Just In
- 10 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 11 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 15 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 18 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరలో రానున్న CYBORG Bob-e ఎలక్ట్రిక్ బైక్.. ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్
భారతీయ ఆటో మొబైల్ రంగం శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది, అయితే ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల కన్నా ఎలక్ట్రిక్ వాహన వినియోగంపై ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా దాదాపు చాలా కంపెనీలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ రంగంలోకి తోస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ సైబోర్గ్ (Cyborg) దేశీయ మార్కెట్లో తన రెండవ ఎలక్ట్రిక్ బైక్ బాబ్-ఇ (Bob-e) ని ఆవిష్కరించింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

సైబోర్గ్ (Cyborg) కంపెనీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా భారతీయ మార్కెట్లో తయారుచేయబడింది. ఈ బైక్ ఎక్కువగా యువ కస్టమర్లను ఆకర్శించడానికి స్టైలిష్ గా తయారు చేయబడింది. ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

కొత్త బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ 2.88 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఇది పూర్తిగా డిటాచబుల్ బ్యాటరీ. కావున దీనిని బయటకు తీసి ఛార్జింగ్ వేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ బైక్ కి ఒక్క సారి పూర్తిగా ఛార్జింగ్ వేస్తే దాదాపుగా 110 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఈ బైక్ ని గంటకు 85 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేయవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్‌లో ఎకో, స్పోర్ట్స్ మరియు నార్మల్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రైడర్ తన అవసరానికి అనుగుణంగా రైడ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు.

బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో జియో ఫెన్సింగ్, జియో లొకేట్, బ్యాటరీ స్టేటస్, యూఎస్‌బీ ఛార్జింగ్, బ్లూటూత్, కీలెస్ ఇగ్నిషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి రైడింగ్ సమయంలో చాలా సహకరిస్తాయి.

బాబ్-ఇ ఎలక్ట్రిక్ బైక్ లో ఉపయోగించిన బ్యాటరీ అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ బ్యాటరీ కేవలం 4 నుంచి 5 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. కంపెనీ ఈ బైక్‌తో పాటు 15 amp హోమ్ ఛార్జర్‌ను కూడా కొనుగోలుదారులకు అందిస్తుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ రివర్స్ మోడ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది ముందు వైపున అప్సైడ్డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రెండు కలర్ ఆప్సన్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి బ్లాక్ మరియు సిల్వర్ కలర్స్.

ఇదిలా ఉండగా ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సైబోర్గ్ (CYBORG) పేరుతో ఒక బైక్ పరిచయం చేసింది. ఈ విభాగంలో కంపెనీ అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురాబోతోంది. ప్రస్తుతం కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ మరియు పరికరాలను ఇందులో అందించడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త టెక్నాలజీలను ఈ బైక్ లో తీసుకురానుంది.

కంపెనీ వెల్లడించిన ఈ బైక్ హై రేంజ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్, ఇది స్వాప్ చేయగల బ్యాటరీతో అందించబడుతుంది. కావున ఈ బైక్ లో ఉన్న బ్యాటరీని బయటకు తీసి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ గుర్గావ్ లోని మనేసర్‌లోని ప్లాంట్‌లో ఈ క్రూయిజర్ బైక్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంట్‌లో కంపెనీ 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సైబోర్గ్ మిడ్ మరియు హై స్పీడ్ సెగ్మెంట్లో మూడు ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగానే కంపెనీ తీసుకురానున్న మొదటి మోడల్ క్రూయిజర్ బైక్ యోడా (Yoda). యోడా అనేది భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన క్రూయిజర్ బైక్. కావున భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల్లో పరీక్షిస్తోంది. కావున ఇది తప్పకుండా భారతీయ వినియోగదారులకు మన్నికైన బైక్ కానుంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.