పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

భారతదేశంలో ఇప్పటికే వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. త్వరలో విజయదశమి మరియు దీపావళి రానున్నాయి. ఈ పండుగల సమయంలో చాలామంది కొత్త బైకులు లేదా కొత్త కార్లు కొనాలని ఆలోచిస్తారు. ఎక్కువ భాగం తక్కువ ధర వద్ద ఏ బైకులు అందుబాటులో ఉన్నాయని చాలామంది ఆలోచిస్తారు.

అలాంటి వారికోసం ఈ పండుగ సీజన్లో కేవలం రూ. 1 లక్ష ధర లోపు లభించే బైకులు ఏవి, వాటి వివరాలు ఏమిటి అనే సమాచారం ఇక్కడ చూద్దాం..

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హీరో గ్లామర్ 125 ఎక్స్‌టెక్ (Hero Glamour 125 Xtec):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోటోకార్ప్ యొక్క 'హీరో గ్లామర్ 125 ఎక్స్‌టెక్' బైక్ ఈ పండుగ సీజన్లో కొనుగోలు చేయడానికి ఉత్తమమైన బైకులలో ఒకటి. దీని ధర రూ. 84,220 నుంచి రూ. 88,820 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది మంచి డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా అద్భుతమైన మైలేజ్ కూడా అందిస్తుంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హీరో గ్లామర్ 125 ఎక్స్‌టెక్ (Hero Glamour 125 Xtec) బైక్ డిస్క్ బ్రేక్ మరియు డ్రమ్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంది. ఇందులో హీరో గ్లామర్ 125 ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 84,220 (ఎక్స్-షోరూమ్) కాగా, హీరో గ్లామర్ 125 ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్ ధర రూ. 88,820 (ఎక్స్-షోరూమ్).

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హీరో గ్లామర్ 125 ఎక్స్‌టెక్ బైకులో లేటెస్ట్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో 125 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 10.7 బిహెచ్‌పి పవర్ మరియు 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125):

ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత పాపులర్ కంపెనీ అయిన టీవీఎస్ యొక్క రైడర్ 125 కూడా తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న బైకులలో ఒకటి. దీని ధరలు రూ. 85,173 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 92,689 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది డిస్క్ బ్రేక్ మరియు డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

టీవీఎస్ రైడర్ 125 బైక్ అదే అద్భుతమైన డిజైన్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్, అందులో ఎల్ఈడీ లైటింగ్ మరియు స్ప్లిట్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు ఉన్నాయి. వెనుక భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్ ఉంటుంది. ఈ బైక్ లో 10 లీటర్ కెపాసిటీ కలిగిన డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

ఈ బైక్ లో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచెస్ TFT స్క్రీన్‌ ఉంటుంది. ఇది బ్రాండ్ యొక్క SmartXConnect కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. అయితే ఇందులోని 'లో వేరియంట్' నెగిటీవ్ LCD యూనిట్‌తో అందించబడుతుంది. ఇందులో వాహన వినియోగదారుడు మల్టిపుల్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంజిన్ సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఇండికేటర్, టైమ్, టాకోమీటర్, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ మరియు ఫ్యూయెల్ రేంజ్ వంటి ఫీచర్స్ కూడా పొందవచ్చు.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

టీవీఎస్ రైడర్ 125 బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 124.8 సీసీ ఇంజిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హోండా ఎస్‌పి 125 (Honda SP 125):

హోండా మోటోకార్ప్ యొక్క ఎస్‌పి 125 కూడా మంచి మైలేజ్ అందించే మరియు ఒక లక్ష రూపాయల లోపు లభించే బైకుల ఆబితాలో ఒకటి. దీని ధరలు రూ. 82,486 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 86,486 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇందులో 124 సిసి ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఇది 10 బిహెచ్‌పి పవర్ మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హోండా ఎస్‌పి 125 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఇది డ్రమ్ మరియు డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటివి మాత్రమే కాకుండా.. రిఫైన్డ్ ఇంజన్, సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ, ఫ్యూయల్ ఇంజెక్షన్, కాంబి బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125):

బజాజ్ కంపెనీ కూడా అత్యధిక పనితీరుని అందించే మరియు తక్కువ ధర వద్ద అందుబాటులో ఉన్న బైకులను కూడా మార్కెటీకో విడుదల చేసింది. ఇందులో పల్సర్ 125 కూడా ఉంది. ఈ బజాజ్ పల్సర్ 125 ధర రూ. 81,389 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 90,003 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

బజాజ్ పల్సర్ 125 అనేది పల్సర్ శ్రేణిలో తక్కువ ధరకు లభించే బైక్. ఇది హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ లైట్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఫీచర్లను పొందుతుంది. అదే సమయంలో మెరుగైన బ్రేకింగ్ కోసం కబీ బ్రేక్ సిస్టమ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.

బజాజ్ పల్సర్ 125 బైక్ 124.38 సిసి ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుతుంది. ఇది 11.08 బిహెచ్‌పి పవర్ మరియు 11 న్యూటన్ మీటర్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హీరో సూపర్ స్ప్లెండర్ (Hero Super Splendor):

మన జాబితాలో 'హీరో సూపర్ స్ప్లెండర్' కూడా కేవలం 1 లక్ష లోపు అందుబాటులో ఉన్న బైక్. ఇది డిస్క్ మరియు డ్రమ్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. వీరి ధరలు రూ. 77,500 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 81,630 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

హీరో మోటోకార్ప్ యొక్క సూపర్ స్ప్లెండర్ 124.7 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ తో అందుబాటులో ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

పండుగ సీజన్‌లో ముందే పండుగ చేసుకోండి.. రూ. 1 లక్ష లోపు లభించే బైకులు - వాటి వివరాలు

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, హాలోజన్ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఈ బైక్ యొక్క అన్ని వేరియంట్లలోనూ కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఇది బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Five best bikes available for festive season under rs 1 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X