షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు ఎలక్ట్రిక్ స్కూటర్‌ల మాదిరిగానే, ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ శ్రమ మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ప్రత్యేకించి, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు తమ రోజూవారీ చిన్నపాటి ప్రయాణాల కోసం ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిళ్లను ఎంచుకోవడం మంచిది. ఇ-సైకిళ్లతో ట్రాఫిక్ లో సులువుగా ముందుకు సాగిపోవడమే కాకుండా, పెడలింగ్ చేయడం వలన కొద్దిపాటి ఫిట్‌నెస్ కూడా తోడవుతుంది.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

సాధారణంగా, ఎలక్ట్రిక్ సైకిళ్లు మహా అయితే 20 నుండి 50 కిలోమీటర్ల రేంజ్‌ను మాత్రమే కలిగి ఉంటాయి. అయితే, ఈ కథనంలో మనం చెప్పుకోబోయే ఎలక్ట్రిక్ సైకిల్ మాత్రం ఒక్కసారి చార్జ్ చేస్తే ఆగకుండా 510 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కొలరాడోకు చెందిన ఇ-బైక్ తయారీదారు ఆప్ట్‌బైక్ (Optbike) ఇటీవల తన హై రేంజ్ ఆర్222 ఎవరెస్ట్ (R22 Everest) ఎలక్ట్రిక్ సైకిల్‌ను గ్లోబల్ మార్కెట్‌ లలో విడుదల చేసింది.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఫుల్ చార్జ్ పై 510 కిలోమీటర్ల రేంజ్

ఆర్22 ఎవరెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దాని రేంజ్. రేంజ్ విషయంలో ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ టూవీలర్ మరియు ఫోర్-వీలర్ వినియోగదారులు అంత సంతృప్తిగా లేరు. కంపెనీలు చెబుతున్నది ఒకటి, రియల్ గా లభిస్తున్న రేంజ్ మరొకటి. ఈ రెండింటికీ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సమాచారం ప్రకారం, ఆర్22 ఎవరెస్ట్ ను పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 510 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది అనేక లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లు అందించే రేంజ్ కంటే కూడా చాలా ఎక్కువ. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క లాంగ్ రేంజ్‌కి కారణం దాని బ్యాటరీ మరియు మోటార్.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఈ చిన్న సైకిల్‌లో 16 కిలోల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది

సాధారణంగా ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఉపయోగించే బ్యాటరీ 10 నుండి 20 కిలోల వరకూ బరువు ఉంటుంది. ఇ-సైకిళ్లలో అయితే ఇది ఇంకా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ, ఈ Optbike యొక్క ఈ ఇ-సైకిల్‌లో, కంపెనీ 16 కిలోల బ్యాటరీని ఉపయోగించింది. సాధారణ ఎలక్ట్రిక్ సైకిల్‌లో ఉండే బ్యాటరీ కంటే ఇది చాలా పెద్దది. ఈ బ్యాటరీ మొత్తం సామర్థ్యం 3.26 kWh (మనదేశంలో ఇది టీవీఎస్ ఐక్యూబ్ బ్యాటరీ ప్యాక్‌ సామర్థ్యంతో సమానం).

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఆర్22 ఎవరెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ లో బ్యాటరీని సులువుగా అమర్చడానికి మరియు తొలగించడానికి వీలుగా ఇది రెండు భాగాలుగా తయారు చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ లోని బ్యాటరీ పూర్తిగా తొలగించదగినది. బ్యాటరీని తొలగించిన తర్వాత, ఈ ఇ-సైకిల్‌ను సాధారణ సైకిల్‌లా పెడల్ సాయంతో తొక్కుతూ ఉపయోగించవచ్చు. ఈ బ్యాటరీలను విడిగా తీసి చార్జ్ చేసుకోవ్చచు లేదా అలానే సైకిల్ కు ఉంచి చార్జ్ చేసుకోవచ్చు.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

టాప్ స్పీడ్ 58 కిలోమీటర్లు

రేంజ్‌ విషయంలో నే కాదు, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ స్పీడ్ పరంగా కూడా మార్కెట్లోని అనేక ఎలక్ట్రిక్ స్కూటర్‌లను బీట్ చేస్తుంది. ఆర్22 ఎవరెస్ట్ గరిష్ట వేగం గంటకు 58 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇ-సైకిల్ లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 190 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేయగలదు. ఈ సైకిల్ ను నడిపే రైడర్ బరువు 72 కిలోలు అయితే, ఈ సైకిల్‌ను గంటకు 24 గరిష్ట వేగంతో కిమీ వేగంతో 510 కిమీ వరకు నడపవచ్చని కంపెనీ తెలిపింది.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను సాధారణ రోడ్‌లతో పాటు ఆఫ్‌రోడ్‌లో కూడా నడపవచ్చు. దీని కోసం, ఈ సైకిల్‌లో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. సైకిల్ తేలికగా ఉంచడానికి కంపెనీ దీని ఫ్రేమ్ ను కార్బన్ ఫైబర్‌ తో తయారు చేసింది. బ్రేకింగ్ విషయానికి, ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ముందు మరియు వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్ లు ఉంటాయి.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఆర్22 ఎవరెస్ట్ ఇ-సైకిల్ లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్, బ్యాటరీ చార్జింగ్ స్థాయి, మిగిలిన రేంజ్ మరియు ఖాలీ నుండి దూరం వంటి కీలక సమాచారాన్ని ప్రదర్శించే ఎల్‌సిడి డిస్‌ప్లే వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ దాని అధిక రేంజ్ కు తగినట్లుగానే అధిక ధరను కూడా కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ఆర్22 ఎవరెస్ట్ ఇ-సైకిల్ ధర 18,900 డాలర్లు. అంటే, మన భారతదేశ కరెన్సీలో దాదాపు 15 లక్షల రూపాయలు. ప్రస్తుతం ఈ ఇ-సైకిల్ అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

ఒకవేళ, భారతదేశంలో కూడా మీరు ఏదైనా ఎలక్ట్రిక్ సైకిల్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని ఉపయోగించుకోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం తమ ఈవీ పాలసీలో ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా చేర్చింది. ఇందులో భాగంగా, ఇ-సైకిళ్లను కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా రాయితీలు ఇవ్వబడతాయి. ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరపై ఢిల్లీ ప్రభుత్వం 33 శాతం సబ్సిడీ ఇస్తోంది.

షాకింగ్.. పూర్తి చార్జ్ పై ఏకంగా 510 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించే ఎలక్ట్రిక్ సైకిల్..!

మీరు ఢిల్లీలో నివసిస్తూ ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటే, మీరు రూ.15,000 వరకు సబ్సిడీని పొందవచ్చు. కొత్త విధానం ప్రకారం, ఢిల్లీలో ప్రయాణీకుల ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరపై 25 శాతం మరియు కార్గో ఎలక్ట్రిక్ సైకిళ్ల ధరపై 33 శాతం సబ్సిడీని పొందవచ్చు. కార్గో ఇ-సైకిళ్లపై గరిష్టంగా రూ.5,500 సబ్సిడీ ఇస్తోంది. మొదటి 1,000 మంది కొనుగోలుదారులకు ఇ-సైకిల్‌పై రూ. 2,000 అదనపు తగ్గింపు ఇవ్వబడుతుంది.

Most Read Articles

English summary
Electric cycle with 510 km range launched features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X