ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

భారత ఆటోమొబైల్ మార్కెట్లో గడచిన జూలై 2022 నెలలో అనేక కొత్త ఉత్పత్తులు విడుదలయ్యాయి. అయితే, ఈ ఆగస్ట్ 2022 నెలలో మరిన్ని కొత్త ఉత్పత్తులు విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో రాబోయే పండుగ సీజన్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయాలని చూస్తున్నాయి. ప్రత్యేకించి, టూవీలర్ విభాగంలో ఈ ఏడాది ఆగస్టులో దాదాపు 10 మోడళ్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటి వివరాలేంటో చూసేద్దాం రండి.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

1. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోతున్న సరికొత్త ఉత్పత్తి హంటర్ 350. ఈ స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆగస్ట్ 7వ తేదీన విడుదల చేయనుంది. బహుశా ఈ నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కు ఇదే అతిపెద్ద లాంచ్ కావచ్చు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అత్యంత సరసమైన ప్రైస్ ట్యాగ్ ను కలిగి ఉండి, రాయల్ ఎన్‌ఫీల్డ్ టూవీలర్ లైనప్ లోనే అత్యంత తక్కువ ధర కలిగిన బైక్ కావచ్చని భావిస్తున్నారు. దీని ధరను తక్కువగా ఉంచేందుకు ఇందులో క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 వంటి మోటార్‌సైకిళ్లలో ఉపయోగించిన అదే 350సీసీ ఇంజన్ ను మరియు ఇతర భాగాలను ఉపయోగించారు. మార్కెట్లో హంటర్ 350 ధర రూ.1.50 లక్షల నుండి రూ.1.60 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

2. 2022 రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రాబోయే మరొక కొత్త మోడల్ రిఫ్రెష్డ్ 2022 మోడల్ బుల్లెట్ 350. రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఐకానిక్ బుల్లెట్ 350 బైక్ ని చాలా కాలంగా అప్‌గ్రేడ్ చేయలేదు. ఈ నేపథ్యంలో కొత్త 2022 మోడల్ బుల్లెట్ 350 పై భారీ అంచనాలు ఉన్నాయి. బుల్లెట్ 350 ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క ఎంట్రీ-లెవల్ బైక్ గా ఉంది మరియు ఇది మునుపటి తరం UCE ఇంజన్‌తో అందించబడుతుంది. కాగా, కొత్తగా రాబోయే నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ 350 ని కొత్త J-ప్లాట్‌ఫారమ్‌ పై తయారు చేసే అవకాశం ఉంది మరియు దీని ధర సుమారు రూ. 1.70 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

3. అప్‌డేటెడ్ హీరో ఎక్స్‌పల్స్ 200టి

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ కొత్త ఇంజన్ తో అప్‌డేట్ చేయబడిన హీరో ఎక్స్‌పల్స్ 200టి యొక్క 2022 మోడల్ ను కూడా ఈ ఆగస్ట్ నెలలోనే విడుదల చేయవచ్చని సమాచారం. గత సంవత్సరం XPulse 200లో 4V ఇంజన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఇందులోని 200T మోడల్ ఇంకా పాత 2V ఇంజన్‌తోనే విక్రయించబడుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఎక్స్‌పల్స్ 200టి 4వి త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. 1.24 లక్షలు, కాగా ఇందులో చేయబోయే మార్పుల తర్వాత దీని ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

4. హోండా నుండి కొత్త ప్రీమియం బైక్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ ప్రీమియం మోటార్‌సైకిళ్లను హోండా బిగ్‌వింగ్ (Honda BigWing) డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా, కంపెనీ విడుదల చేసిన ఓ టీజర్ ప్రకారం, ఆగస్ట్ 8 వ తేదీ మరో సరికొత్త హోండా బిగ్‌వింగ్ ప్రీమియం మోటార్‌సైకిల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ఏరకమైన మోడల్ అనే దాని గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఓ నివేదిక ప్రకారం, ఇది అప్‌డేటెడ్ CB500X స్పోర్ట్స్ బైక్ కావచ్చు లేదా సరికొత్త Forza 350 మ్యాక్సీ స్కూటర్‌ కూడా కావచ్చు.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

5. జోంటెస్ మరియు మోటో మోరిని

జోంటెస్ మరియు మోటో మోరిని ఈ రెండు బ్రాండ్‌లు భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు, ఇక్కడి మార్కెట్లో బెనెల్లీ మరియు కీవే బ్రాండ్లతో వ్యాపారం చేస్తున్న అదే సంస్థ AARI (ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా)తో చేతులు కలిపాయి. జోంటెస్ భారతదేశం కోసం ఐదు మోటార్‌సైకిళ్లను ప్లాన్ చేయగా, మోటో మోరిని దేశంలో నాలుగు మోడళ్లను విడుదల చేయాలని చూస్తోంది.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

6. మరో కొత్త కీవే మోడల్

ఇటీవలే భారత మార్కెట్లో వ్యాపారం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ఇంటర్నేషనల్ టూవీలర్ బ్రాండ్ కీవే, తమ కొత్త మోడల్ ను ఈ ఆగస్ట్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. కీవే భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన సమయంలో, ఇక్కడి మార్కెట్లో ఓ ఏడాది వ్యవధిలో మొత్తం ఎనిమిది ఉత్పత్తులను తీసుకురావాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. వీటిలో మొదటి మూడింటిని కంపెనీ ఇప్పటికే పరిచయం చేసింది మరియు తదుపరిది మోడల్ ను ఆగస్టులో ప్రారంభించబడుతుంది. ఈ కొత్త టూవీలర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

7. హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్

అమెరికన్ టూవీలర్ బ్రాండ్ హార్లే డేవిడ్‌సన్ భారతదేశంలో నేరుగా వ్యాపారం చేయకపోయినప్పటికీ, హీరో మోటోకార్ప్ ద్వారా కుదుర్చుకున్న డీల్ ద్వారా ఇక్కడి మార్కెట్లో పరోక్షంగా వ్యాపారం చేస్తోంది. హార్లే డేవిడ్‌సన్ గత సంవత్సరం తమ స్పోర్ట్‌స్టర్ లైన్ లో సరికొత్త స్పోర్ట్‌స్టర్ ఎస్ ని పరిచయం చేయడం ద్వారా ఈ లైనప్ ను అప్‌డేట్ చేసింది. ఇందులో పాన్ అమెరికా 1250 నుండి పంచుకున్న అండర్‌పిన్నింగ్‌లు ఉన్నాయి. కొత్త హార్లే డేవిడ్‌సన్ స్పోర్ట్‌స్టర్ బైక్ కూడా ఈ ఆగస్ట్ నెలలోనే విడుదల కావచ్చని సమాచారం.

ఆగస్ట్ 2022లో విడుదల కాబోయే టాప్ 10 మోటార్‌సైకిళ్లు.. రైడ్ చేయడానికి మీరు రెడీనా..?

మూడు డ్యుకాటి బైక్స్

ఇక ఈ జాబితాలో మిగిలిన మూడు మోడళ్లను డ్యుకాటి విడుదల చేసే అవకాశం ఉంది. వీటిలో డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2, డ్యుకాటి పానిగేల్ వి4 మరియు డ్యుకాటి పానిగేల్ వి4 ఎస్‌పి2 మోడళ్లు ఉన్నాయి. ఈ మూడు మోడళ్లు కూడా అప్‌డేటెడ్ ఫీచర్లతో అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top 10 motorcycle launches in august 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X