కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

భారతదేశపు రెట్రో-మోడ్రన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఈ 2021 సంవత్సరంలో దేశీయ మార్కెట్లో అనేక అప్‌డేటెడ్ ఉత్పత్తులను విడుదల చేసింది. ఇటీవలి కాలంలో ఈ క్లాసిక్ మోటార్‌సైకిళ్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం ఈ కంపెనీ విక్రయిస్తున్న నాణ్యమైన ఉత్పత్తులేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయిస్తున్న క్లాసిక్ 350 ఈ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ గా అగ్రస్థానంలో ఉంది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

నేటితో ముగియనున్న 2021 సంవత్సరంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇతర టూవీలర్ బ్రాండ్ల కన్నా మెరుగైన కస్టమర్ బేస్ ను దక్కించుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం అనేక కొత్త ఉత్పత్తులతో కొనుగోలుదారులను ఆకట్టుకున్న క్లాసిక్ బ్రాండ్, కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని కొత్త ఉత్పత్తులతో సందడి చేయబోతోంది. వచ్చే సంవత్సరంలో కూడా తన అమ్మకాల జోరును ఇలానే కొనసాగించేందుకు 2022 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్ని కొత్త మోటార్‌సైకిళ్లను పరిచయం చేయనుంది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

కొంతకాలం క్రితం, రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క కొత్త స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ భారత రోడ్లపై టెస్టింగ్‌లో ఉండగా కెమెరాకి చిక్కింది. ఇటీవల దాని స్పై చిత్రాలు కూడా వెల్లడయ్యాయి. అంతేకాకుండా, ఇటలీలోని మిలాన్ లో జరిగిన EICMA 2021 మోటార్ షోలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అనేక కొత్త ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. మరియు ఈ రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి 2022 సంవత్సరంలో కంపెనీ ఏయే కొత్త మోటార్‌సైకిళ్లను భారత మార్కెట్లో విడుదల కాబోతున్నాయో చూద్దాం రండి.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

1. రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 (Royal Enfield Scram 411)

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 అనేది ఓ రెట్రో లుకింగ్ మోటార్‌సైకిల్. ప్రస్తుతం ఈ మోడల్ యొక్క ప్రోటోటైప్ ను కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ పరీక్షలు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తుంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 లాంచ్‌తో కంపెనీ తన కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి దాదాపు సిద్ధంగా ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

వచ్చే ఏడాది (2022లో) రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే కొత్త ఉత్పత్తులలో స్క్రామ్ 411 మొదటిది కావచ్చు. సమాచారం ప్రకారం, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 కంపెనీ ప్రస్తుతం ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎడివికి రోడ్-బియాస్డ్ వెర్షన్ అని చెబుతున్నారు. అంతేకాకుండా, ఇది దాని కన్నా కొంచెం సరసమైన ధరకే మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

2. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ నుండి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో మరొకటి హంటర్ 350. గతేడాది (2020) చివరిలో భారత మార్కెట్లో విడుదల చేయబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 ఆధారంగా రూపొందించబడుతున్న ప్రీమియం బైక్ ఇది. ఇది 2022 ఫిబ్రవరిలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మీటియోర్ 350 ఆధారంగా రూపొందుతున్న ఈ రోడ్‌స్టర్ బైక్ హంటర్ 350లో అనేక పరికరాలు మరియు ఫీచర్లను మీటియోర్ 350 నుండి గ్రహించే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 క్రూయిజర్ స్టైల్ బైక్ కాగా, ఈ కొత్త హంటర్ 350 రోడ్‌స్టర్ బైక్ గా ఉంటుంది. అంతేకాకుండా, దీని బరువు మీటియోర్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది చిన్న 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండి, దేశంలోనే సరసమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మోటార్‌సైకిల్ ధరను అందుబాటులో ఉంచడానికి, కంపెనీ Meteor 350లో ఉపయోగించిన ట్రిపుల్ పాడ్ క్లస్టర్‌ను కూడా Hunter 350లో చేర్చకపోవచ్చని తెలుస్తోంది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

3. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (Royal Enfield Shotgun 650 - SG 650)

పైన తెలిపిన రెండు మోడళ్లు మాత్రమే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ 650సిసి విభాగంలో ఓ ప్రీమియం మోటార్‌సైకిల్ ను కూడా ప్రవేశపెట్టనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం 650సిసి సెగ్మెంట్లో కేవలం రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. వాటిలో ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లు ఉన్నాయి. కాగా, ఈ రెండింటికీ అదనంగా కంపెనీ ఇప్పుడు మూడవ మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 (Royal Enfield Shotgun 650 - SG 650) ని 2022 సంవత్సరంలో విడుదల చేసే అవకాశం ఉంది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లేదా ఎస్‌జి650 మోడల్ ను కంపెనీ ఇటీవల ఇటలీలో జరిగిన EICMAలో ప్రదర్శించింది. దీని ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్ 2022 చివరి నాటికి భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ ఇప్పటికే అభివృద్ధి దశలో ఉంది మరియు ఇది భారతీయ రోడ్లపై పరీక్ష సమయంలో చాలాసార్లు గుర్తించబడింది. కంపెనీ తన 120 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా SG650 కాన్సెప్ట్ బైక్‌ను రూపొందించింది.

కొత్త సంవత్సరంలో Royal Enfield బ్రాండ్ నుండి కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా..?

ఈ జాబితాలో మరికొన్ని ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని కొత్త 2022 సంవత్సరానికి అనుగుణంగా అప్‌డేట్ చేయబడే రిఫ్రెష్డ్ మోడళ్లు కూడా ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రస్తుత బుల్లెట్ 350 యొక్క కొత్త అప్‌డేట్ మోడల్‌ను 2022 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఇటీవల లీకైన స్పై చిత్రాలలో ఇంటర్‌సెప్టర్ 650 మోడల్ కొత్త ఎగ్జాస్ట్ లేఅవుట్ కూడా కనిపించింది. అంటే, ఇందులో కూడా రిఫ్రెష్డ్ మోడల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Upcoming motorcycles from royal enfield in 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X