దేశీయ మార్కెట్లో 5 చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు - ఇంతకంటే తక్కువ ధరకు వేరే స్కూటర్స్ రాదేమో..!!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో రోజురోజుకి ఏదో ఒక కొత్త వెహికల్ విడుదలవుతూనే ఉంది. ఎన్నెన్ని కొత్త వాహనాలు వచ్చినప్పటికీ చాలామంది తక్కువ ధర వద్ద లభించే వాహనాలనే కొనుగోలు చేస్తారు. అలాంటి వారికోసం తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మనం ఈ కథనంలో రూ. 45,000 వద్ద నుంచి రూ. 65,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య లభించే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో అవాన్ ఈ స్కూట్, బౌన్స్ ఇన్ఫినిటీ E1, హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్, అవాన్ ట్రెండ్ ఇ మరియు ఈవి అహవా వంటివి ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు అన్నీ కూడా రూ. 65,000 లోపు ఉండటం గమనార్హం.

దేశీయ మార్కెట్లో ఉన్న 5 చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు

అవాన్ ఇ స్కూటర్ (Avon E Scooter):

సరసమైన ధర వద్ద లభించే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో అవాన్ ఇ స్కూటర్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 45,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 215 వాట్ల BLDC మోటార్‌ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక ఛార్జ్ తో 65 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25కిమీ కాగా. బ్యాటరీ చరాజ్ కావడానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1:

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 45,099. బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి స్పోర్టీ రెడ్, పెర్ల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే మరియు డెసర్ట్ సిల్వర్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది.ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ (0% నుంచి 100%) చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త స్కూటర్ యొక్క గరిష్ట వేగం 65 కిమీ/గం వరకు ఉంటుంది.

హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ (Hero Electric Flash):

హీరో ఎలక్ట్రిక్ యొక్క ఫ్లాష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 46,640 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది ఒక పుల్ ఛార్జ్ తో గరిష్టంగా 85 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ వరకు ఉంటుంది.

అవాన్ ట్రెండ్ ఈ (Avan Trend E):

అవాన్ ట్రెండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన జాబితాలో సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 56,900 (ఎక్స్-షోరూమ్). ఇది సింగిల్ మరియు డబుల్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. సింగిల్ బ్యాటరీలో ఇది 60 కిమీ పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఇందులోని డబుల్ బ్యాటరీ 110 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ రెండు వేరియంట్స్ యొక్క గరిష్ట వేగం గంటకు 45 కిమీ వరకు ఉంటుంది.

ఈవి అహవా (EeVe Ahava):

ఈవి అహవా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.62,499 (ఎక్స్-షోరూమ్). మనం చెప్పుకుంటున్న జాబితాలో ఇది ఐదవ సరసమైన ఎలక్ట్రిక్ బైక్. ఇది కేవలం ఒకే వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఛార్జ్ మీద 60 కిమీ - 70 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6-7 గంటలు. ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ చాలా ఉంటాయి.

Most Read Articles

English summary
Most affordable five electric scooters in india telugu details
Story first published: Monday, December 5, 2022, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X