భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

అమెరికన్ లగ్జరీ టూవీలర్ కంపెనీ హార్లే డేవిడ్సన్ (Harley Davidson) భారత మార్కెట్లో నేరుగా ప్రత్యక్ష వ్యాపారం చేయనప్పటికీ, హీరో మోటోకార్ప్ ద్వారా పరోక్ష వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం, భారతదేశంలో హార్లే డేవిడ్సన్ వ్యాపార కార్యకలాపాలను మనదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ నిర్వహిస్తోంది. తాజాగా, హార్లే డేవిడ్సన్ భారత మార్కెట్లో తమ సరికొత్త నైట్‌స్టర్ మోటార్‌సైకిల్ ను విడుదల చేశింది. దేశీయ విపణిలో హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ ధర రూ. 14.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ కోసం కంపెనీ 'ది వరల్డ్స్ బెస్ట్ జాబ్' అనే క్యాంపైన్ ను కూడా ప్రారంభించింది. ఈ కొత్త నైట్‌స్టర్ లైట్ వెయిట్ ఛాసిస్‌పై నిర్మించబడింది మరియు హార్లే-డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ కోసం కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌ ను ఉపయోగిస్తున్నారు. కొత్తగా వచ్చిన హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ దాని స్పోర్ట్‌స్టర్ సిరీస్‌ కి ఎంట్రీ లెవల్ వేరియంట్ గా ఉంటుంది. హార్లే డెవిడ్సన్ నైట్‌స్టర్‌ లోని ఛాస్సిస్ ట్యూబ్లర్ స్టీల్ యూనిట్ గా ఉంటుంది. ఇది చాలా తేలికమైన ఫ్రేమ్, ఫలితంగా నైట్‌స్టర్ 218 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. హార్లే డేవిడ్సన్ స్పోర్ట్‌స్టర్ సిరీస్ కి చెందిన మునుపటి-తరం ఎయిర్-కూల్డ్ బైక్‌ల కంటే ఇది చాలా తేలికైనదిగా ఉంటుంది.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ లిక్విడ్-కూల్డ్, 60-డిగ్రీ V-ట్విన్ 975సీసీ ఇంజన్ గరిష్టంగా 90 hp శక్తిని మరియు 95 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్పోర్ట్‌స్టర్ ఎస్ మరియు పాన్ అమెరికా 1250 యొక్క స్కేల్-డౌన్ వెర్షన్‌ గా ఉంటుంది. ఈ రివల్యూషన్ మ్యాక్స్ 975T ఇంజన్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇక దీని రైడింగ్ పొజిషన్ విషయానికి వస్తే, ఇతర హార్లే డేవిడ్సన్ బైక్ ల మాదిరిగానే, ఈ కొత్త నైట్‌స్టర్ కూడా తక్కువ-రైడ్‌ పొజిషన్ ను కలిగి ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ యొక్క సీట్ హైట్ భూమి నుండి 705 మిమీ ఎత్తులో ఉంటుంది.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ డిజైన్ చాలా విశిష్టంగా మరియు రెట్రో-మోడ్రన్ గా ఉంటుంది. ఇందులో ముందు వైపు గుండ్రటి హెడ్‌ల్యాంప్ క్లస్టర్, గుండ్రటి టర్న్ ఇండికేటర్లు, బార్ ఎండ్ మిర్రర్లు, గుండ్రటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ పీస్ సీట్, పెద్ద రేడియేటర్ గ్రిల్, బయటకు కనిపించే ఫ్రేమ్, గ్రే కలర్ లో ఫినిష్ చేయబడిన ట్విన్ ఇంజన్, స్ప్లిట్ సైలెన్సర్, చిన్న ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు ఇంజన్ కేసింగ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను గమనించవచ్చు.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

