ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) గత సంవత్సరం సరిగ్గా భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో అధికారికంగా ఇడిదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 15 నాటికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత మార్కెట్లో విడుదలై ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా కంపెనీ తన 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) లో ఒక కొత్త కలర్ ఆప్సన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 ప్రో రానున్న ఆగష్టు 15 న కొత్త కలర్ ఆప్సన్ లో విడుదలవుతుందని కంపెనీ సీఈఓ 'భవిష్ అగర్వాల్' వెల్లడించారు. అదే సమయంలో దీనికి సంబంధించిన ఒక టీజర్ ఇమేజ్ కూడా విడుదల చేసాడు. గతంలో వెల్లడైన సమాచారం ప్రకారం కంపెనీ ఆగష్టు 15 న కొత్త ఎలక్ట్రిక్ మోడల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే వీటి స్థానంలో ఇప్పుడు కొత్త కలర్ ఓలా ఎస్1 ప్రో విడుదలకానుంది.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

భవిష్ అగర్వాల్ లా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త కలర్ కూడా ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కానీ టీజర్ గమనిస్తే రానున్న కొత్త కలర్ 'గ్రీన్' అయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ గత హొలీ పండుగ సమయంలో 'గెరువా' అనే కొత్త కలర్ లో విడుదల చేసింది.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

భవిష్ అగర్వాల్ దీని గురించి వెల్లడిస్తూ.. ఆగస్టు 15 న మేము తయారుచేసిన కొత్త కలర్ EV విడుదల చేయబోతున్నాము, దీనిని ఎవరైనా గెస్ (ఊహించగలరా) చేయగలరా? అని రాశారు. అంతే కాకుండా ఈ టీజర్ ఇమేజ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అడవుల్లో చూపించడం జరిగింది. కావున ఇది బహుశా ఇది గ్రీన్ కలర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నాయి.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

ఓలా ఎస్1 ప్రో ఇప్పటికే భారతీయ మార్కెట్లో 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు మరో కొత్త కలర్ లో అందుబాటులోకి రానుంది. ఇది కూడా తప్పకుండా వాహన కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఎస్1 ప్రో (S1 Pro) స్కూటర్ కోసం ఓటిఏ (ఓవర్ ది ఎయిర్) ద్వారా ఓ కొత్త అప్‌డేటెడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్) ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ప్రతిసారి ఓలా ఎస్1 ప్రో యొక్క రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చని కంపెనీ తెలిపింది. మూవ్ ఓఎస్ 2.0 (Move OS 2.0) పేరుతో కంపెనీ ఓలా ఎస్1 ప్రో పనితీరును మెరుగుపరిచి మరియు రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించే అనేక ఫీచర్లతో ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. కావున ఈ ఫీచర్ ద్వారాల ఇది మరింత ఎక్కువ పరిధిని అందిస్తుంది.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

2022 మే నెలలో ఓలా ఎలక్ట్రిక్ 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర రూ. 10,000 వరకు పెంచింది. ప్రస్తుతం ధరల పెరుగుదల తరువాత 'ఓలా ఎస్1 ప్రో' (Ola S1 Pro) ధర రూ. 1.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. అయితే దేశంలో అందుబాటులో ఉన్న ఫేమ్-2 స్కీమ్ కింద ధరలు ఆయా రాష్ట్రాన్ని బట్టి తగ్గుతాయి.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు 3.9 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతాయి. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 750W కెపాసిటీ గల పోర్టబుల్ ఛార్జర్‌తో ఓలా స్కూటర్ బ్యాటరీని దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో 75 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. Ola S1 పూర్తి ఛార్జింగ్‌తో 121 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 ప్రో 181 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

ఆగష్టు 15 న కొత్త కలర్‌లో విడుదల కానున్న 'ఓలా ఎస్1 ప్రో'.. ఆ కలర్ ఏదో మీరు ఊహించగలరా..?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. దీనికి ప్రధాన కారణం కంపెనీ విడుదల చేసే ఏ ఉత్పత్తి అయినా కస్టమర్లలో ఎంతో ఆసక్తిని పెంచుతుంది. కావున చాలామంది ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురు చూస్తారు. అయితే ఈ నెల 15 న కంపెనీ ఏ కలర్ లో తన ఎలక్ట్రిక్ స్కూటరు లాంచ్ చేస్తోందో అనే విషయం ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు, డీఐ గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం పొందటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Ola s1 pro to get new color option on 15th august details
Story first published: Monday, August 8, 2022, 11:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X