2022 ఇండియా బైక్ వీక్‌లో కనిపించిన లేటెస్ట్ బైకులు - వివరాలు

ఇటీవల ఎంతో అట్టహాసంగా జరిగిన ఇండియా బైక్ వీక్ 2022 లో కొన్ని ఆధునిక బైకులు దర్శనమిచ్చాయి. ఇందులో 822 హిమాలయ, కెటిఎమ్ 890 అడ్వెంచర్, బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ మరియు క్యూజె మోటార్స్ ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కెటిఎమ్ 890 అడ్వెంచర్:

2022 ఇండియా బైక్ వీక్‌లో కెటిఎమ్ కంపెనీ కొత్త 890 అడ్వెంచర్ బైక్ విడుదల చేసింది. ఇది కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. కావున ఇది చాలా మంచి అభిమానుల మనసు దోచుకుంటుంది. ఇందులో 889 సిసి ప్యారలల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 108 బిహెచ్‌పి పవర్, 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 100 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

2022 ఇండియా బైక్ వీక్‌లో కనిపించిన లేటెస్ట్ బైకులు

కెటిఎమ్ 890 అడ్వెంచర్ (KTM 890 Adventure) 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క ముందు భాగంలో డబ్ల్యూపీ యూఎస్‍డీ ఫోర్క్స్, వెనుక భాగంలో డబ్ల్యూపీ సోర్స్డ్ మోనోషాక్‍ సెటప్ వంటివి ఉంటాయి. ఈ బైక్ 2023 నాటికి భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

822 హిమాలయన్:

2022 ఇండియా బైక్ వీక్‌లో కనిపించిన మరో బైక్ ఈ '822 హిమాలయన్'. ఇది పూణే బేస్డ్ కస్టమ్ బైక్ బిల్డర్ ఆటో ఇంజిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి 822 సిసి ప్యారలల్ ట్విన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ను తీసుకువచ్చింది. ఈ బైక్ 44.5 హెచ్‌పి పవర్ మరియు 55 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. 822 హిమాలయన్ మోటార్‌సైకిల్ కస్టమ్-బిల్ట్ 2-టు-1 ఎగ్జాస్ట్, ఎగ్జాస్ట్ మరియు లోయర్ హాఫ్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది.

2022 ఇండియా బైక్ వీక్‌లో కనిపించిన లేటెస్ట్ బైకులు

నివేదికల ప్రకారం 822 హిమాలయన్ తయారు చేయడానికి రూ. 13 లక్షలు ఖర్చు అయినట్లు తెలిసింది. కాగా కంపెనీ ఈ ధరలను తగ్గించడానికి తగిన ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో ఇంజిన్ పెద్దదిగా ఉండటం వల్ల బైక్ బరువు 240 కేజీల వరకు ఉంది. ఈ బైక్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది. ఈ బైక్ చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా ఆధునిక డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది

బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్:

ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు మోటొరాడ్' (BMW Motorrad) ఇండియా బైక్ వీక్ 2022 లో కొత్త ఎస్ 1000 ఆర్ఆర్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరించింది. ఇండియా బైక్ వీక్ 2022 లో ఈ బైక్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ బైక్ 2022 డిసెంబర్ 10 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలకానున్నట్లు సమాచారం. ఈ బైక్ చాలా అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ 999 సిసి ఇన్‌లైన్, ఫోర్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఇది 13,750 ఆర్‌పిఎమ్ వద్ద 206.5 బిహెచ్‌పి పవర్ మరియు 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్ మరియు బైడైరెక్షనల్ క్విక్-షిఫ్టర్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగి ఉంటుంది. కావున పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

క్యూజె మోటార్స్:

క్యూజె మోటార్స్ ఇటీవల జరిగిన 2022 ఇండియా బైక్ వీక్‌లో మూడు కొత్త బైకులను ఆవిష్కరించింది. ఇందులో SRV300, SRC500 మరియు SRK400 ఉన్నాయి. ఇందులో SRC500 సింగిల్ సిలిండర్ క్లాసిక్ మోటార్‌ సైకిల్ అయితే SRK400 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్. ఈ బైకులు 2023 జనవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా వీటి ధరలు మొదలైన సమాచారం మొత్తం అప్పుడే అందుబాటులోకి వస్తుంది.

Most Read Articles

English summary
Motorcycle unveils at 2022 india bike week 822 himalayan ktm 890 adventure and more
Story first published: Wednesday, December 7, 2022, 10:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X