TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. లుక్ సూపర్ గురూ..!!

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ TVS Motor (టీవీఎస్ మోటార్) దేశీయ మార్కెట్లో తన ఉత్పత్తులైన TVS Radeon (టీవీఎస్ రేడియన్) మరియు TVS XL100 (టీవీఎస్ ఎక్స్ఎల్ 100) ను కొత్త కలర్ ఆప్సన్స్ తో విడుదల చేసింది. ఈ కొత్త బైక్స్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

TVS Radeon ఇప్పుడు రెండు కొత్త డ్యూయెల్ కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. అవి బ్లూ/బ్లాక్ మరియు రెడ్/బ్లాక్ కలర్స్. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక TVS XL100 కోరల్ సిల్క్ షేడ్‌ అనే కొత్త కలర్ లో అందుబాటులో ఉంటుంది. ఈ కలర్ మునుపటి కలర్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

TVS Radeon యొక్క డ్యూయల్ టోన్ వేరియంట్ ఇతర వేరియంట్‌ల కంటే కొంచెం ఎక్కువ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. TVS Radeon యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 68,982 (ఎక్స్-షోరూమ్) కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 71,982 (ఎక్స్-షోరూమ్).

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

ఇక కొత్త TVS XL100 యొక్క కోరల్ సిల్క్ షేడ్ ధర రూ. 41,015 (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులోని దాని టాప్ వేరియంట్ ధర రూ. 52,334 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

టీవీఎస్ రేడియన్ యొక్క కొత్త కలర్ ఆప్షన్‌ల విషయానికి వస్తే, ఇందులోని రెండు బైకుల యొక్క రెండు డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తాయి, మిగిలిన మోటార్‌సైకిల్ భాగం మొత్తం బ్లాక్ కలర్‌లో ఉంచబడింది. పెయింట్ స్కీమ్‌ను బట్టి, సైడ్ ప్యానెల్‌లో రెడ్ కలర్ లేదా బ్లూ కలర్ ఫీచర్ ఇవ్వబడింది. కొత్త టీవీఎస్ రేడియన్ బైక్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌ తప్పా ఇక ఇటుఅన్తి మార్పు జరగలేదు.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

టీవీఎస్ రేడియన్ లోని ఇంజిన్, సస్పెన్షన్ మరియు బ్రేకులు ప్రస్తుత మోడల్ ఉన్న మాదిరిగానే ఉంచబడ్డాయి. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ మరియు USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా అలాగే ఉంచబడ్డాయి. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న మరియు రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ కొత్త కలర్ ఆప్సన్ తీసుకువచ్చింది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

టీవీఎస్ రేడియన్ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 4 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలుస్తుంది. దీని జ్ఞాపకార్థం ఈ కొత్త కలర్ ఆప్సన్ ప్రవేశపెట్టబడ్డాయి, అంతే కాకుండా టీవీఎస్ రేడియన్ దేశంలో మొత్తం 10 పెయింట్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

టీవీఎస్ రేడియన్ మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా, మంచి ఇంధన సామర్త్యాన్ని కూడా అందిస్తుంది. ఈ బైక్ లో 109.7 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ 8.08 బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

ఇక కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త TVS XL100 విషయానికి వస్తే, ఇది కొత్త కోరల్ సిల్క్ షేడ్ కలర్ లో మాత్రమే కాకుండా, ఇప్పటికే మింట్ బ్లూ, లస్టర్ గోల్డ్, రెడ్ బ్లాక్ మరియు గ్రే బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కూడా విక్రయించబడుతోంది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్ ప్రవేశపెట్టింది. TVS XL100 మొత్తం 5 వేరియంట్‌లలో విక్రయించబడుతోంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

TVS XL100 బైక్ 99.7 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్ట్, 4 స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 4.3 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

TVS XL100 ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించబడుతోంది. ఇది మంచి ఇంధన సామర్త్యం అందిస్తున్న కారణంగా మరియు తక్కువ ధరకు లభ్యం కాడం వల్ల గ్రామీణ ప్రాంతాలు మరియు అర్బన్ ప్రాతాలలో ఎక్కువగా వినియోగంలో ఉంది. TVS XL100 కంఫర్ట్ i-TOUCHstart ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీని కలిగి ఉంది, ఇది మోపెడ్‌ను త్వరగా మరియు నిశ్శబ్దంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

TVS XL100 మరియు Radeon ఇప్పుడు కొత్త కలర్‌లో.. సూపర్ లుక్ గురూ..!!

టీవీస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) గడచిన సెప్టెంబర్ 2021 నెల మోడల్ వారీ విక్రయాల వివరాలను వెల్లడి చేసింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ అమ్మకాల పరంగా మొదటి స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే కంపనీ యొక్క ఈ మోడల్ కి ఎంత డిమాండ్ ఉందొ అర్థమౌతుంది.

Most Read Articles

English summary
Tvs motor launches radeon and xl100 with new color options details
Story first published: Saturday, October 23, 2021, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X