కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

ముందుగా పాఠకులందరికి డ్రైవ్‌స్పార్క్ తరపున నూతన సంవత్సర శుభాకంక్షాలు.

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లో తమ ఉనికిని చాటుకోవడానికి మరియు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రత్యర్థులకు దీటుగా నిలబడటానికి తగిన రీతిలో సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందులో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఎర్త్ ఎనర్జీ' (Earth Energy) కూడా ఉంది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

'ఎర్త్ ఎనర్జీ' (Earth Energy) తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంతో భాగంగా వచ్చే రెండు సంవత్సరాల్లో ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ చాలా వేగంగా ఉంది. అయితే రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

'ఎర్త్ ఎనర్జీ' (Earth Energy) కంపెనీ ఇప్పటికే టైర్-1 మరియు టైర్-2 నగరాల్లో రూ.250 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ప్రగతి మార్గంలో పయనిస్తోంది, కాగా ఇప్పుడు మరో రెండేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి మరింత వేగంగా ముందుకు సాగుతుంది. ఉత్పత్తి, సాంకేతికత, పరిశోధన మరియు అభివృద్ధిని పెంచడానికి కంపెనీ ఈ పెట్టుబడిని పెట్టనుంది. ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్‌లు కాకుండా సంస్థాగత మరియు వ్యూహాత్మక పెట్టుబడిదారుల ద్వారా నిధులు సమీకరించబడతాయని కంపెనీ తెలిపింది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

కంపెనీ స్థిరమైన పద్ధతిలో వృద్ధి చెందడానికి, పుష్-బేస్డ్ డిమాండ్ మోడల్‌కు బదులుగా పుల్-బేస్డ్ డిమాండ్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఎర్త్ ఎనర్జీ 2024 నాటికి నాలుగు వాహనాలను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో కమర్షియల్ వెహికల్ ఉండనున్నాయి. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఎక్కువ డిమాండ్ ఉంది, కావున కంపెనీ తప్పకుండా ప్రజాదరణ పొందుతుంది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, జనవరి-ఫిబ్రవరి నుంచి తమ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 3,500 యూనిట్లకు పెంచాలని, ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతే కాకుండా మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన తర్వాత, నెలకు అదనంగా 1,000 యూనిట్లు ఉత్పత్తి చేయబడతాయి. ఉత్పత్తి వేగం పెరిగితే కంపెనీ యొక్క అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతాయి.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మాత్రమే కాకుండా.. కంపెనీ వాటికి కావాల్సిన ఛార్జింగ్ సదుపాయాలను కూడా కల్పిచడానికి సన్నాహాలు చేస్తోంది. కావున కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ఛార్జింగ్ కి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండవు. తమ వాహనాలు అన్ని ప్రభుత్వ ఛార్జింగ్ స్టేషన్‌లకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

ఎర్త్ ఎనర్జీ భారతదేశంలో గ్లైడ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రెండు వేరియంట్‌లలో అందిస్తోంది. ఇందులో ఒకటి లో స్పీడ్ కాగా, మరొకటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులోని లో-స్పీడ్ గ్లైడ్ SX స్కూటర్ గరిష్టంగా 25 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. అయితే హై-స్పీడ్ మోడల్ యొక్క గరిష్ట వేగం 90 కిమీ/గం వరకు ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

కంపెనీ యొక్క లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి కూడా అవసరం లేదు. కావున ఇది రోజు వారి ప్రయాణానికి మరియు నగరంలో తిరగటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది స్కూడెంట్స్ వంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

ఎర్త్ ఎనర్జీ కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే Evolve Z అనే ఈ-బైక్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.42 లక్షల వరకు ఉంటుంది. ముంబైకి చెందిన ఎర్త్ ఎనర్జీ కంపెనీ తన వాహనాల్లో 96 శాతం స్థానిక విడిభాగాలను మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది. రానున్న రోజుల్లో ఇందులో మొత్తం దేశీయ ఉత్పత్తులనే వినియోగించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

ఎర్త్ ఎనర్జీ దేశీయ పారిశ్రామిక రాజధాని నగరం ముంబై శివార్లలో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంటు ప్రతి సంవత్సరం 12,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగలదు. అయితే కంపెనీ అతి త్వరలో ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని మరింత పెంచనుంది. అప్పుడు కంపెనీ యొక్క ఈ ప్లాంట్ ప్రతి సంవత్సరం 65,000 ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది.

కొత్త సంవత్సరంలో కొత్త ప్లాన్ వెల్లడించిన Earth Energy: మీరూ చూసెయ్యండి

ఎర్త్ ఎనర్జీ కంపెనీ దేశవ్యాప్తంగా 45 కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించబోతోంది. ప్రస్తుతం కంపెనీ ముంబైలోని 7 డీలర్‌షిప్‌ల ద్వారా వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటాయి. కావున ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఎర్త్ ఎనర్జీ యొక్క ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి ఛార్జ్ తో ఏకంగా 110 కిమీల పరిధిని అందిస్తాయి. మొత్తానికి కంపెనీ రానున్న రోజుల్లో మరింత ఆదరణ పొందుతూ మంచి అమ్మకాలను సొంత చేసుకుంటుంది అని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Earth energy plans to invest around rs 100 crore in future
Story first published: Saturday, January 1, 2022, 9:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X