొంది. ఇది జనవరి 2020 అమ్మకాల కంటే 34 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

జనవరి 2020 నెలలో కంపెనీ 2,20,439 యూనిట్ల ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది. గత నెలలో కంపెనీ మొత్తం దేశీయ అమ్మకాలు 2,05,216 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు సంవత్సరం దేశీయ అమ్మకాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికంగా ఉంది.

MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్‌రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

గత నెలలో కేవలం మోటార్‌సైకిల్ అమ్మకాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, కంపెనీ జనవరి 2021లో మొత్తం 1,36,790 యూనిట్ల మోటార్‌సైకిళ్లను విక్రయించింది. జనవరి 2020తో పోలిస్తే ఇవి 45 శాతం అధికంగా ఉన్నాయి.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

ఇక స్కూటర్ల విషయానికి వస్తే, టీవీఎస్ మోటార్ కంపెనీ జనవరి 2021లో మొత్తం 98,319 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. ఇది గత ఏడాది జనవరి (2020)తో పోలిస్తే 36 శాతం అధికంగా ఉంది.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

భారత మార్కెట్ నుండి టీవీఎస్ ఎగుమతి చేసిన వాహనాల విషయానికి వస్తే, జనవరి 2021 లో కంపెనీ మొత్తం 1,00,926 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది జనవరి 2020 ఎగుమతులతో పోలిస్తే 43 శాతం అధికంగా నమోదైంది. జనవరి 2020లో టీవీఎస్ మొత్తం 70,784 యూనిట్ల వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

త్రీ వీలర్ విభాగంలో టీవీఎస్ అమ్మకాల విషయానికి వస్తే, జనవరి 2021 లో కంపెనీ 12,553 యూనిట్ల త్రిచక్ర వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది. గత ఏడాది జనవరి (2020)లో వీటి సంఖ్య 14,481 గా నమోదైంది. ఈ సమయంలో త్రీ వీలర్ అమ్మకాలు 13.3 శాతం క్షీణించాయి.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

ఇక టీవీఎస్ మోటార్ కంపెనీకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా తమ అపాచీ సిరీస్ బైక్‌ల ధరలను సవరించింది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ధరలు రూ.1,520 నుండి రూ.3,000 మేర పెరిగాయి.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

ప్రస్తుతం టీవీఎస్ అపాచీ సిరీస్‌లో అపాచీ ఆర్టీఆర్ 160, అపాచీ ఆర్టీఆర్ 180, అపాచీ ఆర్టీఆర్ 160 4వి, అపాచీ ఆర్టీఆర్ 200 4వి మరియు అపాచీ ఆర్టీఆర్ 310 మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

టీవీఎస్ ఇటీవలే తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ఐక్యూబ్‌ను బెంగళూరు మార్కెట్లో కూడా విడుదల చేసింది. కంపెనీ ఈ స్కూటర్‌ను త్వరలోనే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తొలిసారిగా జనవరి 2020 లో భారత మార్కెట్లో విడుదల చేశారు. భారత మార్కెట్లో ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

కరోనా భయంతో పెరిగిన టూవీలర్ సేల్స్; జనవరిలో టీవీఎస్ కొత్త రికార్డ్

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ల మోటారుతో పనిచేస్తుంది, ఇది గరిష్టంగా 140 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కి.మీ. వేగాన్ని చేరుకుంటుంది.

Most Read Articles

English summary
TVS Motor Company Registers 34 Percent Growth In January 2021 Sales. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X