మళ్ళీ రానున్న పూర్వ వైభవం.. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న 'కైనెటిక్​ లూనా'

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి కనుమరుగైన పూణే ఆధారిత కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) యొక్క 'కైనెటిక్​ లూనా మోపెడ్' మళ్ళీ దేశీయ మార్కెట్లో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. అయితే ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ లో రానున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఇప్పటికే తమ అడుగులను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొచ్చాయి. కాగా ఇప్పుడు కైనెటిక్ కంపెనీ తన లూనా మోపెడ్ ను ఎలక్ట్రిక్ వెర్షన్ లో తీసుకురావడానికి సిద్దమవుతోంది. ఈ ఈ కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్​ మోపెడ్​ను త్వరలోనే లాంచ్​ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న కైనెటిక్​ లూనా

కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ను కైనెటిక్​ గ్రీన్​ ఎనర్జీ అండ్​ పవర్​ సొల్యూషన్స్​ ద్వారా విక్రయించనున్నట్టు తెలిపింది. ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం మెయిన్​ ఛాసిస్​, మెయిన్​ స్టాండ్​, సైడ్​ స్టాండ్​, స్వింగ్​ ఆర్మ్​తో పాటు ఇతర పార్ట్స్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇప్పటికే మహారాష్ట్ర అహ్మద్​నగర్​లోని ఫ్యాక్టరీలో ఈ ఎలక్ట్రిక్​ మోపెడ్​ ప్రొడక్షన్​ జరుగుతున్నట్లు కూడా కంపెనీ స్పష్టం చేసింది.

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ యొక్క ఉత్పత్తిని రానున్న రోజుల్లో మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ నెలకు దాదాపు 5,000 యూనిట్ల వరకు మోపెడ్​లను తయారు చేయనున్నట్లు తెలిపింది. ఈ సామర్థ్యం కంపెనీ యొక్క మ్యాన్యుఫ్యాక్చరింగ్​ ఫెసిలిటీకి ఉందమని తెలిపింది. కావున ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ విడుదలైన తరువాత డెలివరీలు కూడా తప్పకుండా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది.

సులజ్జ ఫిరోడియా మోత్వాని నేతృత్వంలోని కైనెటిక్ గ్రీన్ 2021లో రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నెలవు కంపెనీ కైనెటిక్ జింగ్ హై స్పీడ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్). ఇది ఒక 60V, 28Ah లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

కంపెనీ రాబోయే తన కైనెటిక్​ లూనా ఎలక్ట్రిక్ మోపెడ్ కోసం అహ్మద్‌నగర్ ప్లాంట్‌లో 30 కి పైగా వెల్డింగ్ మెషీన్‌లను ఇతర పరికరాలను కలిగి ఉంది. ఇందులో పూర్తి ఫినిషింగ్ మరియు పెయింటింగ్ కార్యకలాపాలను కూడా చేపడుతుంది. పెయింట్ షాప్, ప్రెస్ మరియు ఫ్యాబ్రికేషన్ షాపులను అప్‌గ్రేడ్ చేయడానికి కంపెనీ రూ. 3 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు కూడా కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.

దాదాపు 50 సంవత్సరాల క్రితం, కైనెటిక్ ఇంజనీరింగ్ తన లూనా మోపెడ్ స్కూటర్ మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో ఈ మోపెడ్ ధర రూ.2,000. దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే ఈ మోపెడ్ బాగా ప్రజాదరణ పొందింది. అప్పట్లోనే ఈ మోపెడ్ రోజుకి 2,000 యూనిట్లు అమ్ముడైంది. మోపెడ్ విభాగంలో ఇది దాదాపు అప్పట్లో 95 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండేది. ఇది నిలిపివేయబడే సమయానికి 10 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయని అంచనా.

గతంలో కైనెటిక్​ లూనాకు విపరీతమైన డిమాండ్​ ఉండేది. ఎక్కడ చూసినా ఈ మోపెడ్స్ ఎక్కువగా కనిపించేవి, అయితే క్రమంగా వీటికున్న ఆదరణ క్రమంగా తగ్గడం వల్ల ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు ఈ మోపెడ్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో రావడానికి సిద్దమైపోతుంది. రానున్న మరో రెండు, మూడు సంవత్సరాల్లో తమ వార్షిక ఆదాయం రూ. 30 కోట్లు ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది.

Most Read Articles

English summary
Kinetic luna is coming back in ev avatar details
Story first published: Wednesday, December 28, 2022, 9:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X