మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

హైదరాబాద్ కు చెందిన విద్యుత్ వాహన (ఎలక్ట్రిల్ వెహికల్) తయారీ కంపెనీ ఈవియం (EVeium), దేశీయ మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈవియం కాస్మో (EVeium Cosmo), ఈవియం కామెట్ (EVeium Comet) మరియు ఈవియం సీజర్ (EVeium Czar) అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈవియయం ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 1.44 లక్షల నుండి రూ. 2.16 లక్షల మధ్యలో ఉన్నాయి. మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

ఈవియం (EVeium) అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న META4 యొక్క ఆటోమోటివ్ విభాగం అయిన ఎలైసియం ఆటోమోటివ్స్ (Eleysium Automotive) ఇటీవలే ప్రారంభించిన ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్. ఈవియం కొత్తగా ప్రారంభించిన ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలను (కాస్మో, కామెట్ మరియు సీజర్) కంపెనీ హై-స్పీడ్ స్కూటర్‌ లుగా వర్గీకరికరించింది. వీటిలో కాస్మో ధర రూ. 1.44 లక్షలు, కామెట్ ధర రూ. 1.92 లక్షలు మరియు సీజర్ ధర రూ. 2.16 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

ఈవియం కాస్మో (EVeium Cosmo):

ఈవియం కాస్మో అనేది ఈ హైదరాబాద్ ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నుండి వచ్చిన ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్. కాస్మో ఎలక్ట్రిక్ స్కూటర్ లో 72V, 30Ah (2.16kWh) లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే, ఆ చార్జ్ తో గరిష్టంగా 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అమర్చిన 2,000 వాట్ (2.72 bhp) ఎలక్ట్రిక్ మోటార్, కాస్మో ఎలక్ట్రిక్ స్కూటర్ ను గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీసేలా చేస్తుంది. ఈవియం కాస్మో మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది. వీటిలో వైట్, గ్రే, బ్లూ, లెమన్ ఎల్లో, చెర్రీ రెడ్ మరియు బ్రైట్ బ్లాక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

ఈవియం కామెట్ (EVeium Comet):

ఈవియం విడుదల చేసిన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ కామెట్. కంపెనీ ఇందులో పెద్ద 72V, 50ah (3.6kWh) లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగిచింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఇందులో అమర్చిన 3000 వాట్ (4.02 bhp) ఎలక్ట్రిక్ మోటారు పనిచేస్తుంది. ఈ మోటార్ కామెట్ ‌ను గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేలా చేస్తుంది. ఈవియం కామెట్ కూడా 6 రంగులలో అందించబడుతుంది. ఇందులో షైనీ బ్లాక్, మ్యాట్ బ్లాక్, వైన్ రెడ్, వైట్, రాయల్ బ్లూ మరియు బేజ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

ఈవియం సీజర్ (EVeium Czar):

ఈవియం విడుదల చేసిన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ సీజర్. ఇది ఈ లైనప్ లోనే అత్యంత ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు అధిక ధరను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ అధిక ధరకు తగినట్లుగానే ఈవియం సీజర్ అత్యుత్తమ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో అతిపెద్ద 3.02kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఫలితంగా, ఇది పూర్తి ఛార్జ్ ‌పై గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

ఈవియం సీజర్ లో మరింత శక్తివంతమైన 5.36 bhp ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. దీని సాయంతో ఇది గరిష్టంగా గంటకు 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ దూసుకుపోతుంది. ఈవియం సీజర్ కూడా 6 విభిన్న రంగులలో లభిస్తుంది. ఇందులో గ్లోసీ బ్లాక్, మ్యాట్ బ్లాక్, గ్లోసీ రెడ్, లైట్ బ్లూ, మింట్ గ్రీన్ మరియు వైట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

ఈవియం అందిస్తున్న ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా క్లాసిక్ డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బహుళ రైడింగ్ మోడ్‌లు ఉంటాయి, వీటిలో ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ మోడ్ లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని ఇతర ఫీచర్లను గమనిస్తే, వీటిలో కీలెస్ స్టార్ట్, రీజెన్ బ్రేకింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన LCD డిస్‌ప్లే, జియో-ఫెన్సింగ్ మరియు ఓవర్-స్పీడింగ్ అలర్ట్ మొదలైనవి ఉన్నాయి. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా వాటి బ్యాటరీ ప్యాక్‌లను కేవలం 4 గంటల్లో రీఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కామెట్ మరియు సీజర్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో రివర్స్ గేర్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

మార్కెట్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసిన హైదరబాద్ ఈవీ కంపెనీ 'ఈవియం'

ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఈవియం భాగస్వామి మరియు ప్రమోటర్ అయిన ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ, "భారతీయ మార్కెట్ కోసం ఈవియం బ్రాండ్‌ను ప్రారంభించిన తక్కువ వ్యవధిలో మేము మూడు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం, భారతీయ ఈవీ పరిశ్రమకు నాణ్యమైన ఉత్పత్తులతో మార్కెట్‌ను బలోపేతం చేసే నిబద్ధత కలిగిన తయారీదారులు ఎంతో అవసరం, తద్వారా అది నిలకడగా మరియు అదే సమయంలో మరింత అభివృద్ధి చెందుతుంది" అని అన్నారు.

Most Read Articles

English summary
Eveium electric launched three electric scooters in india price range features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X