టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

2021 అక్టోబర్ నెల ముగియడంతో చాలా కంపెనీలు తమ అమ్మకాల నివేదికలను విడుదల చేశాయి. ఇందులో భాగంగానే అక్టోబర్ 2021లో దేశీయ మార్కెట్లో టాప్ 5 కంపెనీలు మొత్తం 14,20,528 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే 2020 అక్టోబర్‌లో ఈ ద్విచక్ర వాహన తయారీదారులు మొత్తం 19,18,465 యూనిట్ల వాహనాలను విక్రయించగలిగాయి. దీన్ని బట్టి చూస్తే వార్షిక సంవత్సర అమ్మకాలలో ఈ సంవత్సరం ద్విచక్ర వాహన అమ్మకాలు 25.95 శాతం తగ్గినట్లు తెలుస్తుంది.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

ఇక నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, 2021 సెప్టెంబర్ నెలలో ఈ టాప్-5 కంపెనీలు మొత్తం 14,70,011 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించాయి. అదే అక్టోబర్ 2021 లో ఈ అమ్మకాలు 3.37 శాతం వరకు తగ్గాయి.

ఈ టాప్-5 ద్విచక్ర వాహన తయారీదారుల యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, 2021 అక్టోబర్ నెలలో ఈ టాప్-5 కంపెనీలు 3,36,598 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేశాయి, అయితే గత సంవత్సరం ఈ కంపెనీలు 3,34,865 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేశాయి. ఎగుమతుల విషయంలో మాత్రం ఇప్పుడు 0.52 శాతం పెరిగాయి. అయితే టాప్ 5 ద్విచక్ర వాహన తయారీదారుల అమ్మకాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp):

భారతీయ మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన 'హీరో మోటోకార్ప్‌' (Hero MotoCorp) ఈ టాప్ 5 ద్విచక్ర వాహన అమ్మకాలలో మొదటి స్థానంలో నిలిచింది. 2021 అక్టోబర్ నెలలో కంపెనీ దేశీయ విపణిలో 5,27,779 యూనిట్ల వాహనాలను విక్రయించగలిగింది.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

గత ఏడాది ఇదే నెలలో, అంటే 2020 అక్టోబర్ నెలలో హీరో మోటోకార్ప్ కంపెనీ 7,91,137 యూనిట్లను విక్రయించగలిగింది. కంపెనీ యొక్క దేశీయ అమ్మకాలు మునుపటికంటే కూడా 33.29 శాతం తగ్గినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ నెలలో కొంత పురోగతి చెందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

హోండా మోటార్‌సైకిల్ ఇండియా (Honda Motorcycle India):

మనం చెప్పుకుంటున్న ఈ జాబితాలో Honda Motorcycle India రెండవ స్థానంలో ఉంది. Honda Motorcycle India దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ యొక్క అతిపెద్ద ప్రత్యర్థి కావడం విశేషం. హోండా మోటార్‌సైకిల్ 2021 అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో 3,94,623 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

అదేవిధంగా Honda Motorcycle India యొక్క 2020 అక్టోబర్‌ అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ 4,94,459 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది దేశీయ విక్రయాలు 20.19 శాతం క్షీణించాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అమ్మకాలు కొంతవరకు తగ్గాయి. కానీ ఈ నెలలో అమ్మకాలు కొంతవరకు పెరిగే అవకాశం ఉంటుంది.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

టీవీఎస్ మోటార్ (TVS Motor):

ఈ జాబితాలో మూడవ స్థానంలో చేరిన కంపెనీ టీవీఎస్ మోటార్స్. టీవీఎస్ మోటార్ గత నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 2,58,777 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, గతేడాది ఇదే నెలలో కంపెనీ 3,01,380 యూనిట్లను విక్రయించింది. టీవీఎస్ దేశీయ విక్రయాలు ఈ ఏడాది 14.14 శాతం క్షీణించాయి.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

బజాజ్ ఆటో (Bajaj Auto):

దేశీయ మార్కెట్లో బజాజ్ ఆటో అమ్మకాల విషయానికి వస్తే, 2021 అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,98,738 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, గత ఏడాది అక్టోబర్‌లో కంపెనీ 2,68,631 వాహనాలను విక్రయించింది. నివేదికల ప్రకారం కంపెనీ దేశీయ విక్రయాలు దాదాపు 26.02 శాతం క్షీణించినట్లు తెలుస్తుంది.

టాప్ 5 బైక్ సేల్స్‌లో నేనే నెం.1: Hero MotoCorp

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield):

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ తయారీదారులలో ఒకటి 'రాయల్ ఎన్ఫీల్డ్'. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క అమ్మకాల విషయానికి వస్తే, 2021 అక్టోబర్‌లో దేశీయ మార్కెట్లో మొత్తం 40,611 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది, గత ఏడాది అక్టోబర్‌లో 62,858 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ ఏడాది కంపెనీ దేశీయ విక్రయాలు 35.39 శాతం క్షీణించాయి.

గత నెలలో ద్విచక్ర వాహన అమ్మకాలు కొంతవరకు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఈ నెలలో వాహన అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో వెల్లడవుతుంది. అప్పటి వరకు ఎప్పటికప్పుడు మరిన్ని కొత్త బైకులు మరియు కార్లకు సంబంధించిన సమాచారం కోసం మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Two wheelers sales for october 2021 hero bajaj honda tvs royal enfield details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X