బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో ధర మరియు మైలేజీకి ప్రాధాన్యతనిచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని, తమ ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సిటి 100 (Bajaj CT 100) ని గతంలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. వ్యాపారస్తులు, రైతులు, అధిక మైలేజ్ కోరుకునే ఉద్యోగులు ఈ మోటార్‌సైకిల్‌ను ఎంతగానో ఆదరించారు. ఈ బైక్ ధర కూడా చాలా తక్కువగా ఉండటంతో, ఇది మార్కెట్లో ఓ సక్సెస్‌ఫుల్ ఎంట్రీ-లెవల్ బైక్‌గా నిలిచింది.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ 100సీసీ బైక్ ఉత్పత్తిని డిస్‌కంటిన్యూ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ఈ మోడల్ కనిపించడం లేదు. బజాజ్ సిటి 100 ఈ బ్రాండ్ యొక్క అత్యంత ప్రసిద్ధ ద్విచక్ర వాహనాలలో ఒకటిగా ఉంది. బజాజ్ పల్సర్ బ్రాండ్లకు ఉన్నంత క్రేజ్ ఈ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌కు కూడా ఉంది. అయితే, మార్కెట్ నివేదికల ప్రకారం, కొన్ని వారాల క్రితం నుండే బజాజ్ ఆటో డీలర్లు కొత్త సిటి 100 కోసం బుకింగ్ లను తీసుకోవడం నిలిపివేశారు. కంపెనీ కూడా ఈ మోడల్ ఉత్పత్తిని ఆపివేసినట్లుగా తెలుస్తోంది.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

బజాజ్ ఆటో అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ ఇప్పుడు తమ బడ్జెట్ సిటి (CT) సిరీస్‌లో కేవలం 110సిసి మోడల్‌ను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, బజాజ్ ఆటో ఈ 100సిసి మోడల్ సిటి బైక్ ను పూర్తిగా మార్కెట్ నుండి తొలగించి వేసిందా లేదా ఇది తాత్కాలికంగా నిలిపివేయబడిందా అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఓ నివేదిక ప్రకారం, కంపెనీ ఇందులో అప్‌గ్రేడెడ్ వెర్షన్ ను తీసుకువచ్చేందుకే, పాత సిటి 100 బైక్ ను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

గతంలో బజాజ్ సిటి 100 కేవలం సుమారు రూ. 53,000 (ఎక్స్-షోరూమ్) రేంజ్ లో అందుబాటులో ఉండేది. ఈ ధర వద్ద ఇది భారత్‌లో లభిస్తున్న అత్యంత సరసమైన మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉండేది. బజాజ్ సిటి100 బైక్ లో 102 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.5 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.34 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

బజాజ్ సిటి 100 ఈ విభాగంలో హీరో స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మరియు టీవీఎస్ రేడియాన్ వంటి కమ్యూటర్ మోటార్‌సైకిళ్లకు మోడళ్లకు పోటీగా ఉండేది. బజాజ్ సిటి 100 అధిక ఇంధన పొదుపు మరియు అత్యధిక మైలేజీకి చాలా ప్రసిద్ధి చెందిన మోడల్. ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 70 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని చెబుతారు. ఇది చవక బైక్ అయినప్పటికీ, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటుంది. సింపుల్ అండ్ క్లాసిక్ లుక్‌తో ఒస సాధారణ టూవీలర్‌లో ఉండాల్సిన అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. రైడర్లకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కోసం ఇందులో SNS సస్పెన్షన్ సెటప్‌ ఉపయోగించారు.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

ఇకపై బజాజ్ సిటి 110ఎక్స్ (Bajaj CT 110X) మాత్రమే దిక్కు..

బజాజ్ సిటి 100 మోడల్ డిస్‌కంటిన్యూ కావడంతో, కస్టమర్లు ఇప్పుడు బజాజ్ ఆటో నుండి కొనుగోలు చేయగలిగిన అత్యంత చవకైన బైక్ సిటి 110ఎక్స్ మాత్రమే. దేశీయ మార్కెట్లో ఈ బైక్ ధర రూ.65,453 (ఎక్స్-షోరూమ్, మే 2022 నాటికి) గా ఉంది. ఇది శక్తివంతమైన 115సిసి డిటిఎస్ఐ ఇంజన్‌తో పరిచయం చేయబడింది. ఈ బైక్ పెర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా మెరుగైన మైలేజీని అందిస్తుంది.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

బజాజ్ సిటి 110ఎక్స్ కూడా దాని క్లాసిక్ సిటి 100 మాదిరిగానే అదే డిజైన్ లాంగ్వేజ్ ని కలిగి ఉంటుంది. గుండ్రటి హెడ్‌లైట్ మరియు హెడ్‌లౌట్ కౌల్, తక్కువ బాడీ ప్యానెల్స్, ఇంజన్ క్రాష్ గార్డ్ మరియు బురద, నీళ్లు మరియు రాళ్ల నుండి ఇంజన్ ను రక్షించే సర్క్యులర్ బెల్లీ పాన్, రూరల్, అర్బన్ మరియు సిటీ రోడ్లకు సైతం అనువుగా ఉండే సెమీ-నాబీ టైర్స్, ముందు వైపు ధృడమైన టెలిస్కోపిక్ సస్పెన్షన్, రైడర్ తొడలకు సౌకర్యాన్ని అందించే రబ్బర్ ట్యాంక్ ప్యాడ్స్ వంటి ఫీచర్లు ఈ బైక్ లో ఉన్నాయి.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

అంతేకాకుండా, డబుల్ స్టిచింగ్ తో కూడిన ధృడమైన మరియు మందపాటి సీట్ రైడర్ మరియు పిలియన్ రైడర్ కు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తాయి. సీట్ వెనుక భాగంలో అధిక లగేజ్ ను తీసుకువెళ్లడానికి వీలుగా చిన్న క్యారియర్ ఉంటుంది. ఈ బైక్ 115.45 సిసి, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8.6 పిఎస్ పవర్ మరియు 9.81 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్ (అన్ని గేర్లు క్రిందకే)తో వస్తుంది.

బజాజ్ బడ్జెట్ బైక్ ప్రియులకు షాక్.. అధిక మైలేజీనిచ్చే బజాజ్ సిటి 100 బైక్ డిస్‌కంటిన్యూ..

ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ (125 మిమీ ట్రావెల్), స్ప్రింగ్ ఇన్ స్పింగ్ (ఎన్ఎస్ఎస్) రియర్ సస్పెన్షన్ (100 మిమీ వీల్ ట్రావెల్), 130 మిమీ ఫ్రంట్ డ్రమ్ బ్రేక్, 1100 మిమీ రియర్ డ్రమ్ బ్రేక్ విత్ సిబిఎస్ (కాంబి బ్రేకింగ్ సిస్టమ్), 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 1285 మిమీ వీల్‌బేస్, 127 కేజీ బరువు, అల్లాయ్ వీల్స్ మరియు ట్యూబ్ టైర్స్ మొదలైనవి బజాజ్ సిటి 100ఎక్స్ బైక్ ప్రత్యేకతలు.

Most Read Articles

English summary
Bajaj ct 100 discontinued in india now the only option available is ct 100x
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X