నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) గడచిన డిసెంబర్ 2021 విక్రయాల నివేదికను విడుదల చేసింది. డిసెంబర్ 2020 నెల అమ్మకాలతో పోల్చుకుంటే, గత నెలలో కంపెనీ అమ్మకాలలో పెద్దగా చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు. డిసెంబర్ 2021 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 65,187 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, డిసెంబర్ 2020 నెలలో మొత్తం 65,492 యూనిట్ల ద్విచక్ర వాహనాలు విక్రయించింది.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

అదే, నవంబర్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 44,133 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాల పనితీరు మెరుగ్గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో మొత్తం 8,552 యూనిట్ల ద్విచక్ర వాహనాలను బయటి దేశాలకు ఎగుమతి చేసింది. ఇవి డిసెంబర్ 2020 నెలలో ఎగుమతి చేసిన 3,503 యూనిట్లతో పోల్చుకుంటే 144.13 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

వార్షిక విక్రయాల పరంగా చూస్తే, ఏప్రిల్ నుండి డిసెంబర్ 2021 మధ్యకాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 3,60,898 యూనిట్లను విక్రయించింది. ఇవి ఏప్రిల్-డిసెంబర్ 2020 మధ్యకాలంలో విక్రయించిన 3,83,779 యూనిట్ల కన్నా దాదాపు ఆరు శాతం తక్కువగా నమోదయ్యాయి. మరోవైపు, ఇదే సమయంలో మోటార్‌సైకిల్ ఎగుమతులు 23,677 యూనిట్ల నుండి 55,695 యూనిట్లకు పెరిగి 135 శాతం వృద్ధిని కనబరిచాయి.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

గత సంవత్సరం రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కు చాలా ప్రత్యేకమైనది. గతేడాదిలో కంపెనీ తమ 120వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అలాగే, ఈ బ్రాండ్ అత్యంత పాపులర్ మరియు అత్యధికంగా అమ్ముడయ్యే క్లాసిక్ 350 మోడల్‌లో కంపెనీ ఓ కొత్త తరం 2021 మోడల్ (Next Generation Royal Enfield Classic 350) ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది కాకుండా, కంపెనీ గత నెలలో దాని 650 ట్విన్స్ అయిన కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టర్ 650 మోడళ్లలో కూడా కంపెనీ ప్రత్యేకమైన వార్షికోత్సవ ఎడిషన్‌లను పరిచయం చేసింది.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

ఇవన్నీ కూడా రికార్డ్ సమయంలోనే అమ్ముడయ్యాయి. ఇదిలా ఉంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఆగ్నేయాసియా ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ థాయ్‌లాండ్‌లో తన స్థానిక అసెంబ్లీ యూనిట్ మరియు సికెటి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) ఫెసిలిటీలను కూడా ప్రారంభించింది. అర్జెంటీనా మరియు కొలంబియా తర్వాత ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ కు ఇది మూడవ స్థానిక CKD ఫెసిలిటీ కావడం విశేషం.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

థాయ్‌లాండ్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రారంభించిన కొత్త స్థానిక అసెంబ్లీ యూనిట్ అక్కడి స్థానిక డిమాండ్‌ను తీర్చడమే కాకుండా ఇండోనేషియా, వియత్నాం మరియు ఆగ్నేయాసియా ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా పంపిణీ కేంద్రంగా (డిస్ట్రిబ్యూషన్ హబ్) గా కూడా పనిచేస్తుంది. ఇది మరింత అవకాశాలను పెంచుతుందని మరియు కంపెనీ విస్తరణకు దారితీస్తుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ ధీమాగా ఉంది.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలిసారిగా 2015లో థాయ్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. అప్పటి నుండి తాను ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) ప్రాంతంలో తాము గొప్ప పురోగతి సాధించామని కంపెనీ పేర్కొంది. థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు కొరియా వంటి మార్కెట్‌లలో ప్రీమియం, మధ్యతరహా మోటార్‌సైకిల్ విభాగంలో ఇప్పుడు టాప్ ఫైవ్ తయారీదారులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఒకటని కంపెనీ తెలిపింది.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన గ్లోబల్ ఫుట్‌ప్రింట్ ను మరింత విస్తరించుకునేందుకు ఆగ్నేయాసియా దేశాల్లో రిటైల్ నెట్‌వర్క్, సర్వీస్ మరియు డీలర్‌షిప్‌లను విస్తరించాలని కంపెనీ చూస్తోంది. రాబోయే రెండేళ్లలో నాలుగు కొత్త బైక్ మోడళ్లను ప్రవేశపెట్టాలని కూడా చూస్తోంది. వీటిలో కంపెనీ ఇప్పటికే కొత్త తరం క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 మోడళ్లను విడుదల చేయగా, మిగిలిన రెండు బైక్‌లను రాబోయే రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

గతేడాది ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ఎగ్జిబిషన్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిల్ ఎస్‌జి 650 (షాట్ గన్ 650) మోడల్ ని ఆవిష్కరించింది. ఈ కొత్త బైక్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, ఇది కాంటినెంటల్ జిటి 650 (Royal Enfield Continental GT 650) మరియు ఇంటర్‌సెప్టర్ 650 (Royal Enfield Interseptor 650) బైక్‌ల మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని సమాచారం.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 రీకాల్ (Recall)

ఇదిలా ఉంటే, ఇటీవలి నివేదికల ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కొత్త 2021 350 బైక్ ను రీకాల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త తరం మోడల్ లో గుర్తించిన లోబ్రేక్ లోపం కారణంగా సుమారు 26,300 యూనిట్ల 2021 మోడల్ క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లను కంపెనీ రీకాల్ చేసింది. ఈ లోపం వలన ఎలాంటి ప్రమాదాలు నమోదు కానప్పటికీ, ముందుజాగ్రత్తగా చర్యగా ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

నవంబర్ కన్నా డిసెంబర్ లోనే బెటర్.. కొత్త క్లాసిక్ 350 వలన పెరిగిన Royal Enfield సేల్స్!

రీకాల్ చేయబడిన క్లాసిక్ 350 మోటార్‌సైకిళ్లు అన్నీ కూడా సెప్టెంబర్ 01, 2021 నుంచి డిసెంబర్ 05, 2021 మధ్య కాలంలో తయారు చేయబడినవి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్‌లో ఉపయోగించే బైక్ యొక్క స్వింగ్ ఆర్మ్‌లోని రియాక్షన్ బ్రాకెట్‌లో ఒక భాగంలో లోపాన్ని తమ సాంకేతిక బృందం గుర్తించిన కారణంగా ఈ రీకాల్ ను ప్రకటించారు. ఈ లోపలం వలన రైడింగ్ పరిస్థితులలో వెనుక బ్రేక్ పై పడే అధిక బ్రేక్ లోడ్ రియాక్షన్, బ్రాకెట్ వైఫల్యానికి దారి తీస్తుంది ఫలితంగా ఇది బ్రేకింగ్ యొక్క శబ్దాన్ని ఎక్కువ చేస్తుందని వివరించబడింది.

Most Read Articles

English summary
Royal enfield december 2021 sales registerd at 65187 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X