Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

మొత్తానికి యెజ్డీ (Yezdi) బ్రాండ్ భారతీయ మార్కెట్లో మళ్ళీ అడుగుపెట్టింది. ఇందులో భాగంగానే కంపెనీ తన లైనప్‌లో అడ్వెంచర్ బైక్ (Yezdi Adventure) కూడా విడుదల చేసింది. ఈ బైక్ దేశీయ విఫణిలో రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క హిమాలయన్ (Royal Enfield Himalayan) కి ప్రత్యక్ష ప్రత్యర్థిగా నిలుస్తుంది.

మనం ఈ ఆర్టికల్ లో Yezdi Adventure మరియు Royal Enfield Himalayan కి మధ్య ఉన్న పోలికలేంటి మరియు డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని విషయాలను గురించి తెలుసుకుందాం.. రండి.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

Yezdi Adventure vs Royal Enfield Himalayan - ఇంజిన్:

యెజ్డీ అడ్వెంచర్‌ బైక్ 334 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 30 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సింగిల్-సైడ్ ఎగ్జాస్ట్ మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

ఇక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 411 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఇది 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పి పవర్ మరియు 4,000-4,500 ఆర్‌పిఎమ్ మధ్య 32 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కి జత చేయబడి ఉంటుంది.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

ఈ రెండు బైకులలోనూ రెండు వేర్వేరు ఇంజన్లు ఉన్నాయి. అయితే ఇక్కడ యెజ్డీ షార్ట్-స్ట్రోక్ మోటారును కలిగి ఉంది. ఇది హై రివ్‌లను చేస్తుంది మరియు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో హిమాలయన్ స్లో-రివింగ్ చేసే లాంగ్-స్ట్రోక్ ఇంజిన్‌ను పొందుతుంది. మొత్తానికి ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

Yezdi Adventure vs Royal Enfield Himalayan - బాడీ & చాసిస్

Yezdi Adventure బైక్ విషయానికి వస్తే, ఈ బైక్ బరువు 188 కేజీల వరకు ఉంటుంది. ఇందులో సీటింగ్ ఎత్తు 815 మిమీ, వీల్‌బేస్ 1,465 మిమీ వరకు ఉంటుంది. అయితే ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.5 లీటర్లు. ఇది 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, 21 ఇంచెస్ ఫ్రంట్ టైర్లు, 17 ఇంచెస్ రియర్ టైర్లను కలిగి ఉంటుంది. అదే విధంగా ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు 240 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ పొందుతుంది.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ విషయానికి వస్తే, ఇది 199 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఇందులో సీటు ఎత్తు 800 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క వీల్‌బేస్ 1,465 మిమీ. హిమాలయన్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్. ఇందులో టెలిస్కోపిక్ ఫోకస్ ఫ్రంట్ సస్పెన్షన్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, 21-ఇంచెస్ ఫ్రంట్ టైర్లు, 17-ఇంచెస్ రియర్ టైర్లు, 320 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 240 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిమీ వరకు ఉంటుంది.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

Yezdi Adventure vs Royal Enfield Himalayan - ఫీచర్లు:

Yezdi Adventure ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో లార్జ్ స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి టర్న్-సిగ్నల్ ఇండికేటర్, ఫుట్‌పెగ్‌లు, USB A-టైప్ మరియు C-టైప్ ఛార్జింగ్ స్లాట్‌లు వంటివి కూడా ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా సరైన దృశ్య మానతను అందించడానికి టిల్ట్ ఫంక్షన్‌తో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీని స్టాండర్డ్‌గా కలిగి ఉంది, ఇది సెకండరీ డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ విషయానికి వస్తే, ఇందులో కూడా ఆధునిక ఫీచర్స్ ఉంటాయి. ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ కలిగి ఉంటుంది. కానీ యెజ్డీ అడ్వెంచర్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను పొందుతుంది. ఇది కాకుండా, Yezdi అడ్వెంచర్‌లో ఫుల్ల్ ఎల్ఈడీ లైటింగ్ ఉపయోగించబడింది, అయితే హిమాలయన్‌లో ఎల్ఈడీ లైటింగ్ అందుబాటులో లేదు.

Royal Enfield Himalayan కి ప్రత్యర్థిగా Yezdi Adventure: కంపారిజన్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మొత్తానికి దేశీయ మార్కెట్లో Royal Enfield Himalayan కి సరైన ప్రత్యర్థిగా Yezdi Adventure విడుదలైంది. ఈ రెండు బైకులు డిజైన్ విషయంలో గాని, ఫీచర్స్ విషయంలో గాని మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయంలో తమకు తామే సాటిగా ఉన్నాయి. కావున ఇవన్నీ బేరీజు చేసుకుని కొనుగోలుదారులు తమకు నచ్చిన బైక్ కొనుగోలు చేయవచ్చు.

Most Read Articles

English summary
Yezdi adventure vs royal enfield himalayan comparison engine features chasis details
Story first published: Friday, January 14, 2022, 18:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X