ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్.. చూసారా..!!

'2022 డాకర్ ర్యాలీ' సౌదీ అరేబియా ఇసుక తిన్నెల్లో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ తమ ప్రతిభను చూపుతూ ఎంతోమంది రైడర్స్ ఇప్పటికి 7 స్టేజెస్ పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు 8 స్టేజి ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఈ 8 వ స్టేజిలో రైడర్లు మొత్తం 395 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇందులో గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ మరియు ఆడి మట్టియాస్ ఎక్స్‌స్ట్రామ్ విజయం సాధించారు. సుందర్‌ల్యాండ్ బైక్‌ల విభాగంలో మొత్తం ఆధిక్యాన్ని పొందగా, మొత్తం మీద కార్ల విభాగంలో టయోటా యొక్క నాసర్ అల్-అత్తియా కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

డాకర్ ర్యాలీ స్టేజి 8 యొక్క ఫలితాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

2022 డాకర్ ర్యాలీలో బైక్‌ విభాగం:

హోరాహోరీగా సాగిన 2022 డాకర్ ర్యాలీ బైక్ విభాగంలో గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ విజయ కేతనం ఎగురవేశారు. యితడు మొత్తం 395 కిలోమీటర్ల మార్గాన్ని కేవలం 3 గంటల 48 నిమిషాల 2 సెకన్లలో పూర్తి చేసాడు. యితడు తన ప్రత్యర్థి అయిన హోండా రైడర్ పాబ్లో క్వింటానిల్లాను 2 నిమిషాల 53 సెకన్ల తేడాతో వెనక్కి నెట్టేశాడు. కావున అతడు ఇందులో 2 వ స్థానంలో నిలిచాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

ఆస్ట్రియన్‌ కెటిఎమ్ రైడర్ మాటియాస్‌ వాక్‌నర్‌ ఈ విభాగంలో గెలుపొందిన సుందర్‌ల్యాండ్‌ కంటే 4 నిమిషాల 11 సెకన్లు వెనుకబడి ఉన్నారు. ఇందులో ఇండియన్ రైడర్స్ లోని ఐదుగురిలో లీడ్ రైడర్ హీరోస్ పోర్చుగీస్ రైడర్ జోక్విమ్ రోడ్రిగ్స్, సుందర్‌ల్యాండ్ కంటే 9 నిమిషాల 58 సెకన్ల వెనుకబడి 8 వ స్థానంలో నిలిచాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

అదే విధంగా 14వ స్థానంలో టీవీఎస్ షెర్కో యొక్క రుయి గొన్‌కాల్వ్స్‌ నిలిచాడు. ఇక స్పానిష్ TVS షెర్కో రైడర్ లోరెంజో శాంటోలినో 20 వ స్థానంలో నిలిచాడు, కాగా హీరో సౌత్ ఆఫ్రికా రైడర్ ఆరోన్ మేర్ 4 సెకన్ల వెనుకబడి 21 వ స్థానంలో నిలిచాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

భారతదేశానికి చెందిన హరిత్ నోహ్ తన TVS షెర్కో ఈ ర్యాలీలో మొత్తం 26 వ స్థానంలో నిలిచాడు. డాకర్ ర్యాలీ యొక్క 8 దశల తర్వాత, గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ మరోసారి స్టాండింగ్‌లలో అగ్రస్థానంలో నిలిచాడు. సుందర్‌ల్యాండ్ తన బావ, యమహా రైడర్ అడ్రియన్ వాన్ బెవెరెన్ నుండి ఆధిక్యాన్ని తిరిగి పొందాడు, అతను నేటి దశ తర్వాత మూడవ స్థానానికి పడిపోయాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

