దేశీయ మార్కెట్లో రూ. 63,000 ఖరీదైన సైకిల్ విడుదల: వివరాలు

భారతీయ మార్కెట్లో కార్లకు మరియు బైకులకు మాత్రమే కాదు సైకిల్స్ కి కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలు. అంతే కాకుండా ప్రజలు తమ ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. ఈ కారణంగా సైకిల్ మార్కెట్లో కూడా బాగా వృద్ధి చెందింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సైకిల్స్ తయారీ కంపెనీలన్నీ కూడా కొత్త కొత్త సైకిల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

దేశీయ మార్కెట్లో కొత్త సైకిల్ విడుదలైంది.. దీని ధర రూ. 63,000

ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో 'నైంటీ వన్ సైకిల్స్' (Ninety One Cycles) తన 'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' (KTM Chicago Disc 271) అనే సైకిల్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో కొత్త సైకిల్ విడుదలైంది.. దీని ధర రూ. 63,000

భారతీయ మార్కెట్లో నైంటీ వన్ సైకిల్స్ (Ninety One Cycles) విడుదల చేసిన కొత్త 'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' (KTM Chicago Disc 271) సైకిల్ ప్రారంభ ధర రూ.63,000. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా స్టైలిష్ గా కూడా ఉంది. అది మాత్రమే కాకుండా ఈ సైకిల్ ఏ రకమైన ట్రాక్‌లోనైనా నడపగల సామర్థ్యం కలిగి ఉన్న ఆల్-టెర్రైన్ సైకిల్ అని కంపెనీ స్పష్టం చేసింది.

దేశీయ మార్కెట్లో కొత్త సైకిల్ విడుదలైంది.. దీని ధర రూ. 63,000

కంపెనీ విడుదల చేసిన ఈ సైకిల్ కేవలం యువకులకు మాత్రమే కాకుండా వివిధ వయస్కులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా మూడు ఫ్రేమ్ సైజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో ఈ సైకిల్ అల్యూమినియం ఫ్రేమ్ తో తయారు చేయబడింది కావున బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సైకిల్ బరువు కేవళం 15 కేజీలు మాత్రమే.

దేశీయ మార్కెట్లో కొత్త సైకిల్ విడుదలైంది.. దీని ధర రూ. 63,000

మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ సైకిల్ అన్ని రకాల ట్రాక్‌లపైన నడపడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనికోసం కంపెనీ ఇందులో 27.5-ఇంచెస్ ఆల్-టెర్రైన్ టైర్‌లను ఉపయోగించింది. అంతే కాకూండా ఇందులో మెరుగైన బ్రేకింగ్ సిస్టం కోసం ముందు మరియు వెనుక చక్రాలపైన డిస్క్ బ్రేక్‌లు అమర్చబడి ఉన్నాయి.

దేశీయ మార్కెట్లో కొత్త సైకిల్ విడుదలైంది.. దీని ధర రూ. 63,000

'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' సైకిల్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు మౌంటెన్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండిల్‌బార్ ఇవ్వబడ్డాయి. కంపెనీ విడుదల చేసిన ఈ సైకిల్స్ కెటిఎమ్ యొక్క డీలర్షిప్ లలో లభ్యమవుతాయి. ఇది కెటిఎమ్ యొక్క అధీకృత సంస్థ.

దేశీయ మార్కెట్లో కొత్త సైకిల్ విడుదలైంది.. దీని ధర రూ. 63,000

'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' విడుదల సమయంలో నైంటీ వన్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ 'సచిన్ చోప్రా' మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో సైకిల్ మార్కెట్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక కాలంలో కూడా ఎక్కువమంది ప్రజలు తమ ఆరోగ్యమైన శ్రద్ద చూపడంలో భాగంగానే సైకిల్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున మార్కెట్లో ఈ కొత్త సైకిల్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకూండా ఈ సైకిల్ తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు.

Most Read Articles

English summary
Ktm chicago disc 271 cycle launched price features details
Story first published: Wednesday, April 27, 2022, 21:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X