అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త మోటార్‌సైకిల్ 'టీవీఎస్ అపాచే 165 ఆర్‌పి' (TVS Apache 165 RP) లిమిటెడ్ ఎడిషన్ అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయినట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ మోటార్‌సైకిల్ ను గడచిన డిసెంబర్ నెలాఖరులో దేశీయ విపణిలో విడుదల చేసింది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించబడింది.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

ప్రస్తుతం టీవీఎస్ విక్రయిస్తున్న స్టాండర్డ్ Apache RTR 160 4V మోడల్ ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ Apache RTR 165 RP ని విడుదల చేసింది. ఇందులో ఆర్‌పి అంటే 'రేస్ పెర్ఫార్మెన్స్' అని అర్థరం. ఈ RP సిరీస్ కింద అభివృద్ధి చేయబడిన కొత్త అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్ ఉత్పత్తిని కంపెనీ కేవలం 200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. ఈ బైక్ మార్కెట్లో విడుదలైన మొదటి రెండు వారాల్లోనే పూర్తిగా 200 యూనిట్లు అమ్ముడైపోయినట్లు కంపెనీ తెలిపింది.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

ఈ మొత్తం 200 యూనిట్లు డెలివరీలు కాకమునుపే అమ్ముడయ్యాయని టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ప్రకటించింది. ఈ కొత్త రేస్ పెర్ఫార్మెన్స్ మోడల్ ను స్టాండర్డ్ అపాచే 165 మోడల్ ఆధారంగానే రూపొందించినప్పటికీ, ఇందులో కంపెనీ అనేక అప్‌గ్రేడ్‌లను చేసింది. టీవీఎస్ యొక్క కొత్త రేస్ పెర్ఫార్మెన్స్ సిరీస్‌లో భాగంగా భారతదేశంలో విడుదలైన మొదటి మోటార్‌సైకిల్. భవిష్యత్తులో కంపెనీ ఈ రేస్ పెర్ఫార్మెన్స్ (RP) సిరీస్ లో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

కొత్త TVS Apache 165 RTR RP రేస్ ప్రేరేపిత బ్లూ, వైట్ మరియు రెడ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేయబడింది. స్టాండర్డ్ అపాచే ఆర్టీఆర్ 160 4వి తో పోల్చుకుంటే, ఈ కొత్త ఆపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్ మరింత ఎక్కువ పవర్ మరియు మరింత అదనపు స్టైల్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, టీవీస్ మోటార్ కంపెనీ ఈ బైక్ ను 25 శాతం పెరిగిన స్థిరత్వంతో డబుల్ క్రెడిల్ సింక్రో స్టఫ్ ఛాసిస్‌తో నిర్మించింది. ఈ బ్రాండ్ ఇటీవలే తన 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ నేపథ్యంలో, కొత్త ఆపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి పై కూడా ఈ స్పెషల్ గ్రాఫిక్స్ ప్రింట్ చేయబడి ఉంటాయి.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

ఈ కొత్త మోడల్ లోని కలర్ ఆప్షన్ చాలా స్పోర్టీ అప్పీల్ ను కలిగి ఉంటుంది. ఇందులోని వీల్స్ ఈ స్పోర్టీ అప్పీల్ ను మరింత పెంచుతాయి. అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్‌లోని బ్రాస్ కోటింగ్ తో కూడిన చైన్ కూడా చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది. సాధారణ చైన్‌ల కంటే ఇది మరింత మన్నికగా మరియు నిశ్శబ్దంగా ఉంటుందని టీవీఎస్ పేర్కొంది. కొత్త అపాచే సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌తో అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్‌ యూనిట్ ను కలిగి ఉంటుంది. ఈ సిగ్నేచర్ ఫ్రంట్ పొజిషన్ ల్యాంప్‌పై కూడా ప్రత్యేకమైన లోగో ముద్రించబడి ఉంటుంది.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

ఇంకా ఇందులో సింగిల్ పీస్ హ్యాండిల్‌బార్, స్టెప్-అప్ డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ రెడ్ సీట్, 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌, 0 నుండి 60 టైమర్ మరియు టాప్ స్పీడ్ రికార్డర్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ముందు భాగంలో షోవా టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందువైపు 270 మిమీ పెటల్ టైప్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

చివరిగా ఇంజన్ విషయానకి వస్తే, స్టాండర్డ్ TVS Apache RTR 160 4V బైక్ లో ఉపయోగించిన 159.7 cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌కు బదులుగా ఈ కొత్త TVS Apache RTR 165 RP వేరియంట్‌లో మరింత శక్తివంతమైన 164.9 cc ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ కొత్త ఇంజన్ లో బైక్ యొక్క రేస్ మెషీన్‌లలో సాధారణంగా కనిపించే హై - లిఫ్ట్ క్యామ్‌లు, పెద్ద వాల్వ్‌లు, డ్యూయల్ యాక్యుయేటర్ స్ప్రింగ్‌లు మరియు డోమ్ ఆకారపు పిస్టన్‌లు వంటి అనేక భాగాలను కూడా కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది.

అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయిన TVS Apache RTR 165 RP స్పెషల్ ఎడిషన్ బైక్!

ఫలితంగా, ఈ అప్‌గ్రేడెడ్ ఇంజన్ ఇప్పుడు గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 19.2 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేయగలదు. టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వితో పోలిస్తే, ఆర్టీఆర్ 165 ఆర్‌పి మోడల్ సుమారుగా 1.65 బిహెచ్‌పిల అదనపు శక్తి లభిస్తుంది. అయితే, అపాచే ఆర్టీఆర్ 165 ఆర్‌పి వేరియంట్ 14.2 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ అపాచే ఆర్టీఆర్ 160 4వి మోడల్ 14.77 ఎన్ఎమ్ టార్క్‌తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది.

Most Read Articles

English summary
The new limited edition tvs apache rtr 165 rp sold out in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X