టీవీఎస్ షెర్కో రైడర్ సుందర్‌ల్యాండ్ కంటే 21 నిమిషాల 9 సెకన్ల వరకు వెనుకబడి ఉన్నాడు. అయితే ఇందులో జోక్విమ్ రోడ్రిగ్స్ 15 వ స్థానంలో ఉన్నాడు. ఇందులో భారత రైడర్ హరిత్ నోహ్ ప్రస్తుతం 26 వ స్థానంలో ఉండగా, అతని సహచరుడు రుయ్ గోన్‌కాల్వ్స్ కంటే ఒక స్థానం ముందున్నాడు. మొత్తానికి 8 వ స్టేజిలో ఎలాంటి అవకతవకలు లేకుండా మెరుపువేగంతో జరిగిపోయాయి.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

2022 డాకర్ ర్యాలీలో కార్ విభాగం:

2022 డాకర్ ర్యాలీ కార్ విభాగంలో ఆడి ఆర్ఎస్-క్యూ రేసర్‌లు తమ పూర్తి వేగాన్ని ప్రదర్శించి అందరిని ఆకట్టుకుంది. ఇందులో ఎక్స్‌స్ట్రామ్ ఈ స్టేజిని 3 గంటల 43 నిమిషాల 21 సెకన్లలో పూర్తి చేసి రెంమొదటి స్థానంలో నిలిచాడు. రెండవ స్థానంలో హోల్డర్ స్టెఫాన్ పీటర్‌హాన్‌సెల్‌ నిలిచాడు. మూడో స్థానంలో ఫ్రెంచ్‌ రైడర్ సెబాస్టియన్‌ లోబ్‌ నిలిచాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

సెబాస్టియన్‌ లోబ్‌ ఈ స్టేజిలో 3 నిమిషాల 8 సెకన్లలో ఆడి ఎక్స్‌ట్రోమ్ కంటే వెనుకబడి ముగించాడు. అదేవిధంగా టొయోటా డ్రైవర్ ఎక్స్‌స్ట్రోమ్ కంటే 11వ స్థానంలో నిలిచి తన స్టేజిని 10 నిమిషాల 9 సెకన్లలో పూర్తి చేసాడు. ఇందులో నాజర్ అల్-అత్తియా ఇప్పటికీ డాకర్ 2022లో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

ఫైనల్ పోడియం స్థానాన్ని సౌదీకి చెందిన యజీద్ అల్ రాజ్హి ఆక్రమించాడు, అతను రేసు లీడర్ కంటే 53 నిమిషాల 13 సెకన్ల వెనుక నిలిచినాడు. మొత్తం మీద 8 వ స్టేజిలో అందరూ చాలా అద్భుతమైన ప్రదర్శనను చూపారు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

డాకర్ ర్యాలీ 2022 స్టేజ్ 8 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

డాకర్ 2022 యొక్క ఎనిమిదవ దశలో బ్రిటిష్ రైడర్ సామ్ సుందర్‌లాండ్ రైడ్‌ను పూర్తి చేయడంలో అద్భుతమైన ప్రారంభంతో మొత్తం ఆధిక్యాన్ని తిరిగి పొందాడు. అదే విధంగా నేటి దశలోని ప్రతి చెక్‌పాయింట్‌లో గ్యాస్‌గ్యాస్ మ్యాన్ ఆధిక్యాన్ని చూపాడు.

ఎట్టకేలకు 2022 డాకర్ ర్యాలీ 8 వ స్టేజ్ ఫలితాలు వచ్చేశాయ్

అయితే కార్ల విభాగంలో మట్టియాస్ ఎక్స్‌స్ట్రామ్ విజయం సాధించగా, టయోటా డ్రైవర్ ఖతార్‌కు చెందిన నాజర్ అల్-అత్తియా ఓవరాల్ గా మంచి స్థానంలోనే కొనసాగుతున్నాడు. మొత్తానికి అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ ఈ రోజు 9 వ స్టేజి కూడా జరుగుతుంది. 9 వ స్టేజికి సంబంధించిన సమాచారం కూడా త్వరలో మీకు అందుబాటులో ఉటుంది.

Most Read Articles

English summary
2022 dakar rally stage 8 results sunderland ekstrom win
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X