కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

వాహనప్రియులకు మాడిఫైడ్ వాహనాలపై విపరీతమైన ఆదరణ ఉంది. వాహనదారులు తమకు నచ్చిన వాహనాలను నచ్చిన విధంగా మాడిఫైడ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కావున ఇటీవల కాలంలో మనం మాడిఫైడ్ కార్స్ మరియు మాడిఫైడ్ బైకుల గురించి మునుపటి కథనాలలో చాలా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు రీస్టోర్డ్ యమహా ఆర్ఎక్స్ 100 బైక్ గురించి తెలుసుకుందాం.

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

1990 లలో భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్‌లలో యమహా ఆర్‌ఎక్స్ 100 ఒకటి. ఆ సమయంలో అనేక పెద్ద కంపెనీలు మంచి లెటస్ట్ బైకులను విక్రయించినప్పటికీ, దేశీయ మార్కెట్లో యమహా ఆర్‌ఎక్స్ 100 కి ఉన్న ఆదరణ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. కావున ఆ సమయంలో కూడా ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించిన బైక్ గా ఆర్‌ఎక్స్ 100 నిలిచింది.

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

ఆర్‌ఎక్స్ 100 బైక్ యొక్క ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ, సెకండ్ హ్యాండ్ ఆర్‌ఎక్స్ 100 బైకులకు కూడా మంచి డిమాండ్ లేకపోలేదు. ఇప్పటికి కూడా ఎక్కువ మంది యువకులు ఈ ఆర్‌ఎక్స్ 100 బైక్ ని కోరుకుంటారు. కావున ఈ బైక్‌ను ఇప్పటికీ భారతీయ రోడ్లపై చూడవచ్చు.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ అయిన యమహా తన 2 స్ట్రోక్ మాన్స్టర్‌గా ప్రసిద్ది చెందిన ఆర్‌ఎక్స్ 100 బైక్‌ను భారతదేశంలో 11 సంవత్సరాలుగా విక్రయించింది. జపాన్ కి చెందిన ఈ కంపెనీ ఏకధాటిగా ఇన్ని సంవత్సరాలుగా విక్రయించడం అనేది ప్రశంసించదగ్గ విషయమనే చెప్పాలి.

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

ఆర్‌ఎక్స్ 100 బైక్‌ను కొనుగోలు చేసిన వారు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఒక నివేదిక ప్రకారం తెలంగాణకు చెందిన ఒక కస్టమ్ బైక్ షాప్ ఒక పాత ఆర్‌ఎక్స్ 100 బైక్‌ను కొత్తగా పునరుద్ధరించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

MOST READ:మహీంద్రా కస్టమర్లకు గుడ్ న్యూస్.. వెహికల్ వారంటీ టైమ్ ఇప్పుడు జులై 31 వరకు

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

రీస్టోర్డ్ చేసిన ఈ ఆర్ఎక్స్ 100 బైక్ యొక్క వీడియో యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. రీస్టోర్డ్ ఆర్ఎక్స్100 బైక్ చూడగానే అచ్చం షో రూమ్ నుంచి తీసుకువచ్చిన బైక్ లాగ కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్‌ లేటెస్ట్ బైక్‌ల మాదిరిగా ఉంటుంది. ఈ ఆర్ఎక్స్ 100 బైక్ మెటల్ గ్రే కలర్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అమర్చబడి ఉంటుంది.

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

ఈ బైక్‌ను హెడ్‌లైట్ రౌండ్ మరియు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్‌లో బ్లాక్ క్రోమ్‌తో భర్తీ చేయబడ్డాయి. ఇంజిన్ కూడా బ్లాక్ పెయింట్ చేయబడింది. యమహా లోగోను ఇంజిన్ దిగువన ఉన్న భద్రతా ప్లేట్‌లో ఉంచారు. ఆర్‌ఎక్స్ 100 బైక్‌పై స్పోక్ వీల్స్ స్థానంలో అల్లాయ్ వీల్స్ అమర్చారు.

MOST READ:SXR 125 మాక్సి స్కూటర్‌ విడుదల చేసిన ఎప్రిలియా; వివరాలు

ఈ బైక్ యొక్క వెనుక భాగంలో టైల్ లైట్స్, డ్యూయల్ గ్యాస్ ఛార్జ్డ్ సస్పెన్షన్ మరియు టర్న్ ఇండికేటర్లలో మార్పులు లేవు. బైక్‌ను కస్టమైజ్ చేయడానికి ముందు ఆర్‌ఎక్స్ 100 మంచి స్థితిలో ఉందని ఇది రుజువు చేసింది. బైక్ యొక్క క్రోమ్ ఆల్-ఫినిష్ ఎగ్జాస్ట్ పైప్, హ్యాండిల్ బార్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పెద్దగా మారలేదు.

కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

యమహా ఆర్‌ఎక్స్ 100 బైక్‌లో 98 సిసి సింగిల్ సిలిండర్ 2-స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పి పవర్, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.39 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆర్‌ఎక్స్ 100 లో 4 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ యూనిట్ ఉంటుంది. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

MOST READ:మిచెలిన్ కంపెనీ టైర్లు ఎలా తయారుచేస్తుందో తెలుసా.. అయితే ఇది చూడండి

Image Courtesy: Painting From Cm

Most Read Articles

English summary
Yamaha RX 100 Bike Restored Like New Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X