దేశీయ మార్కెట్లో Pulsar P150 లాంచ్ చేసిన బజాజ్ - ధర మరియు వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'బజాజ్ ఆటో' ఎట్టకేలకు దేశీయ విఫణిలో మరో కొత్త బైక్ లాంచ్ చేసింది.

బజాజ్ ఆటో విడుదల చేసిన ఈ కొత్త బైక్ పేరు 'పల్సర్ పి150'. దీని ధర రూ. 1,16,755 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో Pulsar P150 లాంచ్ చేసిన బజాజ్

బజాజ్ పల్సర్ మంచి అమ్మకాలు పొందుతున్న కంపెనీ యొక్క బ్రాండ్. అయితే ఇప్పడు కొత్త హంగులతో కొత్త అవతార్ లో 'పల్సర్ పి150' (Pulsar P150) పుట్టుకొచ్చింది. ఈ కొత్త బైక్ సింగిల్ డిస్క్ (సింగిల్ సీట్) మరియు ట్విన్ డిస్క్ (స్ప్లిట్ సీట్) వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ.1,16,755 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) మరియు రూ.1,19,757 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).

కొత్త పల్సర్ P150 బైక్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ డిజైన్ దాని మునుపటి మోడల్స్ అయిన N160 మరియు N250 నుంచి ప్రేరణ పొందటం జరిగింది. అయితే ఇందులో బై ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్‌ మరియు చిన్న విండ్‌స్క్రీన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఇంజన్ కౌల్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్స్ కూడా ఉన్నాయి.

కొత్త పల్సర్ P150 యొక్క సింగిల్ డిస్క్ వేరియంట్ సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్‌తో పాటు ఒకే సీటును కలిగి ఉంటుంది. కానీ ట్విన్ డిస్క్ మోడల్ స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్‌తో పాటు స్ప్లిట్ సీటును పొందుతుంది. ఈ లేటెస్ట్ బైక్ రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ మరియు ఎబోనీ బ్లాక్ వైట్ అనే ఐదు కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 149 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.5 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు కాగా బరువు కేవలం 140 కేజీలు వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో Pulsar P150 లాంచ్ చేసిన బజాజ్

కొత్త బజాజ్ పల్సర్ P150 బరువు కేవలం 140 కేజీలు మాత్రమే కావున, ఇది దాని మునుపటి మోడల్ కంటే 10 కేజీలు తేలికగా ఉంటుంది. అదే సమయంలో సీట్ హైట్ 790 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ వరకు ఉంటుంది. ఈ కారణంగా ఈ బైక్ రైడర్ కి చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందించేలా రూపొందించబడిందని స్పష్టంగా అర్థమవుతోంది.

బజాజ్ పల్సర్ పి150 బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందువైపు 31 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌, వెనుక వైపు మోనోషాక్‌ సెటప్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, 260 మిమీ డిస్క్ (ముందు భాగంలో) మరియు 230 మిమీ డిస్క్ లేదా 130 మిమీ (వెనుక భాగంలో) డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. బ్రేక్‌లు సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా పొందుతాయి.

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త పల్సర్ పి150 బైక్ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి మంచి పనితీరుని కూడా అందిస్తుంది. అయితే ఈ బైక్ మార్కెట్లో యమహా ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 2వి మరియు హీరో ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో మంచి అమ్మకాలు పొందుతున్న ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో 'బజాజ్ ఆటో' ఒకటి. ఈ కంపెనీ తన వినియోగదారుల కోసం మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల 'పల్సర్ 125 కార్బన్ ఫైబర్ ఎడిషన్‌' విడుదల చేసింది. ఇప్పుడు 'పల్సర్ పి150' లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ తప్పకుండా మరింతమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Bajaj pulsar p150 launched price features engine details
Story first published: Wednesday, November 23, 2022, 11:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X