భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలు మరియు పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసి దేశీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతే కాకూండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు మరియు ఎలక్ట్రిక్ వాహన దత్తతదారులను ప్రోత్సహించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ప్రోత్సహిస్తున్నాయి. ఈ కారణంగా దేశంలో ఉన్న అనేక స్టార్ట్-అప్ కంపెనీలు సబ్సిడీ ప్రోత్సాహక పథకాలతో EV ఆటోమొబైల్ పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నాయి.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన Zypp కంపెనీ Electric స్కూటర్లు విడుదల చేసింది. అంతే కాకుండా EV ఆటోమోటివ్ పరిశ్రమలో కూడా Zypp Electric భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ సిరీస్ A 9 యునికార్న్స్ మరియు యాంటిల్ వెంచర్‌తో జతకట్టి భారతీయ EV పరిశ్రమలో సుమారు $ 7 మిలియన్లను సేకరించింది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

Zypp Electric కొత్త పెట్టుబడితో, తన వ్యాపార పరిధిని విస్తరించేందుకు మరియు త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ-కామర్స్ కంపెనీల వస్తువులను వినియోగదారులకు అందించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే ఇప్పుడు కొత్త పెట్టుబడులతో తన పరిధిని మరింత విస్తరిస్తుంది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

2017 లో ఆకాష్ గుప్తా మరియు రాశి అగర్వాల్ కలిసి స్థాపించిన Zypp Electric (జిప్ ఎలక్ట్రిక్), తన ఖాతాదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అద్దెకు అందిస్తుంది. ఈ సంస్థ ఏకకాలంలో భారతీయ రవాణా విద్యుదీకరణ మరియు హైపర్‌లోకల్ డెలివరీ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

Zypp Electric మొదట్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభమయినప్పటికీ, ఈ రోజు దాదాపు 12.5 మిలియన్ల పెట్టుబడితో కొత్త EV స్కూటర్ వెంచర్, A సిరీస్‌లో మార్క్యూ ఈక్విటీ, నానావతి ఫ్యామిలీ ఆఫీస్, V ఫౌండర్ సర్కిల్, రిసో క్యాపిటల్, ధోలాకియా వెంచర్స్, IAN ఫండ్, తరుణ్ సరాఫ్, WL లాజిస్టిక్స్ మరియు AWL లాజిస్టిక్స్ జైప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

ప్రస్తుతం బిజినెస్ టు బిజినెస్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్న పెట్రోల్ స్కూటర్ల నిర్వహణ వ్యయం గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగింది. అంతే కాకుండా ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఏకంగా వంద రూపాయలు దాటింది. కావున ఎక్కువమంది వినియోగారులు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ స్టార్ట్ అప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

Zypp Electric వివిధ ఈ-కామర్స్ కంపెనీల ఉత్పత్తులను వినియోగదారులకు డెలివరీ చేయడానికి మధ్యవర్తిగా పనిచేస్తుంది. చాలా వరకు ఈ-కామర్స్ కంపెనీలు మరియు ఇతర కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగిస్తుంది. మొదట్లో వివిధ కంపెనీల నుండి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్న జైప్, ఇప్పుడు తన సొంత వాహన ఉత్పత్తి విభాగాన్ని తెరిచింది మరియు డెలివరీ లక్ష్యాలు మరియు డిమాండ్‌ను తీర్చడానికి ఒక కొత్త EV స్కూటర్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించింది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

Zypp Electric యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా వాణిజ్యపరంగా ఉపయోగపడటానికి అనుకూలంగా తయారుచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ మోడల్ క్యాటరింగ్, సిలిండర్ షిప్పింగ్ మరియు ఈ-కార్మస్ గూడ్స్‌తో సహా వివిధ రకాల చిన్న-స్థాయి సరుకు రవాణాను అనుకూలంగా ఉంటుంది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ 40 AH బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్‌తో 120 కిమీ మైలేజ్ అందిస్తుంది. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 250 కిలోల లోడ్‌ను మోసే సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. మెటల్ బాడీ ప్యానెల్‌తో కొత్త EV స్కూటర్‌లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మరియు వెహికిల్ ట్రాక్ సౌకర్యం కోసం డిజిటల్ ప్యానెల్ అమర్చబడింది.

భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టిన Zypp Electric; వివరాలు

ప్రస్తుతం కంపెనీ హైదరాబాద్ నగరంలో 100 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించింది. అయితే త్వరలో 500 వాహనాలను ప్రారంభించే పనులకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కంపెనీ యొక్క కార్యకలాపాలు ఉత్తర భారతదేశంలో చాలా వేగంగా ఉన్నాయి. ఇది కాస్త ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తహరించడానికి పూనుకుంది. దక్షిణ భారతదేశంలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్కువగా వినియోగంలోకి వస్తే, కంపెనీ ఒక అరుదైన రికార్డును సాధించినట్లే అవుతుంది. తద్వారా దేశం మొత్తం Zypp Electric తన ఉనికిని విస్తరించగలదు.

Most Read Articles

English summary
Zypp electric raises 7 million dollar funding to electrify indian ev space
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X