భారత్‌లో YZF-R15 V3 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్స్ (Yamaha Motors) దేశీయ మార్కెట్లో కొత్త వైజెడ్ఎఫ్-ఆర్15ఎస్ వి3.0 (YZF-R15S V3.0) ను విడుదల చేసింది. ఈ కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్15ఎస్ వి3.0 ధర రూ. 1,57,600 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ప్రస్తుతం దేశీయ మార్కెట్లోని అన్ని కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15ఎస్ వి3.0 బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది, అంతే కాకుండా ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది గేర్ షిఫ్ట్ ఇండికేటర్‌తో కూడిన మల్టీ-ఫంక్షన్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, ఇంజన్ కట్-ఆఫ్ స్విచ్‌తో సైడ్ స్టాండ్, డెల్టాబాక్స్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగార్మ్ మరియు సూపర్ వైడ్ 140/70-R17 రేడియల్ టైర్‌లను కలిగి ఉంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

YZF-R15 V3.0 బైక్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటి. ఈ బైక్ 155 సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఎస్ఓహెచ్సి 4-వాల్వ్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.6 బిహెచ్‌పి పవర్ మరియు 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.1 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA)తో కూడిన ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన మోటార్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

కొత్త యమహా బైక్ మునుపటి మోడల్స్ మాదిరిగా కాకుండా, ఇప్పుడు సింగిల్ పీస్ సీట్ కలిగి ఉంటుంది. కావున రైడర్ మరియు పిలియన్ కి రైడింగ్ సమయంలో మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది చూడటానికి కూడా చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

YZF-R15 V3 బైక్ లాంచ్ సందర్భంగా, యమహా మోటార్ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీ మోటోఫుమి షితారా మాట్లాడుతూ, YZF-R15 తన వెర్షన్ 3.0 లో గొప్ప విజయాన్ని సాధించింది. ఇది అధునాతన టెక్నాలజీతో 150 సిసి సూపర్‌స్పోర్ట్ విభాగంలో ఇది అత్యంత అద్భుతమైన మోడల్‌గా నిరూపించబడింది. YZF-R15 V4 భారతదేశం అంతటా కస్టమర్‌లచే మంచి ఆదరణ పొందగలుగుతోంది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

సాధారణంగా R15 ప్యాసింజర్ బైక్ అనుభూతిని మాత్రమే కాకూండా రేసింగ్ బైక్ అనుభవాన్ని అందిస్తుంది. కావున ఎక్కువమంది కస్టమర్లకు ఇది చాలా నచ్చుతుంది. Yamaha కంపెనీ ఎల్లప్పుడూ మా కస్టమర్‌ల డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకుని వాటిని తీర్చడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము. ఈ కారణంగానే ఇప్పుడు యూనిబాడీ సీటుతో R15S V3 పరిచయం చేయబడింది అని ఆయన అన్నారు.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

2018 లో 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' బ్రాండ్ ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత, R15 మోడల్ శ్రేణి అమ్మకాలలో అద్భుతమైన వృద్ధిని సాధించింది. జనవరి 2018 నుండి అక్టోబర్ 2021 మధ్య, మేము మొత్తం 2,76,445 యూనిట్లను విక్రయించాము. ఇది కంపెనీ సాధించిన ఒక అద్భుతమైన విజయం ఈ విజయం 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' ప్రచార విజయాన్ని స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

భారతీయ మార్కెట్లో కొత్త Yamaha YZF-R15 V3.0 బైక్ రూ. 1.57 లక్షల నుండి రూ. 1.59 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రేసింగ్ బ్లూ, థండర్ గ్రే, డార్క్‌నైట్ మరియు మెటాలిక్ రెడ్ కలర్స్. కావున కస్టమర్ ఇందులో తనకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

యమహా వైజెడ్ఎఫ్-ఆర్15ఎస్ వి3.0 బైక్ ఫుల్లీ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ను కలిగి ఉంది. అయితే ఇది అద్భుతమైన విజిబిలిటీని కలిగి ఉంది. రైడింగ్ పొజిషన్‌ను స్పోర్టీగా మార్చడానికి, బైక్‌కు ముందువైపు స్లోపింగ్ హ్యాండిల్‌బార్ మరియు వెనుకవైపు ఫుట్‌ప్యాడ్ ఇవ్వబడింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త యమహా R15 V3.0 బైక్ హోండా CBR150R కి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

ఇదిలా ఉండగా యమహా కంపెనీ తన కొత్త R15 V4 బైక్ ధరను ఇటీవల కాలంలో రూ. 3,000 వరకు పెంచింది. కంపెనీ ఈ బైక్ ను మార్కెట్లో రూ. 1,67,800 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ధరను ఇప్పుడు ఏకంగా 3,000 రూపాయల వరకు పెరగటం వల్ల ఈ బైక్ కొత్త ధర రూ. 1,70,800 చేరింది.

భారత్‌లో YZF-R15 V3.0 బైక్ లాంచ్ చేసిన Yamaha: ధర రూ. 1.57 లక్షలు

కొత్త Yamaha R15 V4 భారతదేశంలో ఐదు విభిన్న రంగులలో ప్రవేశపెట్టబడింది. అయితే ఈ కొత్త Yamaha R15 V4 బైక్ దాని 155 సిసి ఇంజిన్ పరంగా ఖరీదైన బైక్. కావున ఈ బైక్‌తో వచ్చే ప్రీమియం రైడ్ అనుభవం ఈ సెగ్మెంట్‌లోని మరే ఇతర మోటార్‌సైకిల్‌లోనూ లేదు. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha yzf r15s v3 introduced with unibody seat price features details
Story first published: Wednesday, November 17, 2021, 16:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X