బైక్ ప్రేమికుల కోసం ప్రత్యేకం: భారత్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 250సిసి బైకులు.. వివరాలు

భారతీయ మార్కెట్లో మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ ఉందనే విషయం అందరికి తెలిసిందే, అయితే ఇందులో కూడా 250 సిసి విభాగంలోని బైకులను మరింత ఎక్కువ గిరాకీ ఉంది.

250సిసి విభాగంలో కెటిఎమ్ 250 డ్యూక్, బజాజ్ F250, యమహా FZ 25, సుజుకి V-స్టార్మ్ SX మరియు బజాజ్ డామినార్ 250 ఉన్నాయి. ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అందుబాటులో ఉన్న టాప్ 5 250సిసి బైకులు

కెటిఎమ్ 250 డ్యూక్:

భారతీయ మార్కెట్లో ఎక్కువమంది యువ కొనుగోలుదారులు ఇష్టపడే బైకుల్లో కెటిఎమ్ బ్రాండ్ ఒకటి. ఇందులో 250 డ్యూక్ అత్యంత ఆదరణ పొందిన మోడల్. ఇందులోని 248.7 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ 29.6 బిహెచ్‌పి పవర్ మరియు 24 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది, ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 2.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

బజాజ్ ఎఫ్250:

బజాజ్ ఆటో యొక్క ఎఫ్250 బైక్ కూడా 250సిసి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు. ఈ బైక్ యొక్క 249 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ 23.5 బిహెచ్‌పి పవర్ మరియు 21.3 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

యమహా ఎఫ్‌జెడ్ 25:

యమహా కంపెనీ యొక్క ఎఫ్‌జెడ్ 25 బైక్ ధర భారతీయ మార్కెట్లో రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో 249 సిసి ఎయిర్ కూల్డ్ ఉంటుంది. ఇది 20.51 బిహెచ్‌పి పవర్ మరియు 20.1 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 14 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల రోజు వారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్:

250 సిసి విభాగంలో మంచి ప్రజాదరణ పొందుతున్న బైకుల్లో 'సుజుకి వి-స్టార్మ్ ఎస్ఎక్స్' ఒకటి. ఈ బైక్ ధర రూ. 2.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 249 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ 9,300 ఆర్‌పిఎమ్ వద్ద 26.5 బిహెచ్‌పి పవర్ మరియు 7,300 ఆర్‌పిఎమ్ వద్ద 22.2 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

బజాజ్ డామినార్ 250:

బజాజ్ ఆటో యొక్క మరో బైక్ డామినార్ 250 అనేది 250 సిసి విభాగంలో మంచి అమమకాలు పొందుతున్న బైక్. ఈ బైక్ ధర రూ. 1.75 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 248.7 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 26.6 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 23.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఈ విభాగంలోని బైకులకు పెరుగుతున్న డిమాండ్ వల్ల మరిన్ని ఆధునిక బైకులు ఈ విభాగంలో అడుగు పెడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి పైన తెలిపిన ఈ బైకులు ఈ విభాగంలో తిరుగులేని అమ్మకాలను పొందుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు, కొత్త బైకులు మరియు కార్లను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Top five 250cc motorcycles in india ktm bajaj and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X