భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

Piaggio India (పియాజియో ఇండియా) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త Vespa 75th Anniversary Edition (వెస్పా 75 వ యానివర్సరీ ఎడిషన్‌)ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Vespa స్కూటర్ ధర రూ.1.25 లక్షలతో ప్రారంభించింది. ఈ స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. కొనుగోలుచేయదలచిన కస్టమర్లు ఆన్‌లైన్‌లో మరియు కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో రూ. 5,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

ఈ కొత్త Vespa 75th Anniversary Edition స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి Vespa 75th Anniversary Edition 125 మరియు Vespa 75th Anniversary Edition 150 వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 1.25 లక్షలు మరియు రూ. 1.39 లక్షలు.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినా ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌లో కంపెనీ అనేక మార్పులు చేసింది. స్కూటర్ కొత్త మెటాలిక్ ఎల్లో కలర్ లో ముగించబడింది. దీనితో పాటు ఈ స్కూటర్ లోని సైడ్ ఆప్రాన్ మరియు మడ్‌గార్డ్‌పై 75 నెంబర్ చూడవచ్చు. ఇది 75 వ వార్షికోత్సవాన్ని తెలుపుతుంది. ఇది లైట్ గ్రే కలర్ లో పూర్తి చేయబడింది. అంతే కాకూండా క్రోమ్‌తో 75 యానివర్సరీ ఎడిషన్‌ అని చెక్కబడి ఫలకం ఉంది, ఇది స్కూటర్ యొక్క ముందు స్టోరేజ్ కంపార్ట్‌మెంట్‌లో చూడవచ్చు.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

ఈ కొత్త Vespa 75th Anniversary Edition స్కూటర్ లో గమనించదగ్గ మార్పు ఇందులోని రౌండ్ ఆకారపు బ్యాగ్‌. మునుపటి మోడల్స్ లో ఈ ప్రాతంలో ఒక విడి టైర్ ఉండేది. ఇది నోబుక్ లెదర్‌లో ముగించబడింది, ఇది క్రోమ్ ర్యాక్‌లో ఉంటుంది. మొత్తానికి ఇది చూడటానికి సింపుల్ గా మరియు స్టైలిష్ గా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

ఈ కొత్త స్కూటర్ లో గ్రే కలర్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు లెదర్ సీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఈ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్‌లు 75 వ యానివర్సరీ కిట్‌ను కూడా పొందుతాడు. ఇది 1949 సంవత్సరం నుండి ప్రారంభమయ్యే బ్రాండ్ ప్రయాణాన్ని పూర్తిగా తెలియజేస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

ఇప్పటివరకు చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ కొత్త స్కూటర్ లో 125 సిసి మరియు వెస్పా 150 సిసి స్కూటర్ యొక్క స్టాండర్డ్ మోడల్స్ నుండి తీసుకున్న మరిన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కాంటూర్డ్ బాడీ ప్యానెల్స్, డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఈడి హెడ్‌లైట్, రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్‌లు, రౌండ్ షేప్ రియర్ వ్యూ మిర్రర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్-పీస్ సీట్ మరియు ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్ వంటివి ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

కొత్త Vespa 75th Anniversary Edition 125 సిసి స్కూటర్ విషయానికి వస్తే, ఇది 125 సిసి ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 9.7 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

అదేవిధంగా Vespa 75th Anniversary Edition 150 సిసి స్కూటర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్, సింగిల్-సిలిండర్ 149 సీసీ ఇంజిన్‌ కలిగి ఉటుంది. ఇది 7,600 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 10.3 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

కొత్త Vespa 75th Anniversary Edition సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ముందుభాగంలో సింగిల్ సైడ్ ఆర్మ్ హైడ్రాలిక్ యూనిట్ మరియు వెనుక భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్లీ డ్యూయల్-షాక్ అబ్జార్బర్ ఉంటుంది.

ఇక ఈ స్కూటర్ లోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ముందు భాగంలో 200మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 140మిమీ రియర్ డ్రమ్ బ్రేక్ వుంటుంది. అంతే కాకుండా 150 సిసి వేరియంట్ స్కూటర్ సింగల్ ఛానల్ ఏబీఎస్ కలిగి ఉంటుంది. 125 సిసి వేరియంట్ కంబైన్ బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

Vespa 75th Anniversary Edition విడుదల సందర్భంగా, కంపెనీ భారతదేశంలో కస్టమర్ టచ్ పాయింట్‌లను మరింత వేగంగా విస్తరించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, కంపెనీ దేశవ్యాప్తంగా 190 నగరాల్లో వెస్పా ఉనికిని కలిగి ఉంది. అయితే డీలర్‌షిప్‌లు త్వరలో 300 నగరాలకు విస్తరించడానికి కంపెనీ యోచిస్తోంది.

భారత్‌లో విడుదలైన కొత్త Vespa స్కూటర్స్; బుకింగ్ కేవలం రూ. 5,000 మాత్రమే

పియాజియో ప్రపంచవ్యాప్తంగా Vespa 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. కంపెనీ భారతదేశంలో ఈ సందర్భంగా Vespa 75th Anniversary Edition స్కూటర్‌ను అనేక మార్పులతో విడుదల చేసింది. ఈ స్కూటర్ దాని మునుపటి మోడల్ కంటే కూడా అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Most Read Articles

Read more on: #వెస్పా #vespa
English summary
Vespa 75th edition scooter launched price features specifications details
Story first published: Thursday, August 19, 2021, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X