నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటార్‌సైకిళ్లలో సరికొత్త స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ హంటర్ 350 (Hunter 350) కూడా ఒకటి. ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) మోటార్‌సైకిల్ ని కంపెనీ ఆగస్టు 7, 2022వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే, ఈ బైక్‌ ను అధికారింగా మార్కెట్లో విడుదల చేయడానికి ముందే రాయల్ ఎన్‌ఫీల్డ్ బాస్ సిద్ధార్థ్ లాల్ హంటర్ 350 ని ప్రజలకు చూపించేశాడు.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ మరియు ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ లాల్ (Siddhartha Lal) కొత్త హంటర్ 350 కోసం ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో ఈ బైక్ ని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఆయన చేసిన పోస్ట్ లో "నిజానికి నేను దీన్ని మీకు చూపించకూడదు, కానీ నేనే బాస్ మ్యాన్‌ని కాబట్టి ఈ అందమైన, సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350ని ప్రదర్శిస్తున్నాను" అని పోస్ట్ చేశారు.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

అంతేకాకుండా, ఈ వీడియోలో సిద్ధార్థ్ లాల్ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ ఇంజన్ శబ్ధాన్ని మరియు ఎగ్జాస్ట్ నోట్ (సైలెన్సర్ శబ్ధాన్ని) కూడా వినిపించేలా యాక్సిలరేటర్ రైజ్ చేసి చూపిస్తారు. ఈ వీడియోలో కొత్త హంటర్ 350 యొక్క డిజైన్ మరియు ఇతర ఫీచర్లు కూడా వెల్లడి చేయబడ్డాయి. మీటియోర్ 350లో కనిపించిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్విచ్‌గేర్, డ్యూయెల్ పాడ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, సింగిల్ పీస్ సీట్, వెనుక వైపు స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటి అనేక విషయాలు కూడా ఈ వీడియో ద్వారా వెల్లడయ్యాయి.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ హంటర్ 350 బైక్ కు సంబంధించిన మొదటి టీజర్ ను ఆగస్ట్ 4వ తేదీన విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను ఆగస్ట్ 7న అధికారికంగా ప్రజల ముందుకు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో, కొత్త హంటర్ 350 కోసం హైప్ ను మరింత పెంచడానికి సిద్ధార్థ్ ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వీడియోని ముందుగానే లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 గతంలో కంపెనీ విడుదల చేసిన కాంటినెంటల్ జిటి 650 లేదా కొత్త హియాలన్ స్క్రామ్ 411 మాదిరిగానే డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ తో డిజైన్ చేయబడి ఉంది.

ఈ కొత్త బైక్‌ను విడుదల చేయడానికి కొన్ని రోజుల ముందు బ్యాంకాక్‌లో జర్నలిస్టులతో జరిగిన ఓ సమావేశంలో సిద్ధార్థ లాల్, "హంటర్ 350 మోటార్‌సైకిల్ ను 2016 నుండి అభివృద్ధి చేస్తున్నామని, డెవలప్‌మెంట్ టీమ్ దీనిని మొత్తంగా ప్రదర్శించడానికి ఛాసిస్‌ను చక్కగా తీర్చిదిద్దిందని, కంపెనీ ఇంజనీర్లు హంటర్ 350కి ఖచ్చితమైన డిజైన్‌ను అందించడానికి ఛాసిస్‌ని ట్యూనింగ్ చేయడంపై చాలా శ్రద్ధ చూపారని" తెలిపారు. ఈ బైక్ చాలా చురుకైనదని, నడపడానికి సరదాగా ఉంటుందని మరియు కస్టమర్లు ఈ బైక్‌ను ఎంతగానో ఆదరిస్తారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

