హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) రెండు రోజుల క్రితమే తమ సరికొత్త స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350)ని దేశీయ విపమిలో విడుదదల చేసిన సంగతి తెలిసినదే. సిటీ / అర్బన్ కమ్యూటింగ్ కోసం అనువుగా స్పోర్టీ డిజైన్‌తో సరికొత్త హంటర్ 350 రూపొందించబడింది. అయితే, ఇది కేవలం సిటీ ప్రయాణాల కోసం మాత్రమే కాదని, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుందని ఓ హంటర్ 350 యజమాని నిరూపించాడు.

వివరాల్లోకి వెళితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 భారత మార్కెట్లో విడుదల చేసిన రోజునే డెలివరీ పొందిన ఓ యజమాని, వెంటనే తన బైక్ తో సాహస యాత్ర మొదలు పెట్టేశాడు. తన కొత్త బుల్లెట్ బండితో అతను ఏకంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మరియు అతి ఎత్తైన మోటార్‌వే లలో ఒకటైన ఖర్దుంగ్‌లా పాస్ చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. ఖర్దుంగ్‌లా పాస్ సముద్ర మట్టానికి 17,582 అడుగుల ఎత్తులో ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ పాస్ గా ప్రసిద్ధి చెందింది.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ ఖర్దుంగ్‌లా పాస్ చేరుకున్న చిత్రాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక ట్విటర్ పేజ్ లో కూడా పోస్ట్ చేశారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ పోస్ట్ లో "దీనిని (హంటర్ 350ని) ప్రారంభించిన ఒక వారంలోపే, ఇది సముద్ర మట్టానికి 17,582 అడుగుల ఎత్తులో గుర్తించబడింది. ఇది నిజంగా అద్భుతం!" అని పోస్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే, కొత్తగా వచ్చిన హంటర్ 350 కూడా ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే బలమైన నిర్మాణాన్ని కలిగి ఉందని మరియు ఇది దూర ప్రయాణాలకు ఏమాత్రం తీసిపోదని స్పష్టమవుతోంది.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

సాధారణంగా, ఖర్దుంగ్‌లా పాస్ చేరుకోవడానికి ఔత్సాహిక మోటారిస్టులు ఎక్కువగా క్లాసిక్ 350, మీటియోర్ 350 మరియు హిమాలయన్ వంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఎంచుకుంటుంటారు. ఎందుకంటే, ఈ మోడళ్లు ధృడమైన నిర్మాణాన్ని కలిగి ఉండి, ఎలాంటి రోడ్లనైనా సులువుగా అధిగమించేలా డిజైన్ చేయబడి ఉంటాయి. అయితే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ చిన్నపాటి దూర ప్రయాణాలను ఉద్దేశించి తయారు చేయబడిన సిటీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది. అయినప్పటికీ, ఇది ధృడమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉందని ఈ ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

భారత మార్కెట్లో కొత్తగా ప్రారంభించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ భారీ సంఖ్యలో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ బైక్ ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు కూడా క్యూ కడుతున్నారు. ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ల మాదిరిగా కాకుండా, హంటర్ 350 ని కంపెనీ ఓ గ్లోబల్ మోడల్ గా పరిచయం చేసింది. అందుకే, కంపెనీ ఈ కొత్త మోటార్‌సైకిల్ ను థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరంలో గ్లోబల్ లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ జర్నలిస్టులు హాజరయ్యారు.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 స్క్రాంబ్లర్ బైక్ ను కంపెనీ మొత్తం 3 వేరియంట్‌లలో విడుదల చేసింది. వీటిలో రెట్రో, మెట్రో మరియు మెట్రో రెబెల్ అనే వేరియంట్లు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ యొక్క బేస్ వేరియంట్ 'రెట్రో' ఫ్యాక్టరీ బ్లాక్ మరియు ఫ్యాక్టరీ సిల్వర్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ వేరియంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ యొక్క ఇతర వేరియంట్‌లతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

హంటర్ 350 రెట్రో బేస్ వేరియంట్ ధరను తగ్గించి, కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఇందులో బేసిక్ ఫీచర్లను మాత్రమే అందించింది. వీటిలో ట్యూబ్ తో కూడిన టైర్‌లు, స్పోక్డ్ వీల్స్, సింగిల్-ఛానల్ ఏబిఎస్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు, హాలోజన్ టెయిల్ ల్యాంప్ మరియు బేసిక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి సాధారణ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, హంటర్ 350 రెట్రో వేరియంట్‌లో ముందు మరియు వెనుక వైపు సన్నగా ఉండే టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లు ముందు వైపు 100/80 R17 మరియు వెనుక వైపు 120/80 R17 ప్రొఫైల్ ను కలిగి ఉంటాయి. ఈ బేస్ వేరియంట్లో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కనిపించే ఆధునిక స్విచ్‌గేర్ కూడా లేదు.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 'మెట్రో' మరియు 'మెట్రో రెబెల్' వేరియంట్‌ల విషయానికి వస్తే, ఇవి రెట్రో వేరియంట్ కన్నా ఎక్కువ ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంటాయి. అయితే, ఈ ప్రీమియం ఫీచర్లకు తగినట్లుగానే వాటి ధరలు కూడా కాస్తంత అధికంగానే ఉంటాయి. యువ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రవేశపెట్టబడిన ఈ ప్రీమియం వేరియంట్లలో బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, 270 మిమీ రియర్ డిస్క్ బ్రేక్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ప్రీమియం-లుకింగ్ రౌండ్ టర్న్ ఇండికేటర్స్, ప్రీమియం స్విచ్ గేర్ మరియు డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఈ వేరియంట్లలో లభిస్తాయి.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

ఈ అప్‌గ్రేడ్‌లతో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో మరియు మెట్రో రెబెల్ వేరియంట్‌లలో మందు వైపు 110/70 R17 మరియు వెనుక వైపు 140/70 R17 ప్రొఫైల్ తో కూడిన వెడల్పాటి టైర్లు కూడా లభిస్తాయి. ఈ టైర్లు చాలా స్పోర్టివ్‌గా కనిపించడమే కాకుండా, మెరుగైన రోడ్ గ్రిప్‌ను కూడా అందిస్తాయి. ఈ ప్రీమియం ఫీచర్లతో కూడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో వేరియంట్ ధర రూ. 1.63 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా), కాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో రెబెల్ వేరియంట్ ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. కాగా, బేస్ రెట్రో వేరియంట్ ధర కేవలం రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా మాత్రమే ఉంటుంది.

హంటర్ 350 కేవలం సిటీ రోడ్లపైనే కాదు, కఠినమైన హిమాలయన్ రోడ్లపై కూడా పరుగులు తీస్తుంది..

హంటర్ 350 రెట్రో, మెట్రో మరియు మెట్రోల్ మూడు వేరియంట్ల కుడా ఫీచర్లు మరియు కలర్ ఆప్షన్ల పరంగా భిన్నంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి. వీటిలోని 349.34 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 19.94 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 మోడళ్లలో కూడా ఇదే ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు.

ఫొటో మూలం

Most Read Articles

English summary
Royal enfield hunter 350 is not only a city commuter it can reach khardung la pass with ease
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X