ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు యమహా (Yamaha) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త పాపులర్ బైక్ FZS-Fi కొత్త మోడల్‌ విడుదల చేసింది. ఈ బైక్ 2022 వ సంవత్సరంలో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన మొదటి బైక్. ఈ బైక్ ఆధునిక డిజైన్ కలిగి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యమహా FZS-Fi రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి యమహా FZS-Fi కాగా మరొకటి యమహా FZS-Fi Dlx వేరియంట్. వీటి ధరలు దేశీయ మార్కెట్లో వరుసగా రూ. 1,15,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), మరియు రూ. 1,18,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఈ రెండు ఆధునిక బైక్స్ ఆధునిక డిజైన్ కలిగి ఉంటాయి. అంతే కాకూండా ఈ మోడల్స్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లను పొందుతాయి. Dlx వేరియంట్ మూడు కొత్త రంగులలో అందుబటులో ఉంది. అవి మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ డీప్ రెడ్ మరియు సాలిడ్ గ్రే.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

కంపెనీ విడుదల చేసిన ఈ రెండు బైకులు కూడా రెండు డ్యూయల్ టోన్ కలర్స్ కలిగి, అద్భుతమైన బాడీ గ్రాఫిక్స్, కలర్ అల్లాయ్ వీల్స్ మరియు టూ-లెవల్ కలర్ సీట్లు కలిగి చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి. అంతే కాకూండా ఇవి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

యమహా యొక్క రెండు బైకులు యమహా యొక్క బ్లూటూత్ ఎనేబుల్డ్ కనెక్ట్-ఎక్స్ యాప్ ద్వారా అందించబడ్డాయి. ఈ యాప్ సహాయంతో కాల్ ఆన్సర్ చేయడం, బైక్ లొకేషన్, పార్కింగ్ రికార్డ్స్ అలర్ట్‌లు మరియు రైడింగ్ హిస్టరీ వంటి అనేక సమాచారం అందిస్తుంది. ఇవన్నీ రైడింగ్ సమయంలో వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఇందులో రియర్ డిస్క్ బ్రేక్, మల్టీ-ఫంక్షన్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడి హెడ్‌లైట్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్, లోయర్ ఇంజన్ గార్డ్‌తో ముందువైపు సింగిల్ ఛానల్ ABS ఉన్నాయి. రైడింగ్ సమయంలో ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఇక ఈ కొత్త బైకుల్లోని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇందులో సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ 149 సిసి ఇంజిన్ ఉంటుంది. ఇది 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.4 బిహెచ్‌పి పవర్‌ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఈ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ 'ఈషిన్ చిహానా' మాట్లాడుతూ.. కాల్ ఆఫ్ ది బ్లూ ఇనిషియేటివ్ కింద, మేము మా కస్టమర్‌లను చేరుకోవడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు కస్టమర్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్డేటెడ్ మోడల్స్ కూడా విడుదల చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కొత్త మోడల్స్ కూడా విడుదల చేయడం జరిగిందని ఆయన అన్నారు.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ గత సంవత్సరం దేశీయ మార్కెట్లో సరికొత్త మాక్సీ స్కూటర్ 'ఏరోక్స్ 155' విడుదల చేసింది. భారత మార్కెట్లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులోని బేస్ వేరియంట్ ధర రూ. 1.29 లక్షలు కాగా, స్పెషల్ ఎడిషన్ మోటో జిపి ఎడిషన్ ధర రూ. 1.30 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఈ కొత్త స్కూటర్ లో యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ నే ఉపయోగించారు. కానీ ఇది ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కోసం వేరియబుల్ వాల్వ్ అక్యుమ్యులేషన్ (వివిఏ) టెక్నాలజీని కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 15.36 బిహెచ్‌పి పవర్ ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటి గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి, లేటెస్ట్ యమహా ఆర్15 వి7 4.0 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 4 బిహెచ్‌పి తక్కువగా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన Yamaha FZS-Fi: ధర & వివరాలు

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ ఈ విభాగంలో ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 కి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కొత్త యమహా స్కూటర్ ఏప్రిలియా స్కూటర్ కన్నా శక్తివంతమైనది. యమహా Aerox 155 అనేది ఇండియన్ మార్కెట్లో 150-160 సీసీ ప్రీమియం స్కూటర్ స్పేస్‌లోకి ప్రవేశించిన బ్రాండ్ యొక్క మొదటి ఉత్పత్తి అవుతుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha fzs fi and fzs fi dlx launched price features specifications details
Story first published: Monday, January 3, 2022, 16:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X