2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

డాకర్ ర్యాలీ 2022 యొక్క 10వ స్టేజి ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఇందులోని బైక్ విభాగంలో హోండా రైడర్ టోబి ప్రైస్ విజయం సాధించగా, కార్ విభాగంలో ఆడి డ్రైవర్ 'స్టెఫాన్ పీటర్‌హాన్సెల్' ముందంజలో నిలిచాడు. డాకర్ ర్యాలీ 10వ స్టేజి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

డాకర్ ర్యాలీలో బైక్‌ విభాగం:

డాకర్ ర్యాలీ 10వ స్టేజిలో బైక్ విభాగాల్లోని దాదాపు అందరు రైడర్లు ఎంతో ఉత్సాహంగా రైడింగ్ చేశారు. ఈ స్టేజిలో వాడి అడ్ దవాసిర్ నుండి బిషా వరకు సౌదీ అరేబియా ఇసుక మీదుగా 375 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఇందులో కెటిఎమ్ బైక్ రైడర్ 'టోబీ ప్రైస్' ఇందులో ప్రధమ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

అయితే ఇందులో ఆసీస్ 3 గంటల 5 నిమిషాల 32 సెకన్లలో విజయం సాధించాడు. లూసియానో ​​బెనవిడెస్‌కి చెందిన హస్క్‌వర్నా కంటే ముందు స్టేజ్ పూర్తి చేశారు. అయితే ఇప్పటివరకు బైక్‌ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న యమహా రైడర్ అడ్రియన్ వాన్ బెవెరెన్ ఈ 10వ స్టేజిలో మూడో స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

అదే సమయంలో ఈ స్టేజిలో లూసియానో ​​సోదరుడు, డిఫెండింగ్ ఛాంపియన్ కెవిన్ బెనవిడెస్ అతని KTM బైక్ లో తలెత్తిన కొన్ని మెకానికల్ సమస్యల కారణంగా స్టేజ్ నుండి రిటైర్ అవ్వాల్సి వచ్చింది. యితడు గత సంవత్సరం హోండాపై ఆధిక్యతను పొందాడు. అయితే ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇప్పుడు బయటకు వెళ్ళవలసి వచ్చింది.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

ఇందులో పాల్గొన్న 5 మంది భారతీయ రైడర్స్ లో, స్పానిష్ TVS షెర్కో రైడర్ లోరెంజో శాంటోలినో 4వ స్థానంలో నిలిచాడు. ఆ తరువాత స్థానంలో రుయి గొన్‌కాల్వ్స్ ఉన్నారు. అదే విధంగా ఆరోన్ మేర్ తన సహచరుడు జోక్విమ్ రోడ్రిగ్స్ 13వ స్థానంలో నిలిచాడు. భారతీయ రైడర్ హరిత్ నోహ్ మాత్రం ఇందులో 44వ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

మొత్తం మీద బైక్ విభాగంలో యమహా రైడర్ అడ్రియన్ వాన్ బెవెరెన్ ఇప్పుడు డాకర్ 2022లో ముందంజలో ఉన్నాడు. ఫ్రెంచ్ వ్యక్తి ప్రస్తుతం తన బావ గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ కంటే 5 నిమిషాల 59 సెకన్లు ముందున్నాడు. హోండా యొక్క పాబ్లో క్వింటానిల్లా సుందర్‌ల్యాండ్‌కు కేవలం 16 సెకన్ల వెనుకబడి మొత్తం మీద మూడవ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

TVS షెర్కో యొక్క లోరెంజో శాంటోలినో ప్రస్తుతం మొత్తం 11వ స్థానంలో ఉన్నాడు. హీరో రోడ్రిగ్స్ 14వ స్థానంలో ఉండగా, అతని సహచరుడు మేరే మరో 2 స్థానాలు వెనుకబడి 16వ స్థానంలో ఉన్నాడు. TVS షెర్కో రైడర్ రూయి గొన్‌కాల్వ్స్ ప్రస్తుతం 24వ ర్యాంక్‌లో ఉండగా. 10వ స్టేజి ప్రారంభించని నోహ్ ఇప్పుడు ఓవరాల్‌గా 63వ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

డాకర్ ర్యాలీలో కార్ విభాగం:

డాకర్ ర్యాలీలోని కార్ల విభాగంలో జర్మన్ కార్‌మేకర్ స్టీఫెన్ పీటర్‌హాన్‌సెల్ మొదటి స్థానంలో నిలిచాడు. పీటర్‌హాన్సెల్ ప్రస్తుతం డాకర్ రికార్డ్ హోల్డర్ అరి వటనెన్ కంటే కూడా ఈ దశలో విజయం సాధించాడు. అదే విధంగా ఫ్రెంచ్ డ్రైవర్ డాకర్ 2022 యొక్క 10వ స్టేజిని 2 గంటల, 52 నిమిషాల 43 సెకన్లలో, 2 నిమిషాల 6 సెకన్లలో సహచరుడు కార్లోస్ సైంజ్ కంటే ముందుగా ముగించాడు. బహ్రెయిన్ రైడ్ ఎక్స్‌ట్రీమ్ డ్రైవర్ ఓర్లాండో టెర్రానోవా చివరి పోడియం స్థానాన్ని క్లెయిమ్ చేసింది.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

మొత్తం మీద వచ్చిన ర్యాంకింగ్స్‌లో, నాజర్ అల్-అత్తియా సెబాస్టియన్ లోబ్ కంటే ఒక నిమిషం మరియు 25 సెకన్ల వెనుకబడి స్టేజ్‌ను ముగించిన తర్వాత అతని ఆధిక్యాన్ని 32 నిమిషాల 40 సెకన్లకు తగ్గించాడు. నిన్నటి దశలో సీట్‌బెల్ట్ ఉల్లంఘించినందుకు అల్-అత్తియాకు అదనంగా 5 నిమిషాలు జరిమానా విధించబడింది.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

డాకర్ ర్యాలీ 2022 స్టేజ్ 10 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజి హోరాహోరీగా సాగింది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ కెవిన్ బెనవిడెస్ మెకానికల్ సమస్యల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవలసి వచ్చింది. ఆసీస్ టోబి ప్రైస్ ఇందులో విజయ కేతనం ఎగురవేశాడు.

2022 డాకర్ ర్యాలీ 10వ స్టేజ్ ఫలితాలు: విజేతలు

కార్ల విభాగంలో కూడా అందరూ గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో స్టీఫెన్ పీటర్‌హాన్‌సెల్ మొదటి స్థానంలో నిలువగా, నాసర్ అల్-అత్తియా కొంత వెనుకపడాల్సి వచ్చింది. అయితో మొత్తానికి సజావుగా 10వ స్టేజి డాకర్ ర్యాలీ ముగిసింది.

Most Read Articles

English summary
Dakar rally 2022 stage 10 results toby price stephane peterhansel claim victory
Story first published: Thursday, January 13, 2022, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X