భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. కావున చాలా కంపెనీలు భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) దేశీయ మార్కెట్లో 2021 ఆగష్టు నెలలో తన సింపుల్ వన్ (Simple One) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. విడుదలైనప్పటినుంచి కూడా ఇది మంచి బుకింగ్స్ పొందుతోంది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ ఎనర్జీ గత 2 నెలల నుండి ప్రతిరోజూ 55 శాతం కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందుతోందని కంపెనీ సీఈఓ అధికారికంగా తెలిపారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన మొదటి 5 రోజుల్లోనే 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందింది, కానీ ఇప్పుడు ఈ బుకింగ్ మరింత మెరుగ్గా మారిందని కంపెనీ సీఈవో సుహాస్ రాజ్ కుమార్ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

కంపెనీ సీఈవో సుహాస్ రాజ్ దీని గురించి ట్వీట్ చేస్తూ, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో చాలా వేగంగా ముందుకు వెళుతోంది. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారి సంఖ్య పెరగటమే. ఈ నేపథ్యంలో గత రెండు నెలల్లో మా రోజువారీ బుకింగ్‌లు 55% మెరుగుపడ్డాయన్నారు.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి ముందస్తుగా రూ.1947 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ ధర దేశీయ మార్కెట్లో స్కూటర్ రూ. 1.09 లక్షలు. ప్రస్తుతం 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో డెలివరీ కోసం డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ కృషి చేస్తోంది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ ఎనర్జీ అందిస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో 236 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఛార్జర్ సింపుల్ లూప్ సహాయంతో, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 60 సెకన్లలోనే 2.5 కిమీ పరిధికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీని నేరుగా 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 2.75 గంటల సమయం పడుతుందని, అయితే ఇందులోని తొలగించగల బ్యాటరీని విడిగా తీసి ఛార్జ్ చేయడానికి అదనంగా మరో 75 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంలో, రెండు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి మొత్తంగా 4 గంటల సమయం పడుతుంది. ఇది ఇంటి వద్ద ఇండే ఏసి చార్జర్ సాయంతో చార్జ్ చేస్తే దాదాపు 2.75 గంటల్లో సుమారు 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ ఎనర్జీ రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇది వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని బూడిద రంగు బ్యాటరీ ప్యాక్ 6 కిలోల కంటే ఎక్కువ బరువును కలిగి టుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ప్రత్యేకంగా భారతీయ ఉపయోగం కోసం రూపొందించబడింది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధానంగా లభించే ఫీచర్లు మరియు టెక్నాలజీలను గమనిస్తే, ఇందులో.. 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్ డిస్‌ప్లే, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, 4G LTE, ఓటిఏ అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జర్ గుర్తింపు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, కాల్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్, వెహికల్ ట్రాకిం0గ్, డాక్యుమంట్ స్టోరేజ్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్, ముందు మరియు వెనుక 90 మిమీ డ్రమ్ బ్రేక్‌లు, 12 ఇంచ్ టైర్లు, 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు 110 కిలోల బరువు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2022 జూన్ నుండి ప్రారంభం కానున్నాయి. ఇది తమిళనాడులోని హోసూర్‌లోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడింది. దీని ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు. కంపెనీ రెండవ ప్లాంట్, సింపుల్ ఎనర్జీ EVని కూడా ప్రారంభించబోతోంది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

సింపుల్ ఎనర్జీ రాష్ట్రంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని నిర్మించడానికి రూ. 2500 కోట్ల వరకు పెట్టుబడి కోసం తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఫేజ్ 1లో భాగంగా శూలగిరి (హోసూరు) సమీపంలో మొదటి 2 లక్షల చదరపు అడుగుల ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో ఈ కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్ నిర్మించబడుతుంది.

భారత్‌లో దూసుకెళ్తున్న Simple Energy బుకింగ్స్: కంపెనీ CEO

ఏది ఏమైనా సింపుల్ ఎనర్జీ యొక్క సింపుల్ వన్ స్కూటర్ విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. అయితే డెలివర్లు మాత్రమే జరగవలసి ఉంది. కంపెనీ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసేపనిలో నిమగ్నమై ఉంది. కావున డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

Most Read Articles

English summary
Simple energy gets 55 percent more booking says ceo suhas rajkumar details
Story first published: Thursday, January 27, 2022, 14:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X