Just In
- 4 hrs ago
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- 7 hrs ago
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- 8 hrs ago
మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..
- 12 hrs ago
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
Don't Miss
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
కొత్త కలర్‌లో విడుదలైన TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్: ధర & వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' తన 'అపాచే' సిరీస్‌లోని RTR 160 4V ఎడిషన్‌కు కొత్త కలర్ ఆప్సన్ అందించింది. ఇది చూడటానికి మునుపటి బైక్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉంది.
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2023 TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ ఇప్పడు 'పెర్ల్ వైట్ కలర్'లో సరికొత్త లైట్ వెయిట్ బుల్‌పప్ ఎగ్జాస్ట్‌ను పొందుతుంది. బాడీ చాలా వరకు పెర్ల్ వైట్ కలర్‌లో ఉన్నప్పటికీ ఫ్యూయల్ ట్యాంక్, సీటు మరియు వెనుక చక్రం యొక్క మధ్య భాగంలో రెడ్ కలర్ చూడవచ్చు. ఇది ఈ బైక్ కి మరింత ఆకర్షను తీసుకువస్తుంది.

టీవీఎస్ అపాచే స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే కూడా ఒక కేజీ తక్కువ బరువు వద్ద లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో అడ్జస్టబుల్ క్లచ్ మరియు బ్రేక్ లీవర్‌లు, టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect), గేర్‌షిఫ్ట్ ఇండికేటర్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ లతో కూడిన ఆల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి. అయితే ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేదు.
దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ పెర్ల్ వైట్ కలర్ ధర రూ. 1,30,090 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త బైక్ కొనుగోలుచేయాలనుకునే ఆసక్తికలిగిన కస్టమర్లు కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ మునుపటికంటే ఎక్కువ ఆకర్షణీయమైన కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది కావున తప్పకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగె అవకాశం ఉందని ఆశిస్తున్నాము.
కొత్త TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ అదే 159.7 సిసి ఆయిల్-కూల్డ్, SOHC, ఫ్యూయల్-ఇంజెక్ట్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 9250 ఆర్‌పిఎమ్ వద్ద 17.39 బిహెచ్‌పి పవర్ మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఇందులో అర్బన్, స్పోర్ట్స్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
కొత్త Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ 'విమల్ సుంబ్లీ' మాట్లాడుతూ.. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ సిరీస్ మోటార్‌సైకిళ్లు అత్యాధునిక టెకనాలజీతో నిండి ఉండటం వల్ల ఇప్పటికి కూడా మంచి అమమకాలు పొందుతూ ముందంజలో దూసుకెళ్తున్నాయి. నాలుగు దశాబ్దాలుగా కస్టమర్లు దీనిపైన పెంచుకున్న నమ్మకమే ఈ రోజు కొత్త ఎడిషన్ లాంచ్ కావడానికి కారణమైందన్నారు.
అంతే కాకుండా మార్కెట్లో వాహనం ప్రియులు ఎప్పటికప్పుడు కొత్తదాన్నని కోరుకుంటున్నారు, వారి కోరిక ప్రకారం ఈ కొత్త కలర్ ఎడిషన్ లాంచ్ చేయడం జరిగింది. ఇది తప్పకుండా బైక్ ప్రేముకులకు నచుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని ఆధునిక ఉత్పత్తులను, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో తీసుకురావడానికి కంపెనీ కృషి చేస్తోంది. రానున్న కొత్త ఉత్పత్తులు కూడా తప్పకుండా వాహన వినియోగదారుల అభిరుచి మేరకు తయారవుతాయన్నారు.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
దేశీయ వాహన మార్కెట్లో రోజు రోజుకి వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఈ కారణంగా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే టీవీఎస్ కంపెనీ TVS Apache RTR 160 4V స్పెషల్ ఎడిషన్ ను కొత్త కలర్ ఆప్సన్ లో తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.