ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

భారతీయ ద్విచక్ర వాహన విభాగం రోజురోజుకి చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో చాలా కంపెనీ కొత్త కొత్త బైకులను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు Yezdi బ్రాండ్ కూడా ఎట్టకేలకు తన అడ్వెంచర్ బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Yezdi Adventure బైక్ ప్రారంభ ధర రూ. రూ. 2.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కంపెనీ ఈ బైక్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

కొత్త Yezdi Adventure మూడు కలర్ ఆప్సన్ లో అందుబటులో ఉంటుంది. అవి స్లిక్ సిల్వర్, మంబో బ్లాక్ మరియు రేంజర్ కామో కలర్స్. ఈ బైక్ ధరలు కలర్ ఆప్సన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. Yezdi Adventure ధరలు గమనించినట్లయితే..

 • యెజ్డీ అడ్వెంచర్ స్లిక్ సిల్వర్ (Yezdi Adventure Slick Silver): రూ. 2.09 లక్షలు
 • యెజ్డీ అడ్వెంచర్ మంబో బ్లాక్ (Yezdi Adventure Mambo Black): రూ. 2.11 లక్షలు
 • యెజ్డీ అడ్వెంచర్ రేంజర్ కామో (Yezdi Adventure Ranger Camo) : రూ. 2.18 లక్షలు
 • కొత్త యెజ్డీ అడ్వెంచర్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది, ఈ ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు మరియు పొడవైన విండ్‌స్క్రీన్ ఉంటాయి. కావున ఇవన్నీ కూడా బైక్ కి అడ్వెంచర్ లుక్ ఇస్తాయి. ఇందులోని పెద్ద 15.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, పెద్ద క్రాష్ గార్డ్‌లు మరియు రియర్ ర్యాక్ వంటివి కూడా దీనికి అడ్వెంచర్ రూపాన్ని అందిస్తాయి.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  ఈ కొత్త బైక్ యొక్క కుడివైపు రైడర్ ఎర్గోనామిక్స్, లార్జ్ స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి టర్న్-సిగ్నల్ ఇండికేటర్, ఫుట్‌పెగ్‌లు, USB A-టైప్ మరియు C-టైప్ ఛార్జింగ్ స్లాట్‌లు వంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా సరైన దృశ్య మానతను అందించడానికి టిల్ట్ ఫంక్షన్‌తో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీని స్టాండర్డ్‌గా కలిగి ఉంది, ఇది సెకండరీ డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  ఈ బైక్ లోని మెయిన్ కన్సోల్ రైడర్‌కు గేర్-పొజిషన్ ఇండికేటర్, మల్టిపుల్ ట్రిప్ మీటర్లు మరియు మైలేజ్ వంటి మరిన్ని వివరాలను అందిస్తుంది, కావున ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  యెజ్డీ అడ్వెంచర్‌ బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. అడ్వెంచర్ బైక్ అత్యధిక పవర్ మరియు టార్క్ ఫిగర్‌లను కలిగి ఉన్న మూడు మోటార్‌సైకిళ్లలో అత్యంత శక్తివంతమైన బైక్.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  ఈ కొత్త బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 200 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపు 180 మిమీ అడ్జస్టబుల్ మోనో-షాక్ కలిగి ఉంటుంది. ఇది 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 815 మిమీ వరకు ఉంటుంది.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  అదే విధంగా ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 240 మిమీ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అందుబటులో ఉంటుంది. ఇందులోని ఏబీఎస్ మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి రైన్, రోడ్ మరియు ఆఫ్-రోడ్ మోడ్స్.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  ఈ కొత్త అడ్వెంచర్ బైక్ యొక్క ముందు భాగంలో 90/90 సెక్షన్ టైర్‌తో 21 ఇంచెస్ స్పోక్ రిమ్ షాడ్ మరియు వెనుకవైపు 130/80 సెక్షన్ టైర్‌తో 17 ఇంచెస్ స్పోక్ రిమ్ షాడ్‌ కలిగి ఉంది. టైర్లు ఆన్ మరియు ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం బ్లాక్-ప్యాటర్న్ ట్రెడ్‌ను కలిగి ఉంటాయి. కావున ఇవి ఎటువంటి రహదారిలో అయినా రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త యెజ్డీ అడ్వెంచర్ బైక్ కోసం కంపెనీ యాక్ససరీస్ కూడా అందిస్తుంది. ఇందులో సేడ్ ఫన్నీయర్, టాప్ ఫన్నీయర్ బాక్స్, ఆక్సియాల్లరీ లైట్స్ (Auxiliary Lights) మరియు జెర్రీ కార్న్స్ వంటివి ఉన్నాయి. మొత్తానికి ఈ బైక్ వాహన వినియోగదారులకు చాలా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

  ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన Yezdi Adventure బైక్: ధర & వివరాలు

  Yezdi అడ్వెంచర్ ఒక మంచి ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్, కావున ఇది దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, Hero XPulse మరియు KTM 250 అడ్వెంచర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో వీటితో పోటీపడి మనుగడ సాగుస్తుందా.. లేదా.. అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

Read more on: #యెజ్డి #yezdi
English summary
Yezdi adventure launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X