రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) దేశీయ విపణిలో ఓ తిరుగులేని టూవీలర్ బ్రాండ్ గా అవతరించేందుకు ప్రయత్నిస్తోంది. గతంతో పోల్చుకుంటే, ఈ బ్రాండ్ అమ్మకాలు అనేక రెట్లు పెరిగాయి. ఇటీవలి కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన దాదాపు అన్ని మోటార్‌సైకిళ్లు కూడా అత్యంత విజయవంతమైన మోడళ్లుగా నిలిచాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కేవలం క్లాసిక్ లుకింగ్ బుల్లెట్ టైప్ టూవీలర్లను మాత్రమే కాకుండా, నేటి యువతకు నచ్చినట్లుగా అన్ని విభాగాలలో ఉత్పత్తులను అందించాలని నిర్ణయించుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి క్రూయిజర్ బైక్ అంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేవి థండర్‌బర్డ్ 350 (Royal Enfield Thunderbird 350) మరియు థండర్‌బర్డ్ 500 (Royal Enfield Thunderbird 500) మోటార్‌సైకిళ్లు. అయితే, ఇప్పుడు డిస్‌కంటిన్యూ చేయబడ్డాయి, వాటి స్థానంలో కంపెనీ మీటియోర్ 350 బైక్ ని పరిచయం చేసింది. ప్రస్తుతం, ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న ఏకైక క్రూయిజర్ బైక్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350)మాత్రమే. అయితే, చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ పెద్ద మరియు శక్తివంతమైన థండర్‌బర్డ్ 500 మోడల్‌ను చాలానే మిస్ అవుతున్నారని చెప్పాలి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పుడు సూపర్ మీటియోర్ 650 ని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ప్లాన్ చేయడమేంటి, ఈ మోడల్ దాదాపు విడుదలకు సిద్ధంగా కూడా ఉంది. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 (Royal Enfield Super Meteor 650) ను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఈ మోటార్‌సైకిల్‌ను టెస్టింగ్ చేయడాన్ని చూస్తుంటే, ఈ కొత్త క్రూయిజర్ బైక్ త్వరలోనే మార్కెట్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

సూపర్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, ఈ మోటార్‌సైకిల్ అద్భుతమైన మైల్-ముంచింగ్ (అధిక మైళ్లు ప్రయాణించే) సామర్ధ్యంతో మంచి సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్ ను కలిగి ఉండే రిలాక్స్డ్ టూరింగ్ మోటార్‌సైకిల్‌గా ఉంటుందని భావిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 650 ట్విన్స్ (ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650) లో ఉపయోగిస్తున్న ఇంజన్‌ను ఈ కొత్త సూపర్ మీటియోర్ 650 లో ఉపయోగించనున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

వాస్తవానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ఇప్పటికే ఓ అత్యుత్తమ టూరింగ్ మోటార్‌సైకిల్‌గా ఉన్నప్పటికీ, ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మాదిరిగా ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యాన్ని అందించదనే చెప్పాలి. అలాగని, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోటార్‌సైకిల్‌లో సునాయాసంగా ప్రయాణించడానికి అవసరమైన శక్తి మరియు టార్క్ కూడా లేదనే చెప్పాలి. కాబట్టి, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త సూపర్ మీటియోర్ 650ని అత్యుత్త లాంగ్ రైడ్ క్రూయిజర్ బైక్ గా తీర్చిదిద్దనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోటార్‌సైకిళ్లు రెండింటినీ కలగలపి కంపెనీ ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 ని ఓ పరిపూర్ణమైన టూరింగ్ మోటార్‌సైకిల్‌ గా తయారు చేస్తుందని భావిస్తున్నారు. ఇది మార్కెట్లో విడుదలైనప్పుడు, కంపెనీ దీనిని ఇంటర్‌సెప్టర్ 650 కి ఎగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి, సూపర్ మీటియోర్ 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ గా నిలుస్తుంది మరియు కంపెనీ ప్రోడక్ట్ లైనప్ లో అత్యంత ఖరీదైన బైక్ గా ఉంటుందని అంచనా.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ స్పై చిత్రాలను గమనిస్తే, ఇందులో ముందు వైపు తలక్రిందులుగా ఉన్న అప్-సైడ్-డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపు వెడల్పుగా పెద్ద టైర్‌, స్ప్లిట్ సీట్, తక్కువ సీట్ ఎత్తు, గుండ్రటి టెయిల్ ల్యాంప్ మరియు టర్న్ ఇండికేటర్స్, బైక్ కి ఇరువైపులా రెండు సైలెన్సర్లు మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే, క్రూయిజర్ బైక్ కి ఎంతో అవసరమైన పిలియన్ రైడర్ బ్యాక్ రెస్ట్ ఇందులో మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ లో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మరియు ట్రిప్పర్ నావిగేషన్ మాడ్యూల్ వంటి ఫీచర్లు ప్రామాణిక ఫీచర్లుగా ఉంటాయని ఆశిస్తున్నారు. ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్లలో ఉపయోగిస్తున్న అదే 650సిసి, పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఈ కొత్త సూపర్ మీటియోర్ 650లో కూడా ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 7,100 ఆర్‌పిఎమ్ వద్ద 47 బిహెచ్‌పి శక్తిని మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తోంది.. థండర్‌బర్డ్ తర్వాత ఇదే పెద్ద క్రూయిజర్ బైక్ అవుతుందా?

క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్‌గా వస్తున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 మంచి రోడ్ ప్రజెన్స్ ని కలిగి ఉండి, వినియోగదారుల ఎంపిక కోసం పూర్తి క్రోమ్‌ లేదా బ్లాక్-అవుట్ థీమ్‌లలో లభించే అవకాశం ఉంది. ఇది దూర ప్రయాణాలను ఉద్దేశించి తయారు చేయబడిన క్రూయిజర్ మోటార్‌సైకిల్ కావడం వల్ల కంపెనీ ఇందులో 15 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసినప్పుడు దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ. 3.00 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా.

Source

Most Read Articles

English summary
Royal enfield super meteor spotted170327
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X