కొత్త హంటర్ 350 మోటార్‌సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఇతర 350సీసీ మోటార్‌సైకిళ్లను తయారు చేసిన పాపులర్ J-సిరీస్ ప్లాట్‌ఫామ్ పై తయారు చేసినట్లు సమాచారం. ఇంజన్ కూడా క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 వంటి మోడళ్లలో ఉపయోగించిన అదే ఇంజన్‌ను కొత్త హంటర్ 350లో కూడా ఉపయోగించనున్నారు. అయితే, ఈ ఇంజన్ ను హంటర్ 350 క్యారెక్టర్ కు తగినట్లుగా ట్యూన్ చేసే అవకాశం ఉంది. హంటర్ 350 తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు మరియు సరసమైన ధరకే ఈ బైక్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

సిద్ధార్థ్ లాల్ లీక్ చేసిన హంటర్ 350 వీడియోలో ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ఫ్యూయెల్ ట్యాంక్ పై డ్యూయెల్ షేడ్ మినహా, మిగిలిన మోటార్‌సైకిల్ మొత్తంగా పూర్తిగా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంది. ప్రస్తుతం ఉన్న ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల మాదిరిగా కాకుండా, కంపెనీ ఇందులో ఎక్కువగా క్రోమ్‌ను ఉపయోగించలేదు. హంటర్ 350 ఒక ఆఫ్‌సెట్ సర్క్యులర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది, కుడివైపున చిన్న ట్రిప్పర్ నావిగేషన్ పాడ్‌ కూడా ఉంది. బహుశా ఇది హంటర్ 350 టాప్-ఎండ్ వేరియంట్‌లలో అందించబడే అవకాశం ఉంది.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

హంటర్ 350 మోటార్‌లో ముందు వైపు క్లాసిక్ లుక్‌నిచ్చే గుండ్రటి హెడ్‌ల్యాంప్ మరియు దానికి ఇరువైపులా గుండ్రటి టర్న్ ఇండికేటర్లు అలాగే వెనుక భాగంలో గుండ్రటి టెయిల్ ల్యాంప్ మరియు దానికి ఇరువైపులా గండ్రటి రియర్ టర్న్ ఇండికేటర్లు ఉన్నాయి. హంటర్ 350 లో టియర్‌డ్రాప్-ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌ మరియు దాని మధ్యలో ధీర్ఘచతురస్రాకారంలో ఉండే ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్‌కు ఒకవైపు 'రాయల్' అని, మరోవైపు 'ఎన్‌ఫీల్డ్' అని పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయబడి ఉంటుంది. ఓవరాల్ గా దీని ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ మంచి యూత్‌ఫుల్ అప్పీల్‌ను అందిస్తుంది.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

సిద్ధార్థ్ లాల్ చూపిన వీడియోలోని హంటర్ 350 టాప్ స్పెక్ వేరియంట్ గా తెలుస్తోంది. ఇది బ్లాక్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంది. ఆన్‌లైన్ లో లీకైన సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ హంటర్ 350 మోటార్‌సైకిల్ ను రెండు వేరియంట్‌లలో విడుదల చేయవచ్చు. అంతేకాకుండా, ఈ కొత్త మోటార్‌సైకిల్ కు సంబంధించి లీకైన స్పెసిఫికేషన్‌ల ప్రకారం, హంటర్ 350 బైక్ కేవలం 2,055 మిమీ పొడవు, 800 మిమీ వెడల్పు మరియు 1,055 మిమీ ఎత్తును మాత్రమే కలిగి ఉండి, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో కెల్లా పరిమాణంలో అతి చిన్నదిగా ఉంటుందని తెలుస్తోంది.

నేను ఇది మీకు చూపించకూడదు.. కానీ నేనే బాస్ కాబట్టి చూపించేస్తున్నా.. హంటర్ 350ని వెల్లడించిన సిడ్ లాల్

ఆన్‌లైన్ లో లీకైన పత్రాల ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ లో 349.34 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6100 ఆర్‌పిఎమ్ వద్ద 19.94 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత తేలికైన మరియు అతి చురుకైన మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఈ విభాగంలో హోండా సిబి350 ఆర్ఎస్, జావా ఫోర్టీ టూ మరియు కొత్తగా వచ్చిన టీవీఎస్ రోనిన్‌ వంటి మోటార్‌సైకిళ్లతో పోటీపడుతుంది. మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal enfield md siddhartha lal reveals hunter 350 before official launch
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X