మరింత ఎక్కువ రేంజ్ అందించే 'ఐవోమి ఎస్1' ఎలక్ట్రిక్ స్కూటర్లు: ధర రూ. 69,999 మాత్రమే

భారతీయ మార్కెట్లో 'ఐవోమి ఎనర్జీ' (iVOOMi Energy) ఇప్పటికే 'ఎస్1' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది, కాగా ఇప్పుడు ఇందులో మరో మూడు అప్డేటెడ్ మోడల్స్ విడుదల చేసింది.

దేశీయ విఫణిలో 'ఐవోమి ఎనర్జీ' విడుదల చేసిన కొత్త 'ఎస్1' ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రారంభ ధరలు రూ. 69,999 (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ మోడల్ ధర రూ. 1.12 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 240 కిమీ రేంజ్ అందించే ఐవోమి ఎలక్ట్రిక్ స్కూటర్

కొత్త ఐవోమి ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్స్ లో ఆందుబాటులో ఉంటుంది. అవి ఎస్1 80, ఎస్1 200 మరియు ఎస్1 240 వేరియంట్లు. ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 డిసెంబర్ 01 నుంచి కంపెనీ యొక్క అన్ని అధికారిక డీలర్షిప్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. కావున ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 240 కిలోమీటర్ల (ఎస్1 240 వేరియంట్) పరిధిని అందిస్తాయని కంపెనీ ధ్రువీకరించింది. కావున దీని కోసం ఇందులో 4.2 కిలోవాట్ ట్విన్ బ్యాటరీ ప్యాక్ మరియు 2.5 కిలోవాట్ల మోటార్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఎస్1 80 వేరియంట్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 80 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఎస్1 80 వేరియంట్ లో 1.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళుతుంది. కాగా ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు స్టాండర్డ్ గా మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటాయి. అవి ఎకో మోడ్, రైడర్ మోడ్ మరియు స్పోర్ట్ మోడ్స్. కంపెనీ యొక్క మునుపటి S1 మోడల్‌ కూడా రూ. 85,000 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది.

ఐవోమి ఎస్1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. అవి పీకాక్ బ్లూ, నైట్ మెరూన్ మరియు డస్కీ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో GPS ట్రాకర్ మరియు మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు కొత్త 'ఫైండ్ మై రైడ్' అనే లేటెస్ట్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

ఐవోమి ఎస్1 సిరీస్ స్కూటర్లు సింపుల్ డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. కావున ఇవి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి. అంతే కాకూండా ఇందులో హై ఎండ్ వేరియంట్ ఒక్క ఛార్జ్ తో 240 కిమీ రేంజ్ అందించడం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ ఆధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్ల కొనుగోలుపైన ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఐవోమి ఎనర్జీ దక్షిణ భారతదేశంలో తన ఉనికిని విస్తరించడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేస్తోంది. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తప్పకుండా కొత్త ఐవోమి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి అమ్మకాలు పొందుతాయని ఆశిస్తున్నాము. రానున్న రోజుల్లో కంపెనీ తన డీలర్షిప్లను కూడా మరింత విస్తరించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ivoomi s1 electric scooter new variants launched price and range details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X