విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కెటిఎమ్ (KTM) త్వరలో భారతదేశంలో విడుదల చేయబోయే తమ కొత్త 2022 కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC 390) బైక్ ధరను అధికారికంగా వెల్లడించింది. ఈ బైక్‌ను మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో దీని ధరను మరియు మోడల్‌ను లిస్ట్ చేసింది. వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, మార్కెట్లో కొత్త KTM RC 390 బైక్ ధర రూ.3,13,922 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనుంది. దీన్నిబట్టి చూస్తుంటే, కంపెనీ త్వరలోనే ఈ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

పాత మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త 2022 మోడల్ కెటిఎమ్ ఆర్‌సి 390 (KTM RC 390) లో కంపెనీ పలు మార్పులు చేర్పులు చేసింది. అయితే, ఈసారి ఇందులో కేవలం కాస్మెటిక్ మార్పులే కాకుండా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా చేయనుంది. సమాచారం ప్రకారం, కొత్త KTM RC 390 దాని ముందున్న దానితో పోలిస్తే తేలికపాటి ఛాసిస్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కొత్త KTM RC 390 యొక్క మెయిన్ ఫ్రేమ్‌లో ఎటువంటి మార్పులు లేకుండా, మెరుగైన ఆన్-రోడ్ డైనమిక్స్ కోసం కొత్త బోల్ట్-ఆన్ రియర్ సబ్‌ఫ్రేమ్‌ను ఉపయోగించనున్నారు.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

ఫ్రేమ్‌లో చేసిన ఈ మార్పుల కారణంగా, ఇది దాని మునుపటి మోడల్‌తో పోలిస్తే, దాదాపు 1.5 కిలోలు తేలికగా ఉంటుంది. పాత తరం బైక్‌తో పోలిస్తే ఇందులో చేసిన ఇతర మార్పులలో క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌లు ఉంటాయి, ఇవి ఇప్పుడు 15 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటాయి. ఈ మార్పు వలన ఇది రోజువారీ రైడింగ్‌కు సహాయపడుతుంది. ఎందుకంటే, ఇది బైక్‌ను మునుపటి కంటే మరింత సౌకర్యవంతమైన స్థానంలో నడపడానికి అనుమతిస్తుంది, అలాగే మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

అయితే, ఎవరైనా ఈ బైక్‌ను ట్రాక్ పై ఉపయోగించాలనుకుంటే, వారు ఈ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్‌లను 10 మి.మీ తగ్గించుకోవచ్చు. ఇక ఇందులో మరొక పెద్ద మార్పు దాని ఫ్యూయెల్ ట్యాంక్ రూపంలో ఉంటుంది. కొత్త 2022 మోడల్ కెటిఎమ్ ఆర్‌సి 390లోని ఇంధన ట్యాంక్ మునుపటి తరం బైక్ యొక్క ఇంధన ట్యాంక్ కన్నా 3.5 లీటర్లు పెద్దదిగా ఉంటుంది. పాత మోడల్‌లో 10-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉపయోగిస్తే, కొత్త మోడల్‌లో 13.5-లీటర్ల ఇంధన ట్యాంక్‌ను ఉపయోగించారు.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

కొత్త 2022 KTM RC 390 కూడా 40 శాతం పెద్ద ఎయిర్‌బాక్స్ మరియు రివైజ్డ్ ఇంజన్ మ్యాపింగ్‌ను కలిగి ఉంటుంది, అయితే ఇంజన్ యొక్క పవర్ మరియు టార్క్ అవుట్‌పుట్ మాత్రం అలానే ఉంటుంది. కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ లో ఫ్యూయల్-ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ 373 సిసి ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 43 బిహెచ్‌పి శక్తిని మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 37 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి ఉంటుంది.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

ఈ మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొత్త 2022 మోడల్ ఆర్‌సి 390లో కంపెనీ పలు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. ఇది దాని మునుపటి మోడల్ కన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బైక్ ముందు భాగంలో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో మునుపటి బైక్‌లోని వెర్టికల్ ట్విన్-పాడ్ హెడ్‌లైట్ స్థానంలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన పెద్ద సింగిల్ ఎల్ఈడి యూనిట్ ఉంటుంది. అలాగే, ఇందులోని టర్న్ ఇండికేటర్లు ఆర్‌సి390 బైక్ యొక్క ఫ్రంట్ ఫెయిరింగ్‌లో విలీనం చేయబడి ఉంటాయి.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

ఈ కొత్త బైక్‌లో మరొక కొత్త అంశం 390 డ్యూక్‌లో మొదటిసారి మనం చూసిన కొత్త టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్. ఈ డిస్‌ప్లే యూనిట్ యాంబియంట్ లైట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది, ఇది బయటి కాంతి పరిస్థితులపై ఆధారపడి డిస్‌ప్లే ప్రకాశాన్ని (బ్రైట్‌నెస్‌ను) స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. ఈ టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి, రైడర్ తన స్మార్ట్‌ఫోన్ బైక్‌తో సులువుగా అనుసంధానించుకోవచ్చు. ఇందులోని స్ప్లిట్ సీట్స్ ముందులానే ఉంటాయి, కానీ వాటి ఫినిషింగ్స్ మాత్రం భిన్నంగా ఉంటుంది.

విడుదలకు ముందే కెటిఎమ్ ఆర్‌సి 390 ధరల వెల్లడి.. ఈ స్పోర్ట్స్ బైక్ ధర ఎంతంటే..?

ఇక ఇందులోని 17 ఇంచ్ వీల్స్ పరిమాణం కూడా అలానే ఉంటుంది, కాకపోతే ఈ కొత్త చక్రాలు మాత్రం ఇప్పుడు కొత్త 5-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. బైక్ ముందు భాగంలో WP అపెక్స్ సస్పెన్షన్ సెటప్‌తో 120 మిమీ ట్రావెల్‌తో కూడిన తలక్రిందులుగా ఉండే ఫ్రంట్ ఫోర్క్‌లు మరియు వెనుకవైపు 150 మిమీ ట్రావెల్‌తో మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 158 మిమీగా ఉంటుంది మరియు రైడర్ సీటు ఎత్తు భూమి నుండి 824 మిమీగా ఉంటుంది. ఇది ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ మరియు ఎలక్ట్రిక్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ktm rc 390 price revealed in company official website
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X