ఇంకా ఈ మోటార్‌సైకిల్ లో ముందు వైపు పెద్ద 19 ఇంచ్ వీల్, 41 మిమీ ట్రావెల్ తో కూడిన షోవా టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 320 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేకింగ్ మరియు వెనుక వైపు మరొక డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ కూడా డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. ఫ్రంట్ బ్రేక్ స్మూత్‌గా ఉండి, యాక్సియల్లీ మౌంటెడ్ ఫోర్-పిస్టన్ కాలిపర్‌ను కలిగి ఉంటుంది

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

కొత్త హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్‌ దాని పెద్దన్న అయిన స్పోర్ట్‌స్టర్ మాదిరిగానే సన్నగా ఉండే 11.7 లీటర్ల ఇంధన ట్యాంక్ ను పొందుతుంది. ఈ బైక్ లో మీరు పవర్ డెలివరీ, ఇంజన్ బ్రేకింగ్, ABS మరియు ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేసే మూడు రైడింగ్ మోడ్‌లను కూడా పొందుతారు. నైట్‌స్టర్ బైక్ లో పూర్తి ఎల్ఈడి లైటింగ్‌ కూడా ఉంటుంది. ఇది వివిడ్ బ్లాక్, గన్‌షిప్ గ్రే మరియు రెడ్‌లైన్ రెడ్‌ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందించబడుతుంది.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

హార్లే డేవిడ్సన్ భారత మార్కెట్ లో ప్రత్యక్ష వ్యాపారం నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి, మనదేశంలో ఈ అమెరికన్ టూవీలర్ బ్రాండ్ కార్యకలాపాలను హీరో మోటోకార్ప్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, చాలా కాలం తర్వాత హార్లే డేవిడ్సన్ బ్రాండ్ నుండి మనదేశంలో ఓ కొత్త మోటార్‌సైకిల్ మార్కెట్లోకి వచ్చింది. మరి కస్టమర్లు ఈ కొత్త హార్లే డేవిడ్సన్ బైక్ ని ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

హార్లే డేవిడ్సన్ మొట్టమొదటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ బైక్ పాన్ అమెరికా గురించి తెలుసా..?

ఇదిలా ఉంటే, గతేడాది హార్లే డేవిడ్సన్ తమ మొట్టమొదటి ఆఫ్-రోడ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ 'పాన్ అమెరికా' (Pan America) ని భారత మార్కెట్లో విడుదల చేసింది. హ్యార్లీ డేవిడ్‌సన్ తమ పాన్ అమెరికా అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ప్రారంభ ధర రూ.16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన పాన్ అమెరికా 1250 స్పెషల్ ధర రూ.19.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

ఇప్పటి వరకూ మనం చూసిన హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే ఈ సరికొత్త హ్యార్లీ డేవిడ్‌సన్ పాన్ అమెరికా అడ్వెంచర్ మోటార్‌సైకిల్ చాలా విభిన్నమైన డిజైన్ ను కలిగి ఉండి, ప్రత్యేకించి ఆఫ్-రోడ్ మార్కెట్ కోసం ఉద్దేశించబడినట్లుగా ఉంటుంది. పాన్ అమెరికాను కూడా లైట్ వెయిట్ అల్లాయ్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ పై వన్-పీస్ కాస్ట్ అల్యూమినియం స్వింగార్మ్‌తో నిర్మించారు.

భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ నైట్‌స్టర్ (Harley Davidson Nightster) మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్‌లో పూర్తి-ఎల్‌ఈడి లైటింగ్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని, ఏబిఎస్, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్ మరియు హిల్ హోల్డ్ కంట్రోల్‌ను నియంత్రించడానికి డేటాను అందించే ఐఎమ్‌యూ మరియు రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ ప్లస్ అనే ఐదు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. ప్రతి రైడింగ్ మోడ్ కూడా ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ కోసం ప్రత్యేకమైన సెట్టింగ్‌లతో వస్తుంది.

Most Read Articles

English summary
Harley davidson nightster launched in india price specs features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X