గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

భారతీయ మార్కెట్లో గత వారం కొత్త బైకులు విరివిగా లాంచ్ అయ్యాయి. ఇందులో బజాజ్ కంపెనీ యొక్క సిటి125ఎక్స్, డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2, హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్‌, ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ మరియి యెజ్డీ రోడ్‌స్టర్ కొత్త కలర్స్ లో విడుదలయ్యాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్స్ గురించి మరింత సమాచారం ఈ ఒకే ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

బజాజ్ సిటి125ఎక్స్ (Bajaj CT125X):

భారతీయ మార్కెట్లో 'బజాజ్ ఆటో' (Bajaj Auto) గత వారం కొత్త 'సిటి125ఎక్స్' (CT125X) మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 71,354 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఇప్పుడు మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి గ్రీన్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లాక్ మరియు బ్లూ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

బజాజ్ సిటి125ఎక్స్ ఇప్పుడు ఆధునిక డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 125సీసీ డిటిఎస్-ఐ, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 10 బిహెచ్‌పి పవర్ మరియు 11 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బజాజ్ సిటి125ఎక్స్ బైక్ దాని విభాగంలో హోండా ఎస్‌పి125, హోండా షైన్, హీరో గ్లామర్ మరియు హీరో సూపర్ స్ప్లెండర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2 (Ducati Streetfighter V2):

ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ 'డుకాటి' (Ducati) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో 'స్ట్రీట్‌ఫైటర్ వి2' (Streetfighter V2) ను రూ. 17.25 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద విడుదల చేసింది. ఈ కొత్త బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది, కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

2022 డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2 బైక్ 955 సిసి సూపర్‌క్వాడ్రో ట్విన్-సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 153 బిహెచ్‌పి పవర్ మరియు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 101.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో హై,మిడ్ మరియు లో అనే మూడు పవర్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది దాని పానిగేల్ V2 కంటే కూడా తక్కువ పవర్ అందిస్తుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్‌ (Honda Shine Celebration Edition):

'హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' గత వారం మార్కెట్లో 'హోండా షైన్ సెలబ్రేషన్ ఎడిషన్' (Honda Shine Celebration Edition) లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 78,878 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త ఎడిషన్ మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ మరియు మ్యాట్ సాంగ్రియా రెడ్ మెటాలిక్ అనే రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

ఈ కొత్త బైక్ ఇప్పుడు గోల్డ్ యాక్సెంట్‌లు మరియు గ్రాఫిక్స్‌తో పాటు మ్యాట్ గ్రే-ఫినిష్డ్ ఎగ్జాస్ట్ ట్రిమ్‌ను పొందుతుంది. కావున చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని సింగిల్ పీస్ సీటు బ్రౌన్ కలర్ లో ఉంది, అంతే కాకూండా ఇది ప్రీమియం అనుభూతిని అందించడంతోపాటు రైడర్ కి మంచి కంపర్ట్ అందిస్తుంది.

ఈ బైక్ 123.94 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. కావున ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 బిహెచ్‌పి పవర్ మరియు 6000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350):

భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV) సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ 'ప్యూర్ ఈట్రిస్ట్ 350' (Pure eTryst 350) విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్). ఏ బైక్ లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ పంచ్ బ్లాక్, టాన్ రెడ్ మరియు సీ బ్లూ అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

ఈ కొత్త 'ప్యూర్ ఈట్రిస్ట్ 350' (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్ లో 3.5kWh బ్యాటరీ ప్యాక్‌ అమర్చబడి ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 140 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ బైక్ లోడ్ కెపాసిటీ 150 కేజీలు. ఇది 84V 8A ఛార్జర్‌తో వస్తుంది, దీని సాయంతో ఇ-బైక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

కొత్త కలర్ 'యెజ్డీ రోడ్‌స్టర్' (Yezdi Roadster):

ఒకప్పుడు ద్విచక్ర వాహన విభాగాన్ని తిరుగులేకుండా పాలించిన యెజ్డీ (Yezdi) కంపెనీ యొక్క బైకులు రానురాను తక్కువ డిమాండ్ పొందటంలో కొన్ని సంవత్సరాల పాటు వెనుకబడిపోయాయి. అయితే ఈ బైకులు 2022 ప్రారంభంలో మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు ఈ బైక్ మరో రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

కంపెనీ ఇప్పుడు తన యెజ్డీ రోడ్‌స్టర్ బైకును 'ఇన్ ఫెర్నో రెడ్' మరియు 'గ్లేసియల్ వైట్' అనే రెండు కలర్ ఆప్సన్స్ లో తీసుకువచ్చింది. ఈ రెండు కలర్స్ లోనూ గ్లోస్ ఫినిష్ చూడవచ్చు. అంతే కాకుండా సైడ్ కేసింగ్ లతో పాటు మోటార్ సైకిల్ మీద చాలా చోట్ల బ్లాక్ ఫినిషింగ్ చూడవచ్చు. కంపెనీ ప్రారంభించిన ఈ రెండు కలర్స్ యొక్క కాంబినేషన్ కు "ఫైర్ & ఐస్" అని పేరుపెట్టింది. అయితే ఇందులో అదే ఇంజిన్ ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త బైకులు: బజాజ్ సిటి125ఎక్స్ నుంచి ప్యూర్ ఈట్రిస్ట్ 350 వరకు..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గత వారం మార్కెట్లో ఈ కొత్త బైక్స్ విడుదలయ్యాయి. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అయితే ఈ వారం కూడా మార్కెట్లో విడుదల కావడానికి కొన్ని బైకులు సిద్ధంగా ఉన్నాయి. ఈ కొత్త బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, August 29, 2022, 10:04 [IST]
English summary
August 2022 top bike news of the week
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+