కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బిగాస్ (Bgauss) దేశంలో తమ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ తాజాగా కేరళలోని కాలికట్‌లో రాష్ట్రంలో తమ మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. డీలర్‌షిప్ ప్రారంభోత్సవంతో పాటు, కంపెనీ 50 మంది వినియోగదారులకు తమ స్కూటర్లను కూడా డెలివరీ చేసింది. బిగాస్ ప్రస్తుతం B8 మరియు A2 అనే రెండు స్కూటర్ లను విక్రయిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

ఎలక్ట్రికల్ కేబుల్స్ పరిశ్రమలో ప్రసిద్ధ చెందిన ఆర్ఆర్ గ్రూప్ మరియు ఆర్ఆర్ కేబుల్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాల తయారీ విభాగమే ఈ బిగాస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ. ప్రస్తుతం బిగాస్ కు దేశవ్యాప్తంగా 22 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లు ఉన్నాయి. కాగా, త్వరలో మరికొన్ని డీలర్‌షిప్‌లను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. కంపెనీ తన మొదటి షోరూమ్‌ను నవంబర్ 2020లో ముంబైలోని పన్వెల్‌లో ప్రారంభించింది.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

బిగాస్, జులై 2020 నెలలో ఎ2, బి8 అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఈ ఏడాది మరో రెండు కొత్త స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. బిగాస్ అందిస్తున్న రెండు ఇ-స్కూటర్లు A2 మరియు B8 ధరలు వరుసగా రూ. 52,499 మరియు రూ. 88,999 (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. బిగాస్ A2 మరియు B8 రెండూ కూడా లీడ్-యాసిడ్ బ్యాటరీ మరియు లిథియం-అయాన్ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

ఈ కంపెనీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు రివర్స్ అసిస్ట్, కీలెస్ స్టార్ట్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్, యూఎస్‌బి ఛార్జింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, యాంటీ థెఫ్ట్ మోటార్ లాకింగ్, 3 రైడింగ్ మోడ్‌లు (లో, మీడియం, హై), డేటైమ్ రన్నింగ్ లైట్లు, కలర్ డిజిటల్ డిస్‌ప్లే, సైడ్ స్టాండ్ సెన్సార్లు మొబైల్ యాప్‌ల వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇంకా ఇందులో తొలగించదగిన బ్యాటరీ, ఎల్‌ఇడి ఇన్‌స్ట్రుమెంట్ పానెల్, మల్టీ-కలర్ డిజిటల్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, ఫైండ్ యువర్ స్కూటర్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

ఎంట్రీ-లెవల్ బిగాస్ (BGauss A2) ఎలక్ట్రిక్ స్కూటర్ లో 60V VRLA ఫిక్స్‌డ్ లెడ్-యాసిడ్ బ్యాటరీతో జత చేయబడిన 250-వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీనిని 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 7-8 గంటల సమయం పడుతుంది. అలాగే, కంపెనీ ఇందులో డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందింస్తోంది. దీనిని ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

బిగాస్ ఏ2ని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 110 కిమీల వరకూ ప్రయాణించవచ్చు. అయితే, దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది, ఇదొక లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక ఇందులో ప్రీమియం మోడల్ అయిన బిగాస్ బి8 (BGauss B8) విషయానికి వస్తే, ఇందులో 1900 వాట్ బాష్ BLDC (బ్రష్‌లెస్) మోటార్ మరియు 60V VRLA లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

అంతేకాకుండా, ఇందులో వేరు చేయగలిగిన 1.45 kW లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది. ఈ పూర్తి చార్జ్ పై స్కూటర్ 78 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, లీడ్-యాసిడ్ మోడల్ 0 నుండి 100 శాతం చార్జ్ చేయడానికి సుమారు 7-8 గంటల సమయం పడుతుంది. అదే లిథియం అయాన్ మోడల్ అయితే, దాని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. బిగాస్ బి8 ఎలక్ట్రిక్ స్కూటర్ ను గరిష్టంగా గంటకు 50 కిమీ వేగంతో నడపవచ్చు.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

బిగాస్ ఈసారి పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన మరో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. గడచిన 2020లో లాంచ్ చేసిన B8 మరియు A2 స్కూటర్లు మార్కెట్లో సహేతుకమైన విజయాన్ని సాధించాయని కంపెనీ పేర్కొంది. మార్కెట్లో కొత్త ఉత్పత్తులను విజయవంతంగా లాంచ్ చేసేందుకు గానూ బిగాస్, దేశంలో తమ బ్రాండ్ షోరూమ్‌లను భారీగా విస్తరించడంతో పాటుగా చాకన్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించింది.

కేరళలో మొదటి Bgauss ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ ప్రారంభం.. ఏ2 మరియు బి2 మోడళ్ల విడుదల

కొత్తగా ప్రవేశపెట్టబోయే రెండు స్కూటర్లను పూర్తిగా దేశీయంగా లభించే పరికరాలు, టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి భారతదేశ వ్యాప్తంగా 100 కి పైగా షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని బిగాస్ ఎలక్ట్రిక్ ప్లాన్ చేస్తోంది. భారతదేశంలో తయారు కానున్న ఈ కొత్త ఉత్పత్తులు మరింత మెరుగైన పనితీరు, సుదూర శ్రేణి, అధునాతన భద్రతా ఫీచర్‌లతో పాటుగా మెరుగైన సాంకేతికతను కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. బిగాస్ ప్రస్తుతం విక్రయిస్తున్న స్కూటర్లన్నీ ఐఓటి ఫీచర్‌ను కలిగి ఉంటాయి. వీటి కోసం కంపెనీ ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసింది.

Most Read Articles

English summary
Bgauss electric opens its first dealership in keralas details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X