జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సింపుల్ ఎనర్జీ (Simple Energy) గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ (Simple One) డెలివరీలను జూన్ 2022 నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆగస్ట్ 15, 2021వ తేదీ మార్కెట్లో విడుదలైన ఈ స్కూటర్ కోసం కేవలం రూ. 1947 లకే బుకింగ్ లను ప్రారంభించింది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ తమిళనాడులోని హోసూర్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తయారు చేస్తోంది.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 10 లక్షల యూనిట్లు. కంపెనీ తమ ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం భవిష్యత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని రెండవ ప్లాంట్‌ను కూడా ప్రారంభించబోతోంది. ప్రస్తుతం, ఈ స్కూటర్‌ను రూ. 1,09,999 ధరతో (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ఈ ఏడాది జూన్ నుండి ప్రారంభించబడుతుందని మరియు అనేక నగరాలలో వీటి డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయని కంపెనీ సిఇఒ సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

సింపుల్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ టూవీలర్ విషయంలో ఒకేసారి భారీ ఉత్పత్తికి తొందరపడకూడదని నిర్ణయించుకుంది మరియు ఈ స్కూటర్‌ను మరింత మెరుగుపరిచే పనిలో బిజీగా ఉంది. ఈ స్కూటర్ లో చేయబోయే అప్‌డేట్ ల గురించి కంపెనీ త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల అంచనాలను అందుకోగలదని అందరూ భావిస్తున్నారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ 30,000 కంటే ఎక్కువ యూనిట్ల బుకింగ్ లను అందుకుంది.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

ఆసక్తిగల కస్టమర్లు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి గానీ లేనా అధీకృత డీలర్‌షిప్ నుండి గానీ ముందస్తుగా రూ. 1947 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. ఇందులో నమ్మ రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్ మరియు బ్రజెన్ బ్లాక్ కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.09 లక్షల ధరతో విడుదలైంది.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

సింపుల్ ఎనర్జీ సుమారు 13 రాష్ట్రాల్లోని 75 నగరాల్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల డెలివరీ మరియు సర్వీస్ కోసం డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. సింపుల్ ఎనర్జీ అందిస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్‌లో 236 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఛార్జర్ సింపుల్ లూప్ సహాయంతో, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 60 సెకన్లలోనే 2.5 కిమీ పరిధికి సరిపడా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీని నేరుగా 0-100 శాతం ఛార్జ్ చేయడానికి 2.75 గంటల సమయం పడుతుందని, అయితే ఇందులోని తొలగించగల బ్యాటరీని విడిగా తీసి ఛార్జ్ చేయడానికి అదనంగా మరో 75 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంలో, రెండు బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి మొత్తంగా 4 గంటల సమయం పడుతుంది. ఇది ఇంటి వద్ద ఇండే ఏసి చార్జర్ సాయంతో చార్జ్ చేస్తే దాదాపు 2.75 గంటల్లో సుమారు 0 నుండి 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

సింపుల్ ఎనర్జీ రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇది వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రయోజనాలను అందించనుంది. ఈ స్కూటర్ కేవలం 2.95 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని బూడిద రంగు బ్యాటరీ ప్యాక్ 6 కిలోల కంటే ఎక్కువ బరువును కలిగి టుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ప్రత్యేకంగా భారతీయ ఉపయోగం కోసం రూపొందించబడింది.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధానంగా లభించే ఫీచర్లు మరియు టెక్నాలజీలను గమనిస్తే, ఇందులో.. 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, నావిగేషన్ డిస్‌ప్లే, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, 4G LTE, ఓటిఏ అప్‌డేట్స్, ఫాస్ట్ ఛార్జర్ గుర్తింపు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, కాల్స్ మరియు మ్యూజిక్ కంట్రోల్, వెహికల్ ట్రాకిం0గ్, డాక్యుమంట్ స్టోరేజ్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్, ముందు మరియు వెనుక 90 మిమీ డ్రమ్ బ్రేక్‌లు, 12 ఇంచ్ టైర్లు, 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు 110 కిలోల బరువు మొదలైన వాటిని కలిగి ఉంటుంది.

జూన్ 2022 నుండి ప్రారంభం కానున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు

ఇదిలా ఉంటే, సింపుల్ ఎనర్జీ, రాబోయే రోజుల్లో తన ప్రధాన ఉత్పత్తిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ధృవీకరించింది. సింపుల్ ఎనర్జీ యొక్క కొత్త ఈ-స్కూటర్ ను 'మార్క్-2' పేరుతో ప్రవేశపెట్టనున్నారు. ఇది మే 2022 నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త స్కూటర్ (మార్క్-2) మొదట్లో భారతదేశం అంతటా ఎంపిక చేసిన నగరాల్లో లభ్యం కానుంది. ఈ నగరాల తరువాత బెంగళూరు మరియు ఢిల్లీ తరువాత చెన్నై, ముంబై మరియు హైదరాబాద్ లలో లభిస్తాయి. సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు సుహాస్ రాజ్‌కుమార్ దీని గురించి సమాచారం ఇచ్చారు.

Most Read Articles

English summary
Simple energy to start its electric scooter deliveries from june 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X