కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

ప్రముఖ బైక్ తయారీదారు యమహా ఇండియా దేశీయ మార్కెట్లో చాలా స్టైలిష్ బైకులను విడుదల చేసింది. ఇప్పుడు తన 155 సిసి స్పోర్ట్స్ బైక్ వైజెడ్ఎఫ్ ఆర్15 వి 3 బైక్ ని కొత్త కలర్ ఆప్సన్ లో అందుబాటులోకి తెచ్చింది. యమహా వైజెడ్ఎఫ్ ఆర్-15 వి 3 ఇప్పుడు 'మెటాలిక్ రెడ్' కలర్‌లో లభిస్తుంది. ఈ మోడల్‌ను 2021 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

యమహా తన రేసింగ్ బైక్ వైజెడ్ఎఫ్ ఆర్15 బైక్ లో చాలా సంవత్సరాలుగా గణనీయమైన మార్పులు చెందుతూ ఉంది. ఇవన్నీ ఈ బైక్ ని మరింత ఆకర్షణీయంగా చేయడంలో తోడ్పడతాయి. యమహా వైజెడ్ఎఫ్ ఆర్ -15 మెటాలిక్ రెడ్‌ కలర్ బైక్ ధర రూ. 1,52,100 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ).

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

యమహా కంపెనీ ఇటీవల వైజెడ్ఎఫ్ ఆర్-15 ధరను మునుపటికంటే 1,200 రూపాయలు పెంచింది. కావున ఇప్పుడు ఈ బైక్ ప్రారంభ ధర 1,49,100 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద లభిస్తుంది. యమహా వైజెడ్ఎఫ్ ఆర్-15 వి3 బైక్ లో 155 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది, ఇది 18.37 బిహెచ్‌పి శక్తిని మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ట్రాఫిక్ సిగ్నల్‌లో మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ చేసిన యువకుడు [వీడియో]

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

యమహా వైజెడ్ఎఫ్ ఆర్-15 వి3 బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌లో అసిస్ట్ స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. ఈ బైక్ యమహా వైజెడ్ఎఫ్ ఆర్ 15 స్పోర్ట్స్ బైక్ మాదిరిగానే రూపొందించబడింది. ఈ బైక్‌లో స్పోర్టి రైడింగ్ పొజిషన్ ఏరోడైనమిక్ డిజైన్ తో వస్తుంది. ఈ బైక్ క్లిప్ హ్యాండిల్ బార్, డెల్టాబాక్స్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగార్మ్, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్ వంటి అనేక ఫీచర్స్ కలిగి ఉంది.

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

ఈ బైక్‌లో పుల్లీ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టైల్ లైట్స్, టర్న్ ఇండికేటర్స్ వంటివి కూడా ఉన్నాయి. యమహా వైజెడ్ఎఫ్ ఆర్-15 వి3 బైక్ ఇప్పటికే రేసింగ్ బ్లూ, థండర్ గ్రే మరియు డార్క్ వైట్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ కొత్త మెటాలిక్ రెడ్ తో, ఈ బైక్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.

MOST READ:హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; బైక్ రైడర్ వల్ల ఢీ కొట్టుకున్న రెండు లారీలు

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

ఈ బైక్ పూర్తి డిజిటల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగి ఉంది, కావున దృశ్యమానత అద్భుతంగా ఉంటుంది. రైడింగ్ పొజిషన్‌ను స్పోర్టియర్‌గా చేయడానికి, బైక్ ముందు భాగంలో వంగి ఉన్న హ్యాండిల్‌బార్ మరియు వెనుక భాగంలో ఫుట్‌ప్యాడ్‌ను పొందుతుంది. యమహా ఆర్ 15 వి 3 భారతదేశంలో హోండా సిబిఆర్ 150 ఆర్ బైక్ కి ప్రత్యర్థిగా ఉంటుంది.

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

ఇటీవల యమహా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది. త్వరలో వాటిని ప్రొడక్షన్ అవతార్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలిపింది. యమహా కంపెనీ గత నెలలో ఎమ్‌టి-15 కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను కొత్త పెయింట్‌తో తీసుకువచ్చారు. భారతదేశంలో ఈ బైక్ త్వరలో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

MOST READ:ఇండియన్ మార్కెట్లో అత్యంత చీపెస్ట్ బైక్స్ ; ధర తక్కువ & మైలేజ్ ఎక్కువ

కొత్త కలర్ ఆప్సన్లో విడుదలైన యమహా YZF R-15 V3 బైక్; పూర్తి వివరాలు

యమహా కంపెనీ బైక్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల, దేశీయ మార్కెట్లో మాత్రమే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా ఎక్కువ అమ్ముడవుతున్నాయి. ఎక్కువమంది ఇష్టపడే వాహనాలలో ఈ యమహా బైక్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త కలర్ లో విడుదలైన బైక్ ఏవిధమైన అమ్మకాలను పొందుతుందో వేచి చూడాలి.

Most Read Articles

English summary
Yamaha YZF V3 Launched In Metallic Red Colour Price Specifications. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X