కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేఫ్టీ విషయంలో అటు కంపెనీలు ఇటు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వాటి అగ్నిప్రమాద ఘటనలు మాత్రం తరచూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి, స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు, కానీ స్కూటర్ మాత్రం దాదాపు సగం కాలిపోయింది.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఎగుర్లు ఓదేలు అనే వ్యక్తి బెన్లింగ్ (Benling) కంపెనీకి చెందిన ఫాల్కన్ (Falcon) ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) ను కొన్ని నెలల క్రితమే కొనుగోలు చేశాడు. అప్పటి నుండి ఈ స్కూటర్ బాగానే నడుస్తున్నప్పటికీ, ఆదివారం రాత్రి తన స్కూటర్‌ను ఇంటి ముందు నిలిపి, రాత్రి భోజనానికి ఇంటిలోకి వెళ్లే ముందు ఎలక్ట్రిక్ వాహనం యొక్క ఛార్జర్ పోర్టును పవర్ సాకెట్‌లో ఉంచి స్విచ్ ఆన్ చేశాడు.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

ఆ తర్వాత కొద్దిసేపటికి స్కూటర్ లోని బ్యాటరీ పేలడం మరియు పెద్ద శబ్ధం రావడంతో ఓదెలు ఇంటి నుంచి బయటకు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే స్కూటర్ దాదాపు సగానికి పైగా కాలిపోయింది. మరోవైపు ఇందులోని బ్యాటరీ పేలడంతో స్కూటర్ చాలా వరకూ డ్యామేజ్ అయింది. అదృష్టవశాత్తు స్కూటర్‌ను ఇంటి బయటి ఉంచి చార్జ్ చేయడం వలన ఎవ్వరకీ ప్రాణహాని జరగలేదు. కాగా, బ్యాటరీ పేలిపోవడానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

బెన్లింగ్ అనేది చైనాకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి దేశీయ మార్కెట్లో ఆరా (Aura), ఫాల్కన్ (Falcon), క్రిటి (Kriti) మరియు ఐకాన్ (Icon) అనే నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఇందులో తాజాగా ప్రమాదానికి గురైనది బెన్లింగ్ ఫాల్కన్ (Benling Falcon) ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పటి వరకూ ఈ బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు వచ్చినట్లుగా ఎక్కడా కేసులు నమోదు కాలేదు. బహుశా ఇదే మొదటి కేసు కావచ్చు.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

బెన్లింగ్ ఫాల్కన్ ఓ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది కేవలం గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించలేదు. ఇందులో 250 వాట్ 60 వోల్ట్స్ బ్రష్‌లెస్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. బ్యాటర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 60V/20Ah*5 (VRLA) సామర్థ్యంతో కూడిన లీడ్ యాసిడ్ బ్యాటరీతో కానీ లేదా 60V/22Ah*1 (Li-Ion) సామర్థ్యంతో కూడిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో కానీ లభిస్తుంది. ఇందులో అగ్నిప్రమాదానికి గురైంది లీడ్ యాసిడ్ బ్యాటరీ వెర్షనా లేక లి-అయాన్ బ్యాటరీ వెర్షనా అనేది తెలియాల్సి ఉంది.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

ఇటీవలి జరిగిన అన్ని ఎలక్ట్రిక్ ప్రమాద ఘటనల్లో దాదాపు లిథియం అయాన్ బ్యాటరీలే పేలిన సందర్భాల్లు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, తాజాగా కరీంనగర్ లో జరిగిన ప్రమాదంలో కూడా లిథియం అయాన్ బ్యాటరీ వెర్షనే పేలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కంపెనీ తమ లీడ్ యాసిడ్ బ్యాటరీ వెర్షన్ కోసం 2.5 A (VRLA) చార్జర్ ను అందిస్తుండగా, లిథియం అయాన్ బ్యాటరీ వెర్షన్ కోసం 6 A (Li-Ion) చార్జర్ ను అందిస్తోంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

ఈ చార్జర్ ను ఉపయోగించి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుండగా, లీడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ను చార్జ్ చేయడానికి సుమారు 7-8 గంటల సమయం పడుతుంది. పూర్తి చార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 70-75 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

బెన్లింగ్ ఫాల్కన్ (Benling Falcon) ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, రైడర్లు తమ ఫోన్ ను చార్జ్ చేసుకోవడం కోసం యూఎస్‌బి పోర్ట్, డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్, బ్రేక్ వేసిన ప్రతిసారి బ్యాటరీ చార్జ్ అయ్యేలా రూపొందించిన రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, స్కూటర్ దొంగిలించబడకుండా ఉండేందుకు డిజైన్ చేసిన యాంటీ తెఫ్ట్ ప్రొటెక్షన్ అలారం, స్కూటర్ పాడైన సందర్భంలో సహాయం అందించే స్మార్ట్ బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్, ఇంటెలిజెంట్ స్పీడోమీటర్ కన్సోల్ మొదలైనవి ఉన్నాయి.

కరీంనగర్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ.. చార్జింగ్ పెట్టిన క్షణాల్లోనే ఢమాల్..!

ఇంకా ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్, పవర్ బటన్ ద్వారా కీలెస్ స్టార్ట్ ఫీచర్, ఇద్దరు ప్రయయాణీకుల సౌకర్యవంతంగా ప్రయాణించగల వెడల్పాటి సీట్, పెద్ద డిజిటల్ స్పీడోమీటర్, ఎల్ఈడి బ్రేక్ లైట్ మరియు ఇండికేటర్లు, మృదువైన రైడ్ కోసం టెలిస్కోపిక్ సస్పెన్షన్ సెటప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ ప్యూర్ వైట్, మ్యాట్ బ్లాక్ మరియు షైనీ రెడ్ అనే కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. లేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Image Courtesy: ABPLive

Most Read Articles

English summary
Benling falcon electric scooter catches fire in karimnagar telangana luckily no one hurt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X