'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్‌గా మారనుందా..!!

ఇటలీలో జరిగిన EICMA 2022 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త 'సూపర్ మీటియోర్ 650' బైక్ పరిచయం చేసింది. ఈ కొత్త సూపర్ మీటియోర్ 650 మంచి డిజైన్, మంచి కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది, కాగా ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్ల కోసం మరియు మీటియోర్ 650 బైకును మరింత అందంగా తీర్చి దిద్దుకోవడానికి యాక్సెసరీలను కూడా అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త 'సూపర్ మీటియోర్ 650' బైక్ కోసం రెండు యాక్సెసరీ ఫ్యాక్స్ అందిస్తోంది. అవి సోలో టూరర్ మరియు గ్రాండ్ టూరర్.

సోలో టూరర్:

సోలో టూరర్ యాక్సెసరీ ఫ్యాక్స్ పెరుగు తగినట్లుగానే సోలో రైడర్స్ కోసం అందించే ప్యాకేజ్. కావున ఇది సింగిల్ సీటు కలిగి ఉంటుంది. అదే సమయంలో రియర్ ఫెండర్‌పై లగేజ్ రాక్‌ను పొందుతుంది. వీటితో పాటు ఇందులో బార్ ఎండ్ మిర్రర్స్, డీలక్స్ ఫుట్ పెగ్‌లు (విశాలమైన ఫుట్‌పెగ్‌లు), మెషిన్డ్ వీల్స్ మరియు ఎల్ఈడీ ఇండికేటర్స్ ఉన్నాయి.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

గ్రాండ్ టూరర్:

ఇక గ్రాండ్ టూరర్ విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ క్రూయిజర్ బైకుని గుర్తుకు తెస్తుంది. ఇది ప్రత్యేకంగా సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి నిర్దేశించింది. దీనికి తగినట్లుగానే కంపెనీ ఈ యాక్సెసరీ ఫ్యాక్ లో రైడర్ మరియు పిలియన్ కి తగిన సీటు మరియు పొడవాటి విండ్‌షీల్డ్ డిఫ్లెక్టర్‌ ఉంటుంది.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

అదే సమయంలో పిలియన్ రైడర్ కి బ్యాక్‌రెస్ట్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా.. టూరింగ్ హ్యాండిల్‌బార్, టూరింగ్ విండ్‌స్క్రీన్, డీలక్స్ ఫుట్ పెగ్‌లు, ఎల్‌ఈడీ ఇండికేటర్స్ మరియు లగేజ్ క్యారియర్లు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ లాంగ్ రైడింగ్ లో రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

ఇక కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 విషయానికి వస్తే, ఇది 648 సిసి ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 47 హెచ్‌పి పవర్ మరియు 5650 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. కావున మీటియోర్ 650 ఇంటర్‌సెప్టర్ మరియు కాంటినెంటల్ GT 650 మాదిరిగా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

కొత్త సూపర్ మీటియోర్ 650 యొక్క టాప్ వేరియంట్ పిలియన్ బ్యాక్‌రెస్ట్ మరియు పెద్ద విండ్‌స్క్రీన్ కూడా పొందుతుంది. ఇక ఈ కొత్త బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 2,260 మిమీ పొడవు, 890 మిమీ వెడల్పు, 1,155 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క వీల్‌బేస్ 1,500 మిమీ వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క బరువు 241 కేజీల వరకు ఉంటుంది.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 చాలా క్లాసికల్ క్రూయిజర్ డిజైన్‌ను కలిగి ఉంది. అందులో చుట్టూ LED లైటింగ్స్ పొందుతుంది. కావున ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, వెడల్పాటి హ్యాండిల్‌బార్లు, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, తక్కువ హైట్ కలిగిన సీటు మొదలైనవి ఉన్నాయి. ఈ కొత్త బైకు యొక్క సీటు ఎత్తు 740 మిమీ వరకు ఉంటుంది. సీటు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల పొట్టిగా ఉన్న రైడర్లు కూడా ఈ బైకును సులభంగా రైడింగ్ చేయవచ్చు.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైక్ 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ మరియు 16 ఇంచెస్ రియర్ వీల్ పొందుతుంది. సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సిస్టం రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 300 మిమీ డిస్క్ తో డ్యూయల్-ఛానల్ ABS పొందుతుంది.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

కొత్త సూపర్ మీటియోర్ 650 బైకుని కంపెనీ 2022 నవంబర్ చివరి నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ బైక్ యొక్క ధరల గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ ఈ బైక్ రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

'రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650' ఈ యాక్ససరీస్‌తో మరింత సూపర్ గా మారనుందా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తన సూపర్ మీటియోర్ 650 బైకుని దేశీయ మార్కెట్లో త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ లాంచ్ సమయంలో ధరలు మరియు బుకింగ్స్ వంటి వాటిని గురించి వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే దేశీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త బైక్ గురించి ఎప్పటిపైకప్పుడు అప్డేటెడ్ సమాచారం పొందటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal enfield super meteor 650 accessory list details
Story first published: Wednesday, November 9, 2022, 17:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X