కరోనా ఎఫెక్ట్; మార్కెట్లో ద్విచక్ర వాహన అమ్మకాల కుదేలు
భారతదేశంలో ద్విచక్రవాహన అమ్మకాలు సజావుగా సాగుతున్న వేళ కరోనా మహమ్మారి దీనిపై చాలా ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా 2021 ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ చాలా ఉదృతంగా ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ కారణంగా ఏప్రిల్ 2021 లో మొత్తం 9,53,338 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయని నివేదికల ద్వారా తెలుస్తోంది. విడుదలైన గణాంకాలు మునుపటి అమ్మకాల కంటే దాదాపు 33.95 శాతం తగ్గుదలను నమోదుచేశాయి.

భారత మార్కెట్లో నెలవారీ అమ్మకాలను గమనించినట్లయితే మార్చిలో మొత్తం 14,43,320 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించబడ్డాయి. ఈ నివేదిక ప్రకారం సుజుకి మోటార్‌సైకిల్స్ తప్ప మిగిలిన అన్ని ద్విచక్ర వాహన తయారీదారులు ఏప్రిల్‌లో నెలవారీ అమ్మకాలలో తగ్గుదలని నమోదుచేశాయని తెలుస్తుంది.

రోజురోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కరోనా నివారణ కోసం లాక్ డౌన్ వంటివి విధిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది.

ప్రస్తుతం విడుదలైన గణాంకాల ప్రకారం హీరో మోటోకార్ప్ అమ్మకాలు 37.06 శాతం తగ్గినప్పటికీ, నెలవారీ గణాంకాల ప్రకారం హీరో మోటోకార్ప్ ఇతర ద్విచక్ర వాహనాల కంటే ఎక్కువ అమ్మకాలను కలిగి ఉంది. 2021 ఏప్రిల్‌లో కంపెనీ మొత్తం 3,42,614 యూనిట్లను విక్రయించగా, 2021 మార్చిలో కంపెనీ 5,44,340 యూనిట్లను విక్రయించింది.

| Rank | Domestic | Apr-21 | Mar-21 | Growth (%) |
| 1 | Hero | 3,42,614 | 5,44,340 | -37.06 |
| 2 | Honda | 2,40,100 | 3,95,037 | -39.22 |
| 3 | TVS | 1,31,386 | 2,02,155 | -35.01 |
| 4 | Bajaj | 1,26,570 | 1,81,393 | -30.22 |
| 5 | Suzuki | 63,879 | 60,222 | 6.07 |
| 6 | Royal Enfield | 48,789 | 60,173 | -18.92 |
| Rank | Exports | Apri-21 | Mar-21 | Growth (%) |
| 1 | Bajaj | 2,21,603 | 1,48,740 | 48.99 |
| 2 | TVS | 94,807 | 1,05,282 | -9.95 |
| 3 | Honda | 42,945 | 16,000 | 168.41 |
| 4 | Hero | 29,671 | 32,617 | -9.03 |
| 5 | Suzuki | 13,970 | 9,720 | 43.72 |
| 6 | Royal Enfield | 4,509 | 5,885 | -23.38 |
MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ.. వారికి 50% డిస్కౌంట్

ఇక హోండా మోటార్‌సైకిల్స్ విషయానికి వస్తే, కంపెనీ 2021 ఏప్రిల్‌లో 2,40,100 యూనిట్లను విక్రయించింది. అదే 2021 మార్చిలో కంపెనీ మొత్తం 3,95,037 యూనిట్లను విక్రయించింది. నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, 2021 ఏప్రిల్‌లో కంపెనీ అమ్మకాలు 39.22 శాతం తగ్గాయి.

ఈ గణాంకాల నివేదిక ప్రకారం ఇందులో టీవీఎస్ మోటార్ మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో కంపెనీ 1,31,386 యూనిట్లను విక్రయించగా, 2021 మార్చిలో టీవీఎస్ మోటార్ 2,02,155 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. నెలవారీ అమ్మకంలో మాత్రం కంపెనీ అమ్మకాలు 35.01 శాతం తగ్గాయి.

ఈ జాబితాలో బజాజ్ ఆటో నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2021 లో కంపెనీ 1,26,570 యూనిట్లను విక్రయించింది. మార్చి 2021 లో కంపెనీ మొత్తం 1,81,393 యూనిట్లను విక్రయించింది మరియు నెలవారీ అమ్మకాల పరంగా కంపెనీ అమ్మకాలు 30.22 శాతం తగ్గుదలను నమోదు చేసింది.

ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ గత నెలలో కంపెనీ మొత్తం 63,879 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించింది. నెలవారీ అమ్మకాల విషయానికొస్తే, మార్చి 2021 లో కంపెనీ 60,222 యూనిట్లను విక్రయించినప్పటి నుండి 6.07 శాతం లాభం పొందినది సుజుకి మాత్రమే.

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజలను మాత్రమే కాదు ఆటో పరిశ్రమను కూడా కృంగదీస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఉత్పత్తి నిలిపివేసి ప్రభుత్వాలకు అండగా ఆక్సిజన్ అందించేపనికి పూనుకున్నాయి. ఇప్పుడు కూడా ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది, కావున ఇది, ఈ నెల అమ్మకాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








