గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఎలక్ట్రిక్ స్కూటర్లను 2021 ఆగష్టు 15 న అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే, అయితే ఈ స్కూటర్లు అతి తక్కువ కాలంలోనే విపరీతమైన సంఖ్యలో బుకింగ్లను పొందగలిగింది. అయితే డెలివరీలోమాత్రం చాలా ఆలస్యం జరిగింది. కానీ ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు సజావుగా జరుగుతున్నాయి.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం, ఓలా కంపెనీ 2021 డిసెంబర్ నెలలో మొత్తం 111 యూనిట్ల స్కూటర్లను డెలివరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి కంపెనీ తగిన సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ప్రతిరోజూ 1,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉత్పత్తి అవుతున్నాయని కంపెనీ సీఈవో ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

అంతే కాకుండా కంపేనీ మళ్ళీ తన సేల్స్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత నెలలో కంపెనీ డెలివరీ చేసిన మొత్తం 111 యూనిట్లలో కర్ణాటకలో 60, తమిళనాడులో 25, మహారాష్ట్రలో 15 మరియు రాజస్థాన్‌లో 11 యూనిట్లు డెలివరీ చేసినట్లు తెలిసింది.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్‌లో జరుగుతున్న ఆలస్యం కారణంగా తక్కువ వాహనాలు డెలివరీ అయ్యాయని, అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని ఇటీవల కంపెనీ సీఈఓ తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీ చాలా వేగంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం దాదాపు 90,000 బుకింగ్‌లను పొందినట్లు తెలిపింది. అయితే 2021 డిసెంబర్ 15 నుండి డెలివరీ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే కొంతమంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను పొందారు. కానీ డెలివరీ పొందిన కొంతమంది కస్టమర్లు ఈ స్కూటర్ల నాణ్యత మరియు రేంజ్ వంటి విషయాలపైన అసంతృప్తి వ్యక్తం చేసారు.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఎలక్ట్రిక్ యొక్క S1 స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా, S1 ప్రో ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్). ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ సింపుల్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్ మరియు కాంటూర్డ్ సీట్లు ఉన్నాయి.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

అంతే కాకూండా ఇందులో అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌తో దాదాపు 6:30 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది.

గుడ్ న్యూస్.. Ola ప్రొడక్షన్ ఇక రోజుకి 1000 యూనిట్లు.. మరింత వేగవంతం కానున్న డెలివరీలు

ఓలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను అందించింది. Ola S1 పూర్తి ఛార్జ్‌పై 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల పరిధిని కలిగి ఉంది. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్ విషయానికి వస్తే, Ola S1 గరిష్టంగా 90 km/h వేగంతో, Ola S1 Pro గరిష్టంగా 115 km/h వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ola electric producing 1000 electric scooter everyday details
Story first published: Friday, January 7, 2022, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X