భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండ్లలో ఒకటి Yezdi. ఇది 90 ల లోనే ద్విచక్ర వాహన మార్కెట్‌ను తిరుగులేకుండా పాలించింది. అటువంటి కంపెనీ ఇప్పుడు భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ (Yezdi Roadster) బైక్ విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.98 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త యెజ్డీ రోడ్‌స్టర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అవి ఒకటి డార్క్ వేరియంట్ కాగా, మరొకటి క్రోమ్ వేరియంట్. అయితే ఈ బైక్ యొక్క ధర అనేది ఎంపిక చేసుకునే కలర్ ఆప్సన్ మీద ఆధారపడి ఉంటుంది. కలర్ అప్సన్ ఆధారంగా ఈ బైక్ యొక్క ధరలను గమనించినట్లయితే..

  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - స్మోక్ గ్రే (Yezdi Roadster Dark - Smoke Grey): రూ. 1,98,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - స్టీల్ బ్లూ (Yezdi Roadster Dark - Steel Blue): రూ. 2,02,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ డార్క్ - హంటర్ గ్రీన్ (Yezdi Roadster Dark - Hunter Green): రూ. 2,02,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ క్రోమ్ - గాలంట్ గ్రే (Yezdi Roadster Chrome - Gallant Grey): రూ. 2,06,142
  • యెజ్డీ రోడ్‌స్టర్ క్రోమ్ - సిన్ సిల్వర్ (Yezdi Roadster Chrome - Sin Silver): రూ. 2,06,142
  • సాధారణంగా Yezdi మోటార్‌సైకిల్స్ ఇతర మోటార్ సైకిల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటాయి. యెజ్డీ రోడ్‌స్టర్ మరియు దాని యొక్క ఇతర వేరియంట్‌లు ఐకానిక్ మోటార్‌సైకిళ్లు మాదిరిగా ఉంటాయి. చాలా కాలం తరువాత ఈ బ్రాండ్ మళ్ళీ రోడ్డుపైకి రానుంది. ఇది మొత్తానికి అద్భుతమైన డిజైన్ కలిగి వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    యెజ్డీ రోడ్‌స్టర్‌ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్‌ ఉంటుంది. అదే సమయంలో ఫోర్క్ హై లెవెల్ రేక్‌ను కలిగి. ఇందులోని హ్యాండిల్‌బార్ కూడా పైకి ఉంటుంది, కావున రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ కొత్త బైక్ దాని మునుపటి మోడల్ ని గుర్తుచేసుకుని విధంగా రూపొందించబడిందని ఇక్క మనకు తెలుస్తుంది.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    ఇందులో డిజిటల్ స్పీడోమీటర్ ముందు ఫోర్క్ పైన అమర్చబడి ఉంటుంది. అయితే కీహోల్ అనేది మోటార్ సైకిల్ యొక్క కుడి వైపున ఉంచబడుతుంది. ఈ కొత్త రోడ్‌స్టర్ 12.5 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. అదే సమయంలో ట్యాంక్‌పైన Yezdi బ్యాడ్జింగ్‌ను పొందుతారు.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    ఈ మోటార్‌సైకిల్‌లో ఎక్కువ మొత్తంలో క్రోమ్ ఉంది. ఇది హెడ్‌లైట్ గ్రిల్, USB టైప్-సి ఛార్జింగ్ సాకెట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి కొన్ని ఆప్సనల్ ఫీచర్‌లను కూడా పొందుతుంది. అంతే కాకుండా మోటార్‌సైకిల్ డబుల్ క్రెడిల్ ఛాసిస్‌ను కలిగి ఉంది.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    ఈ బైక్ లోని ఇంజిన్ పాత టూ-స్ట్రోక్ ఇంజిన్‌ను పోలి ఉండే ఆకృతిని పోలి ఉంటుంది. ఇది లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అయినప్పటికీ, సిలిండర్ మరింత రెట్రోగా కనిపించేలా కూలింగ్ వింగ్స్ కలిగి ఉంటుంది. సింగిల్-పీస్ సీటు, బ్యాక్‌రెస్ట్‌తో కలిపి సౌకర్యవంతంగా మరియు సపోర్టివ్‌గా కనిపిస్తుంది.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    యెజ్డీ రోడ్‌స్టర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది స్టైలిష్‌గా కనిపించే వృత్తాకార LCD యూనిట్ మరియు చాలా సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులో ట్రిప్ మీటర్లు, డిస్టెన్స్-టు-ఎంప్టీ రీడౌట్, గేర్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్ మొదలైనవి ఉంటాయి. ఇది టెల్-టేల్ లైట్లు మరియు సూచికలతో చుట్టుముట్టబడి ABS మోడ్‌ను కూడా ప్రదర్శిస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లో డ్యూయల్-ఛానల్ ABS స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌తో వస్తుంది.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    కొత్త యెజ్డీ రోడ్‌స్టర్, ఇతర రెండు యెజ్డీ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే, ఇంజిన్‌ను జావా పెరాక్ నుండి పొందింది. ఇందులో 334 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా పొందుతుంది, అదే సమయంలో ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

    భారత్‌లో కొత్త Yezdi Roadster బైక్ విడుదల: ధర రూ. 1.98 లక్షలు

    ఈ కొత్త బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందువైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుక 240 మిమీ డిస్క్ బ్రేకింగ్ సెటప్ కలిగి ఉంటుంది.

    ఈ మోటార్‌సైకిల్ 100/90 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌తో 18-ఇంచెస్ వీల్ అప్ ఫ్రంట్ షాడ్‌పై నడుస్తుంది. అదే సమయంలో దీని వెనుక భాగంలో 130/80 సెక్షన్ టైర్‌తో 17 ఇంచెస్ వీల్ షాడ్ ఉంటుంది. ఈ కొత్త బైక్ యొక్క మొత్తం బరువు 184 కేజీలు. అయితే ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు. మొత్తానికి ఈ బైక్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది, అయితే ఇది భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో విజయం పొందుతుందా మరియు ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందగలుగుతుందా అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.

Most Read Articles

Read more on: #యెజ్డి #yezdi
English summary
Yezdi roadster launched in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X