Hero Splendor Plus ఇప్పుడు మరింత బ్యూటిఫుల్‌గా.. ధర కూడా తక్కువే

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన 'స్ప్లెండర్ ప్లస్' (Splendor Plus) బైకును కొత్త కలర్ లో పరిచయం చేసింది. ఈ కొత్త కలర్ లో 'హీరో స్ప్లెండర్ ప్లస్' మునుపటికంటే కూడా చాలా ఆకర్షణీయంగా మారిపోయింది.

Recommended Video

భార‌త్‌లో విడుదలైన Hero Xpulse 4V Rally Edition | ధర & వివరాలు

కొత్త కలర్ లో విడుదలైన హీరో స్ప్లెండర్ ప్లస్ ధర, డిజైన్ మరియు ఇతర వివరాలను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

దేశీయ మార్కెట్లో ఇప్పుడు 'హీరో స్ప్లెండర్ ప్లస్' సిల్వర్ నెక్సస్ బ్లూ కలర్‌ అనే కొత్త కలర్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 72,978 (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త కలర్ ప్రవేశపెట్టడంతో 'స్ప్లెండర్ ప్లస్' ఇప్పుడు మొత్తం 6 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి బ్లాక్ విత్ పర్పుల్, గ్రే విత్ గ్రీన్, బ్లాక్ విత్ సిల్వర్, సిల్వర్ నెక్సస్ బ్లూ, మ్యాట్ షీల్డ్ గోల్డ్ మరియు స్పోర్ట్స్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

దేశీయ మార్కెట్లో 100 సిసి విభాగంలో అత్యధిక అమ్మకాలు పొందుతున్న బైకుల్లో 'హీరో స్ప్లెండర్ ప్లస్' ఒకటి. అయితే ఇప్పుడు ఈ కొత్త కలర్ ఆప్సన్ లో రావడం వల్ల మరింతమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంది. కావున అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్‌లో కలర్ ఆప్సన్ తప్పా మిగిలిన ఎటువంటి మార్పులు చేయలేదు, కావున ఇందులో అదే 97.2 సిసి, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంది. కావున ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ అద్భుతమైన సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టం పొందుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ యొక్క ముందుభాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక వైపు డ్యూయల్ స్ప్రింగ్ లోడ్ సస్పెన్షన్‌ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

డిజైన్ లో కూడా ఎటువంటి మార్పులు లేదు, కావున ఈ బైక్ లో హాలోజన్ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు ఇండికేటర్‌ మొదలైనవి మునుపటి మోడల్ లో మాదిరిగానే ఉన్నాయి. అంతే కాకూండా కొత్త మోడళ్లలో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు అందుబాటులో ఉంది.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

ఇదిలా ఉండగా, హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయటానికి సిద్ధమైంది. కావున కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని అక్టోబర్ 07 న మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనుంది. హీరో మోటోకార్ప్ విడులా చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు విడా (VIDA). ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కొంత సమాచారం కూడా వెల్లడించింది.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

హీరో ఎలక్ట్రిక్ యొక్క విడా స్కూటర్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది రూ. 1 లక్ష ధరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ స్కూటర్ చాలా స్లిమ్ డిజైన్‌తో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలైన తర్వాత, ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఓలా ఎస్1 మరియు ఏథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కావున దేశీయ మార్కెట్లో ఇది గట్టిపోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కొత్త క‌ల‌ర్‌తో మరింత బ్యూటిఫుల్‌గా మారిన Hero Splendor Plus

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఇప్పటివరకు మంచి అమ్మకాలతో ముందుకుసాగిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్ లో అన్హుబాటులోకి రావణ వల్ల మరిన్ని మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. అంతే కాకుండా హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మరియు బజాజ్ ప్లాటినా 100 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకులకు సంబంధించిన సమాచారం మాత్రమే కాకుండా ఆసక్తికరమైన విషయాలను క్లుప్తంగా తెలుసుకోవటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero splendor plus launched in new colour price and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X