వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు స్పైడర్ మ్యాన్‌తో.. సూపర్ కదా..!!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన టీవీఎస్ మోటార్ (TVS Motor) దేశీయ మార్కెట్లో తన కొత్త 'టీవీఎస్ ఎన్‌టార్క్‌ 125 మార్వెల్ సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌' (TVS Ntorq 125 SuperSquad Edition) విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త స్కూటర్ స్పైడర్‌మ్యాన్ మరియు థోర్ ప్రేరేపిత పెయింట్ స్కీమ్‌లో ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

TVS Motor కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎన్‌టార్క్‌ 125 మార్వెల్ సూపర్‌స్క్వాడ్ ఎడిషన్‌లో పెయింట్స్ మరియు గ్రాఫిక్స్ డిజైన్ మినహా సాంకేతికతల పరంగా ఎటువంటి అప్డేట్స్ చేయలేదు. కావున దాని మునుపటి మోడల్ లోని దాదాపు చాలా ఫీచర్స్ ఇందులో ఉంటాయి. కానీ ఇది స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా మరియు చూడటానికి మరింత ఆకర్షనీయంగా ఉంటుంది.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

TVS NTorq అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, 12 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పెటల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్ప్లిట్ గ్రాబ్ రైల్, USB ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు TVS Ntorq 3D లోగో వంటివి కలిగి ఉంటాయి.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

TVS NTorq యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 124.8సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ఉంటుంది. ఇది 9.25 బిహెచ్‌పి పవర్ మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. అంతే కాకూండా మంచి పరిధిని కూడా అందిస్తుంది.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

ఈ కొత్త స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది, కావున బ్లూటూత్ సహాయంతో స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు కనెక్ట్ చేయవచ్చు. అంతే కాకుండా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారుల కోసం టీవీఎస్ కనెక్ట్ యాప్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్లికేషన్‌లో 15 విభిన్న వాయిస్ కమాండ్‌లను ఇవ్వవచ్చు. నావిగేషన్, రైడింగ్ మోడ్, రైడ్ హిస్టరీ, మైలేజ్ మరియు కన్సోల్ బ్రైట్‌నెస్ వంటివి అందుబాటులో ఉంటాయి.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

TVS Ntorq స్కూటర్ అనేది యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ప్రీమియం స్పోర్ట్ ఎడిషన్ స్కూటర్. ఈ విభాగంలో కంపెనీ యొక్క TVS Ntorq మాత్రమే కాకుండా Yamaha Ray ZR, Aprilia Storm 125 మరియు Hero Maestro Edge వంటి స్కూటర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇనియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. హీరో మాస్ట్రో ఎడ్జ్ యొక్క స్టీల్త్ ఎడిషన్ కూడా ఇటీవలే ప్రారంభించబడింది.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

భారతదేశంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిస్క్ మరియు డ్రమ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎన్‌టార్క్ 125 డ్రమ్ వేరియంట్ రూ. 71,095 కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 75,395 వరకు ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ప్రాతిపదికన నిర్ణయించడం జరిగింది.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

TVS గత సంవత్సరం NTorq 125 యొక్క అవెంజర్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిలో ఈ స్కూటర్ ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంథర్ మరియు కెప్టెన్ అమెరికా థీమ్‌లలో తీసుకురాబడింది. TVS మోటార్స్ కూడా రేస్ XP ఎడిషన్‌లో NTorq 125ని విక్రయిస్తోంది. ఈ స్కూటర్ రూ.83,275 ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

టీవీఎస్ మోటార్స్ ప్రస్తుతం దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆసియాన్ దేశాలతో సహా మొత్తం 19 కి పైగా దేశాలలో తన బ్రాండ్ యొక్క ఎన్‌టార్క్ 125 స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ టీవీఎస్ కంపెనీ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ని 2018 లో విడుదల చేసింది.

ఇదిలా ఉండగా TVS మోటార్ ఇటీవలే కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేయడానికి BMW మోటోరాడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారతదేశంలో స్కూటర్ల నుండి మోటార్ సైకిళ్ల వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల శ్రేణిని తయారు చేయడానికి రెండు కంపెనీలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేస్తాయి.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు భారతదేశంలోని TVS మోటార్ కంపెనీ యొక్క తయారీ కేంద్రాలలో తయారు చేయబడతాయి. వీటిని భారత్‌లో విక్రయించడంతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేసేందుకు కూడా సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. TVS మరియు BMW ఇప్పటికే భారతదేశంలో 310 సిసి మోటార్‌సైకిళ్లను భాగస్వామ్యంతో ఒక రకమైన ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేస్తున్నాయి.

వారెవ్వా.. TVS Ntorq 125 ఇప్పుడు లేటెస్ట్ కలర్ & లేటెస్ట్ డిజైన్‌తో

TVS మరియు BMW భాగస్వామ్యం కింద, TVS భారతదేశంలో మరియు విదేశీ మార్కెట్‌లలో విక్రయించడానికి BMW G 310 R మరియు BMW G 310 GS లను తయారు చేస్తుంది మరియు TVS తన ఫ్లాగ్‌షిప్ Apache RR 310 సూపర్‌స్పోర్ట్ మోడల్‌ను కూడా అదే ప్లాట్‌ఫారమ్‌లో అభివృద్ధి చేసింది. TVS మోటార్ సాధారణ EV ప్లాట్‌ఫారమ్‌లో వాహనాల ఉత్పత్తిని నిర్వహిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ ఆధునిక వాహనాలు ఈ ప్లాట్‌ఫారమ్‌లో రానున్నాయి.

Most Read Articles

English summary
Tvs ntorq 125 marvel supersquad edition launched details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X